తెలుగు కంటెంట్‌కి హై డిమాండ్
ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ ఇదిగో;
ఇంకా వారం మొదలులో ఉండగానే , ఓటీటీ సంస్దలలో సినిమాల రిలీజ్ లపై పోటీ మొదలైపోయింది. థియేటర్లలో అడుగు పెట్టేందుకు చిన్న సినిమాలు నానా పాట్లు పడుతూంటే… వాటికి పోటీగా ఓటీటీ సంస్థలు మాత్రం ఏకంగా వారం వారం 20కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ చేస్తూ ప్రేక్షకులపై రీచ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు తెలుగు కంటెంట్‌కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో… ఈ వారం ఓటీటీలో వచ్చేవాటిలో ఎక్కువగా తెలుగువే. థ్రిల్లర్స్ నుంచి ఫ్యామిలీ డ్రామాలు, డబ్బింగ్ మూవీల నుంచి ఒరిజినల్ సిరీస్‌ల వరకు ఎన్నెన్నో!
ముఖ్యంగా ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఓహో ఎంథన్ బేబీ, పరందు పో, మామన్, నడికర్ లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటు అరేబియా కడలి, మోతెవరి లవ్ స్టోరీ తదితర తెలుగు వెబ్ సిరీసులు ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. వీటితో పాటు ఈ వీకెండ్‌లో 'జూనియర్' కూడా రావొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?
ఈ వారం ఓటీటీలో రానున్న హైలైట్ రీలీజులు (ఆగస్టు 04 – ఆగస్టు 10)
అమెజాన్ ప్రైమ్
అరేబియా కడలి (తెలుగు వెబ్ సిరీస్) – ఆగస్టు 08
నెట్‌ఫ్లిక్స్
ఓహో ఎంథన్ బేబీ (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఆగస్టు 08
ఎస్ఈసీ ఫుట్‌బాల్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 05
టైటాన్స్: ద రైజ్ ఆఫ్ హాలీవుడ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్) – ఆగస్టు 05
వెన్స్‌డే సీజన్ 2 పార్ట్ 1 – ఆగస్టు 06
స్టోలెన్: హీస్ట్ ఆఫ్ ద సెంచరీ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 08
మ్యారీ మీ (ఇంగ్లీష్ రొమాంటిక్ మూవీ) – ఆగస్టు 10
డిస్నీ+ హాట్‌స్టార్
పరందు పో (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఆగస్టు 05
ఇండియాస్ బిగ్గెస్ట్ ఫుడీ (హిందీ రియాలిటీ షో) – ఆగస్టు 04
లవ్ హర్ట్స్ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 07
మిక్కీ 17 (సైన్స్ ఫిక్షన్ మూవీ) – ఆగస్టు 07
సలకార్ (హిందీ థ్రిల్లర్ సిరీస్) – ఆగస్టు 08
జీ5
మోతెవరి లవ్ స్టోరీ (తెలుగు సిరీస్) – ఆగస్టు 08
మామన్ (తమిళ మూవీ) – ఆగస్టు 08
జరన్ (మరాఠీ మూవీ) – ఆగస్టు 08
సోనీ లివ్
మయసభ (తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్) – ఆగస్టు 07
సన్ నెక్స్ట్
హెబ్బులి కట్ (కన్నడ యాక్షన్ మూవీ) – ఆగస్టు 08
Apple TV+
ప్లాటోనిక్ సీజన్ 2 (ఇంగ్లీష్ కామెడీ సిరీస్) – ఆగస్టు 06
MX Player
బిండియే కే బాహుబలి (హిందీ డ్రామా సిరీస్) – ఆగస్టు 08
సైనా ప్లే
నడికర్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఆగస్టు 08
Lionsgate Play
ప్రెట్టీ థింగ్ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 08
బ్లాక్ మాఫియా సీజన్ 4 (ఇంగ్లీష్ క్రైమ్ సిరీస్) – ఆగస్టు 08
ప్రేక్షకులకు ఇది డిజిటల్ ఫీస్ట్ లాంటిది. ప్రతి ఓటీటీ సంస్థ కూడా "మనవాళ్లకు తెలుగు కంటెంట్" అనే దానిపై ఫోకస్ పెడుతుండటం గమనార్హం. థియేటర్‌కు వెళ్లడం కష్టమని భావించే వారు ఇప్పుడు OTTలోనే బిగ్ రిలీజ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు.