కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని బీజేపీ ఎమ్మెల్యే... ... మరోసారి నెత్తురోడిన కశ్మీర్.. కేంద్రం సీరియస్
కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. కశ్మీర్ లో ఆర్టికల్ 370 తీసేసాక ప్రశాంతంగా ఉందని అన్నారు. పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు వచ్చి కశ్మీర్ ను ప్రశాంతంగా ఉంచకుండా కుట్ర చేశారని ఆరోపించారు. టూరిస్టుల పై దాడి చేయడం దారుణమని, పేరు అడిగి మరీ హిందువులను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన పై మోడీ ఆధ్వర్యంలో హై లెవెల్ మీటింగ్ జరుగుతుందని చెప్పారు. దాడి చేసిన ఉగ్రవాదులను పట్టుకుని చంపేవరకు మోదీ, అమిత్ షా వదలరని అన్నారు.
Update: 2025-04-23 06:13 GMT