భారత్-నేపాల్‌ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం

ఉగ్రదాడి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్‌గంజ్‌లోని సోనౌలి వద్ద భారత్-నేపాల్‌ సరిహద్దుల్లో బుధవారం భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల కదలికలపై ఉత్తరప్రదేశ్‌ పోలీసులు, గూఢచారి విభాగాలు గట్టి నిఘా ఉంచాయని ఎస్పీ సోమెంద్ర మీనా తెలిపారు. బార్డర్ చెక్‌పోస్టుల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నామని, అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల గుర్తింపు కార్డులు పరిశీలిస్తున్నామని చెప్పారు.


Update: 2025-04-23 07:29 GMT

Linked news