‘రెడ్ శాండిల్ వుడ్’ ఓటీటీ రివ్యూ "ఎర్రచందనం వెనుక ఉన్న ఎర్ర(రక్త) చరిత్ర"
ఇంతకీ ఈ సినిమా కథేంటి, చూడదగ్గ సినిమానేనా? కొత్తగా ఏం చూపించారు అనేది రివ్యూలో చూద్దాం;
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రీసెంట్ గా 'పుష్ప' సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అలాగే ఆ సినిమాకు ముందు కూడా ఈ నేపధ్యంలో కొన్ని సినిమాలు వచ్చాయి. తాజాగా తమిళంలో 'రెడ్ శాండల్ ఉడ్' అనే టైటిల్ తో సినిమా వచ్చింది. ఆ స్దాయి గ్రాడ్ మేకింగ్ తో కాకపోయినా,కంటెంట్ బలంతో తమిళంలో రూపొందిన సినిమానే 'రెడ్ శాండల్ ఉడ్' అని పేరు తెచ్చుకుంది. గురు రామానుజం దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2023లో రిలీజై, ఇన్నాళ్లకు తెలుగులో డబ్బింగ్ అయ్యి ఓటిటిలోకి వచ్చింది. ఇంతకీ ఈ సినిమా కథేంటి, చూడదగ్గ సినిమానేనా? కొత్తగా ఏం చూపించారు
స్టోరీ లైన్
చెన్నైలో ఉండే ఓ యంగ్ బాక్సర్ ప్రభాకర్ (వెట్రి) కు పోలీస్ ఆఫీసర్ కావాలనేది డ్రీమ్. తన కల నెరవేర్చుకునేందుకు ఆ బాక్సర్ తీవ్రంగా శ్రమిస్తుంటాడు. అయితే అతని లవర్ వినుత అతనితో ఓ సమస్య షేర్ చేసుకుంటుంది. అదేమింటే గత కొంత కాలంలో తన అన్న కరుణ (కబాలి విశ్వనాథ్) కనపడటం లేదని, ఆటో నడుపుకునే తన తండ్రి ఎక్కౌంట్ కు తిరుపతి నుంచి లక్ష రూపాయలు వచ్చాయని, ఏదో డౌట్ గా ఉందని చెప్తుంది. దాంతో అతను ఏమైపోయాడో కనుక్కుందామని తిరుపతి బయిలుదేరతాడు ప్రభాకర్.
ఆ క్రమంలో కరుణ ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాలో భాగమయ్యాడని ప్రభాకర్ తెలుసుకుంటాడు. అయితే అతణ్ణి ఆ స్మగ్లింగ్ బ్యాచ్ నుంచి బయటకి తీసుకుని వెల్దామనకుంటాడు. అయితే ఈ లోగా ప్రభాకర్ ని ఊహించని విధంగా పోలీసులు అరెస్ట్ చేస్తారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నించినా అతని వల్లకాదు. అంతేకాదు అది ఒక ఉచ్చు అని అర్దం అవుతుంది. అతనితో పాటు మరో ఆరుగురిని పోలీసులు ఒకచోట బంధిస్తారు.
ఈ క్రమంలో మరో విషయం తెలుస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక హరిమారన్( గరుడ రామ్) ఉన్నాడనీ, అతని వెనుక పెద్ద పెద్ద పొలిటీషన్స్ ఉన్నారనే విషయం ప్రభాకర్ కి అర్ధమవుతుంది. అసలు రహస్యం బయటికి రాకుండా తమని ఎన్ కౌంటర్ చేయడానికి పోలీసులు ప్లాన్ చేసినట్టు అతను గ్రహిస్తాడు. అలాగే హరిమారన్ చేతిలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కార్మికులుగా చాలామంది అమాయక తమిళులు ఇరుకున్నారని తెలుసుకుంటాడు. వారిని రక్షించడం సహా అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఓ భారీ స్కామ్ గురించి తెలుసుకుంటాడు.
ఈ స్కామ్ వెలుగులోకి తెచ్చేందుకు ఆ యువ బాక్సర్ చేసిన ప్రయత్నాలేంటి? తమిళ కార్మికులను ఎలా రక్షించాడు? కరుణ్ ని బయిటకు తెచ్చాడా, ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిణామాలేంటి? స్మగ్లింగ్ ఉచ్చు నుంచి బాక్సర్ బయటపడ్డాడా? అతని డ్రీమ్ నెరవేర్చుకున్నాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
ఎలా ఉంది
ఈ సినిమా రన్ టైమ్ కేవలం 93 నిమిషాలే. ఓ రకంగా ఇలాంటి సినిమాలకు ఇది సేఫ్ గేమే. అయితే తక్కువ రన్ టైమ్ లో చాలా చూపించాల్సిన మినిమం విషయాలు మిస్సోపోయాయి. కొన్ని హడావిడిగా ముగించాల్సి వచ్చింది. ఈ చిన్న రన్‌టైమ్ కోసం స్టోరీ వరల్డ్ ఎస్టాబ్లిష్ చేయటం త్యాగం చేసి, చిన్నచిన్న ఫ్లాష్‌బ్యాక్‌లు లేదా డైలాగుల్లో కథ చెప్పే ప్రయత్నం చేయాల్సి వచ్చింది.
అంతెందుకు సినిమా ప్రారంభంలో ప్రభాకర్ బాక్సింగ్ కోచ్ ఒక సందర్భంలో సాదాసీదాగా, ప్రభా పోలీస్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడని చెబుతాడు. ఆ అంశాన్ని సరైన ఫౌండేషన్ లేకుండా తడబడుతూ పరిచయం చేయడం వల్ల, ప్రభా ఓ పోలీస్ ఆఫీసర్ కావాలనే లక్ష్యం ఉన్న వ్యక్తి అన్న విషయం మనకు చాలావరకు అర్థం కాని పరిస్దితి. కొంతదూరం వెళ్లాక అతను CIR (Civilian Information Report), పోలీస్ ప్రొసీజర్స్ గురించి ప్రొఫెషనల్ లెవెల్లో మాట్లాడటం చూసాకే – మనం “ఓహ్.. ఇతను పోలీస్ పరీక్షల aspirant కదా!” అనుకుని కథకు మనకి మనం లింక్ చేస్తాం.
అలాగే ఈ చిత్రం కథకు మూలమైన ఎర్రచందనం స్మగ్లర్ హరిమారన్ (KGF ఫేమ్ రామ్) దురాశ వల్ల తమిళ పౌరులు ఎలా బాధపడుతున్నారు అనే దానిని చేసే ప్రయత్నం చే్తుంది. కేవలం అక్రమంగా చెట్లు నరకటం కోసం కాదు — ఈ పరిస్దితుల్లో కొంతమంది తమ జీవితాలనే కోల్పోతున్నారు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసుల చేతుల్లో హింసకు గురవుతున్నారు. కర్ణను రక్షించాలన్న లక్ష్యంతో ప్రభా ఈ ప్రపంచంలోకి అడుగుపెడతాడు. కానీ, అతనే స్మగ్లింగ్ కేసులో పోలీసుల చేతిలో చిక్కుతాడు. జైల్లో ఉన్నప్పుడు, అతనితో పాటు ఉన్న ఆరుగురు ఖైదీలు పోలీసుల చేతిలో హత్యకు గురవడం అతని కళ్ల ముందు జరుగుతుంది.
కానీ, ఈ మొత్తం జరగడానికీ మానవీయతను నిర్మించడానికీ సరిగ్గా సమయం కేటాయించలేదు. అంత వేగంగా కథ ముందుకు పోతుండటం వల్ల…చాలా విషయాలు రిజిస్టర్ కాకుండానే ముందుకు వెళ్లిపోయాయి. అలాగే క్లైమాక్స్ రిపీటైన యాక్షన్ సన్నివేశాల్లో ముగించేసారు. ప్రభా తన లక్ష్యాన్ని సాధించిన తర్వాత (అవును, హీరో గెలిచాడు), ఇక్కడే సినిమాని ముగిస్తే బాగుండేది. అప్పటికి రన్‌టైమ్ కూడా ఖచ్చితంగా 90 నిమిషాలు అయ్యేది.
కానీ, దర్శకుడు మరో మూడు నిమిషాల మెలాంకలీని అందించడానికి ఎంచుకున్న మార్గం, పోలీసుల చేతిలో మరణించిన పౌరుల మాంటేజ్. ఈ షాట్లలో నుంచి “A Film by Guru Ramanujam” అనే టైటిల్ రాగా, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఎందుకంటే — నాలో ఎటువంటి ఉద్వేగం లేదు, కమర్షియల్‌గా ఓ ఫినిష్ అయినట్టు ఫీల్ కూడా లేదు. కథలో ఆసక్తికరమైన పాయింట్స్ ఉన్నప్పటికీ, సరిగ్గా లేని స్క్రీన్‌ప్లే, ఒకేసారి వేగంగా,మరో సారి మెల్లగా సాగడం సినిమాని చాలా cluttered and exhausting experienceగా మార్చేస్తుంది.
టెక్నికల్ గా ...
సురేశ్ బాల సినిమాటోగ్రఫీ చిత్రానికి కథకు అవసమైన అంధకారపు శైలిని అందించగా, సామ్ Сఎస్ నేపథ్య సంగీతం మూడ్‌ని మరింత స్ట్రాంగ్ చేసింది. రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్ చక్కగా కట్స్ పెట్టి కథనాన్ని గట్టి పేస్‌తో ముందుకు నడిపించింది. టెక్నికల్ టీమ్ కంటెంట్‌ను అధిక బరువు లేకుండా, అర్థవంతంగా ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయింది.
నటీనటుల విషయానికి వస్తే, వారు తమ పాత్రల్లో ఒదిగిపోయారు — వాస్తవికతతో కూడిన పర్ఫార్మెన్సుల ద్వారా కథనానికి సహజదోరణి అందించారు.
ఫైనల్ థాట్
Red Sandal Wood’ ఒక కీలక సామాజిక సమస్య — ఎర్రచందనం అక్రమ రవాణా, దానికి బలవుతున్న నిరపరాధుల విషయంలో ఓ పొలిటికల్ థ్రిల్లర్‌గా చెప్పాలన్న మంచి ప్రయత్నం. కానీ కాన్సెప్టు సరిపడే స్దాయి స్క్రిప్టు లేదు. ఇది ఫాస్ట్‌గా జరిగే క్రైమ్ డ్రామా లా కనిపిస్తుంది.ఇది ఒక "intent is noble, execution is shallow" సినిమా.
ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది
'రెడ్ శాండిల్ వుడ్' మూవీ 'ఈటీవీ విన్'లో తెలుగులో ఉంది