మీరు ఓడిపోయారు . ఎందుకు,?
x
కల్వకుంట్ల చంద్రశేఖరరావు

మీరు ఓడిపోయారు . ఎందుకు,?

పది సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ దినోత్సవంరోజున రవీంద్రభారతి స్టేజ్ పై ఖాళీగా ఉన్న కుర్చీని అడుగు నువ్వు ఎందుకు ఓడిపోయావో చెబుతుంది.


ఒక తెలంగాణ ఉపాధ్యాయుని మనోగతం

తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ ఓడిపోయింది. ఆయన, ఆయన పార్టీ బీఆర్ఎస్ ఓడిపోయిన తీరుపై సెటైర్లు పేలుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో భుజం భుజం కలిపి కదం తొక్కి పాట పాడిన వాళ్ల మొదలు నిన్న మొన్నటి ఆర్టీసీ, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల వరకు ఎందరెందరో, ఎవరెవరో కామెంట్లు, మనోగతాలు, భావోద్వేగాలు, ఎక్కిరింపులు, ఎగతాళ్లు.. చేస్తూ సెటైర్లు పేలుతున్నాయి. ఓ తెలంగాణ ఉపాధ్యాయుడు మనోగతం ఇప్పుడో కథనం నెట్టింట హల్ చల్ చేస్తోంది. చాలా హుందాగానే భావస్పోరకంగా ఉన్న ఆ మనోగతాన్ని చదవండి. (రాసినాయన ఎవరో తన పెట్టుకోలేదు)

మీరెందుకు ఓడియారంటే...

👉 పది సంవత్సరాలనుంచి టీచర్లకు నల్ల రిబ్బన్లు అమ్మిన షాప్ ఓనర్నడుగు నువ్వు ఎందుకు ఓడిపోయావో చెబుతాడు.

👉పది సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ దినోత్సవంరోజున రవీంద్రభారతి స్టేజ్ పై ఖాళీగా ఉన్న కుర్చీని అడుగు నువ్వు ఎందుకు ఓడిపోయావో చెబుతుంది.

👉ఉపాధ్యాయులను గౌరవించనవసరం లేదని మీకు నేర్పిన, మీరు చదివిన డెబ్బైవేల పుస్తకాలనడుగు నువ్వెందుకు ఓడిపొయావో చెబుతాయి.

👉ఈ పదేళ్లు మీ అప్పాయింట్మెట్ కోసం గంటలు గంటలు ప్రగతిభవన్ గేటు బయట నిల్చున్న "మా యూనియన్ నాయకుల ఆత్మగౌరవాన్ని" అడుగు నువ్వెందుకు ఓడిపోయావో చెబుతుంది.

👉 అందరిలాగా మాఅమ్మ,మా నాన్న ఇంటినుంచి బడికి పోకుండా వేరే జిల్లా బడులకు ఎందుకు పోతున్నారో అర్థం కాక బాల్యం బలైపోయిన 317 మంది బాధితుల పిల్లలనడుగు నువ్వెందుకు ఓడిపోయావో చెబుతారు.

👉 లోకల్స్ను నాన్ లోకల్ లుగా మార్చిన మీ అనుంగు అధికారుల తెలివితేటలనడుగు నువ్వెందుకు ఓడిపోయావో చెబుతాయి.

👉 S.T.O కార్యాలయాల్లో చెదలు పడుతున్న ఉపాధ్యాయుల బిల్లులనడుగు నువ్వు ఎందుకు ఓడిపోయావో చెబుతాయి.

👉CBIL స్కోర్ తగ్గిపోయిన ఉద్యోగుల వివరాలను తెలిపే బ్యాంకు మేనేజర్ ను అడుగు నువ్వు ఎందుకు ఓడిపోయావో చెబుతాడు

👉త్వరలో ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలంటూ తరచుగా రాసే పత్రికాధిపతులనడుగు నువ్వు ఎందుకు ఓడిపోయావో చెబుతాడు

👉'ఉద్యోగులకు భారీగా పెరిగిన జీతాలు' అని అచ్చుకు సిద్ధంగా ఉంచుకున్న విలేకరులను అడుగు. మీరెందుకు ఓడిపోయారు వివరంగా చెబుతారు.

👉 మేం ఎవరికి అనుకూలం కాదు (విద్యార్థులకు తప్ప), వ్యతిరేకులము కాదు....మాకు పార్టీ లేదు. జెండాలేదు, అజెండా లేదు. ఉన్నదల్లా ఆత్మాభిమానం, వివేకమే.... (తెలంగాణ పల్లెల్లో ఏ మూలకెళ్లినా కనిపించే ఓ సాదాసీదా పంతుల్ని నేను)

Read More
Next Story