గోదావరి జిల్లాలలో సంక్రాంతి సినిమాల యుద్ధం!!
ఒకే ప్రాంతం, ఆరు సినిమాలు
సినిమా అనే మాటకే గోదావరి జిల్లాల్లో రక్తంలో వేడి పెరుగుతుంది. అక్కడ ఉండే ఫ్యాన్‌కల్చర్, సెలబ్రేషన్స్, హంగామా — వేరే ఏ ప్రాంతంలో కనిపించదు. కొత్త సినిమా రిలీజ్ అయితే… థియేటర్ ముందు క్యూలు, ఫ్లెక్సీలు, బాణాసంచా, డ్యాన్స్‌లు అన్నీ ఆటోమేటిక్‌గా స్టార్ట్.
సినిమా అంటే పిచ్చి,
స్టార్ హీరో అంటే గౌరవం,
పండుగ అంటే థియేటర్!
అందుకే గోదావరి జిల్లాలు ఈసారి కాకుండా ప్రతి సంక్రాంతికీ ప్రధాన బ్యాటిల్‌ఫీల్డ్. ఎందుకంటే అక్కడి ప్రేక్షకులకు సినిమా కేవలం ఎంటర్టైన్‌మెంట్ కాదు — ఆ ఎమోషన్, ఆ గర్వం, ఆ సంస్కృతి.
వీకెండ్ కాదు, వెకేషన్ కాదు — సంక్రాంతి రోజుల్లో థియేటర్లు ఫుల్! కుటుంబమంతా కలిసి సినిమాలు చూడటం అక్కడ సంప్రదాయం.
కచ్చితంగా ఈ సీజన్‌లో రివ్యూ కాదు, ఫైట్ లేదు… ఫుల్ సెలబ్రేషన్! అందుకే పెద్ద పెద్ద సినిమా టీమ్‌లు ఈసారి ఇలా లెక్క చేశారు.
గోదావరిలో ఈవెంట్లు పెడితే క్రేజ్ పీక్ కు చేరుతుంది మాట మాటగా బాక్సాఫీస్ బండి దూసుకెళ్తుంది! 2026 సంక్రాంతి దగ్గర పడుతుండగా,
ఎక్కడ ఈవెంట్ పెడుతున్నారో, ఎవరు ఎంత మాస్‌ను ఎట్రాక్ట్ చేస్తారో అంటూ ఇప్పుడే ఇండస్ట్రీ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది!
పెద్ద సినిమాల వరుస దాడి!
ఈ సంక్రాంతి ఒక రోజు ఒక సినిమా కాదు… చిరంజీవి, ప్రభాస్, రవితేజ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టి… పక్కనే విజయ్, శివకార్తికేయన్ కూడా చేరడంతో బాక్సాఫీస్ దగ్గర మాడ్ రష్ స్టార్ట్. థియేటర్ల ముందు టికెట్ వేటలు, హౌస్ ఫుల్స్, సెలబ్రేషన్స్ ఇప్పుడే స్పష్టంగా కనిపిస్తున్నాయి.
గోదావరి జిల్లాల్లో ఒక ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది — పెద్దవాళ్లు, చిన్నవాళ్లు, కుటుంబమంతా కలిసి సినిమా చూడటం. అదే కారణంగా ఈ సంవత్సరం సంక్రాంతి రిలీజ్‌లన్నీ ఒకే నిర్ణయం తీసుకున్నాయి: గోదావరి జిల్లాలనే ప్రమోషన్ బ్యాటిల్‌ఫీల్డ్‌గా మార్చేయాలి!
సినిమా టీమ్ ల లెక్క సింపుల్: అక్కడ ఈవెంట్లు పెట్టితే ..అక్కడే క్రేజ్ పీక్‌కు వెళ్లిపోతుంది. ప్రేక్షకుల మైండ్‌సెట్ సూట్‌గా హిట్ అవుతుంది
దాంతో గోదావరి జిల్లాల్లోనే ఈసారి సంక్రాంతి బాక్సాఫీస్ పోరు మొదలవుతోంది! ఇప్పటికే గోదావరి జిల్లాల్లో సినిమా ప్రమోషన్ల జాతర మొదలైపోయింది. ఇప్పటికే కొన్ని టీమ్‌లు ముందే దూసుకెళ్లాయి.
మొదటిగా, నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా ఫస్ట్ సింగిల్‌ను భీమవరంలో ప్రత్యేక ఈవెంట్‌గా రిలీజ్ చేశారు. అక్కడ వచ్చిన అభిమానుల రద్దీ చూసి, టీమ్ ఒక్క మాట అనుకుంది — “ఇక్కడే మా మార్కెట్ ఉంది!”. అంతే కాదు, రవితేజ సినిమా ‘భర్త మహాశయలకు విజ్ఞప్తి’ నుంచి తొలి పాటను రాజమండ్రిలో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఆ ఈవెంట్‌లో వచ్చిన ఎనర్జీ, సోషల్ మీడియాలో ట్రాఫిక్ చూసి, ప్రమోషన్స్‌కు టర్బో బూస్ట్ వచ్చేసింది.
ఇది ఇక్కడితో ఆగలేదు — సంక్రాంతి బరిలో మరో కీలకమైన సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ టీమ్ కూడా గోదావరి జిల్లాలోనే భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు. అక్కడి ప్రేక్షకుల ఉత్సాహం, మార్కెట్, రెస్పాన్స్… అన్నీ చూసి ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్.
ఒక్క ప్రశ్న మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ . భీమవరం బుల్లోడు ప్రభాస్ ఎప్పుడు స్టెప్ వేస్తాడు? ‘ది రాజా సాబ్’ ప్రమోషన్స్‌పై ఇంకా ఒక్క అప్‌డేట్ కూడా లేదు.
అందరూ చూసేది ఇదే: ప్రభాస్ ఎక్కడ ఈవెంట్ పెడతాడు? ఎన్ని లక్షల మంది చేరతారు? ప్రమోషన్స్ మొదలయ్యే రోజే గోదావరి మొత్తం అదిరిపోతుందా?
సమాధానం కోసం ఫ్యాన్స్, ఇండస్ట్రీ, థియేటర్లు… అందరూ వేచిచూస్తున్నారు.