జూబ్లీహిల్స్ షేక్‌పేట్ డివిజన్ BJYM ప్రెసిడెంట్... ... మొదలైన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్
జూబ్లీహిల్స్ షేక్‌పేట్ డివిజన్ BJYM ప్రెసిడెంట్ స్వస్తిక్‌పై కాంగ్రెస్ నాయకుల దాడి చేశారు. పోలింగ్ రోజు బీజేపీ నాయకులు బయట తిరుగొద్దని వార్నింగ్ ఇస్తూ దాడి పాల్పడ్డారు. కాంగ్రెస్ నాయకుడు సాయినాథ్ అలియాస్ లడ్డూతో పాటు మరో నలుగురు ఈ దాడిలో ఉన్నారు. ఈ ఘటనలో బీజేవైఎం అధ్యక్షుడు స్వస్తిక్ గాయపడ్డారు. తనపై దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ నేతలపై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు స్వస్తిక్. తమ నేతపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
Update: 2025-11-11 02:50 GMT