హీరోలు లేరు, హడావిడి లేదు…
అయినా 900% లాభం , ఇదెలా సాధ్యం?!;
ప్రతీ సంవత్సరం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో వందల సినిమాలు విడుదలవుతున్నా — వందకు ఒకటి మాత్రమే ఫైనాన్షియల్ పరంగా "అసాధారణంగా" నిలుస్తోంది. రిస్క్-రివార్డ్ రేషియో అనేది సినిమాల్లో పెద్దగా పట్టించుకోని అత్యంత కీలకమైన అంశం. వంద కోట్ల బడ్జెట్ పెట్టి వంద యాభై కోట్లు రావొచ్చు. కానీ మూడు కోట్ల పెట్టుబడిపై ముప్పై కోట్లు నికర లాభం వస్తే — అది ఖచ్చితంగా బిజినెస్ మోడల్ అవుతుంది.
అదే ఇప్పుడు కన్నడ సినిమాగా వచ్చి, ఇప్పుడు పాన్ ఇండియా దృష్టిని ఆకర్షిస్తున్న ‘సు ఫ్రమ్ సో’. స్టార్లే రూట్ అనుకునే మార్కెట్‌లో, ఓ సున్నితమైన కథలో దాగి ఉన్న మాస్ కమర్షియల్ పవర్ మళ్లీ నిరూపించబడింది.
** చిన్న సినిమాతో భారీ లాభం? అసలైన సినిమా మేజిక్!
– "Low Risk, High Return is not a myth. It’s just rare."
సినీ పరిశ్రమలో మిగిలేది ఏమంటే అప్పులు మాత్రమే, అని చెప్పుకునే నిర్మాతలు ఉన్న ఈ రోజుల్లో... కొన్ని సినిమాలు మాత్రం ఆశ్చర్యపరుస్తున్నాయి. అసాధారణ విజయంసాధిస్తున్నాయి. పెట్టిన పెట్టుబడికి పది రెట్లు లాభం తీసుకురావడం పెద్ద విషయమే కానీ కేవలం రూ.3 కోట్లు ఖర్చుపెట్టి, రూ.40 కోట్ల గ్రాస్ తెచ్చుకోవటం మాత్రం అతి పెద్ద విషయం. ‘సు ఫ్రమ్ సో’ అలాంటి విజయమే సాధించింది. అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ మెంట్ థీరీ ప్రకారం ఇది సుమారుగా 900% శాతం దాకా తేలుతుంది.
* * సినిమా లాభాల లెక్క – R.O.I. ఫార్ములా:
"Return on Investment (ROI) = (నెట్ లాభం ÷ పెట్టుబడి) × 100"
అంటే... బడ్జెట్: ₹3 కోట్లు
నెట్ కలెక్షన్: ₹30 కోట్లు
ROI: ₹27 కోట్లు లాభం ⇒ (27/3)×100 = 900% ROI (లేదా) 9 రెట్లు లాభం
** ఎలా సాధ్యమైంది? చిన్న సినిమా మాస్ మార్కెట్‌ను ఎలా జయించిందంటే –
ప్రధానంగా కంటెంట్ – కింగ్ గా నిలిచింది. హారర్ కామెడీ అనే మామూలు తేలికపాటి జానర్‌కి ఫ్రెష్ ట్రీట్మెంట్ ఇచ్చాడు దర్శకుడు జెపి తుమినాడ్. ‘సులోచన’ అనే దెయ్యం, ఒక పల్లెటూరి కుర్రాడి లైఫ్‌లోకి వచ్చి కలిగించే సిట్యుయేషన్లు — పంచ్‌లతో, ఫన్ తో నడిచే కథ.
"Clean comedy never goes out of fashion. Especially when it comes with ghosts!" అని ట్రేడ్ చెప్తూంటుంది. అదే నిజమైంది.
** స్టోరీ లైన్
మార్లూరు మాస్‌కి ముద్దుబిడ్డ అయిన రవి అన్న (Shaneel Gautham) ఊరికి అన్నగానే మిగిలిపోయాడు. పేదవాళ్లకు అన్నం పెడతాడు, స్నేహితులకు మద్యం పోస్తాడు – ఊరిలో ఏదైనా జరిగితే ముందుగా గుర్తుకు వచ్చేది రవి అన్నే. ఒకరోజు ఊరిలో ఓ హడావుడి. రవి అన్నకు ఓ ఫోన్ కాల్ వస్తుంది – "అన్నా... మా అమ్మ బాత్‌రూలో ఉండగా ఎవరో చూస్తున్నారు!" అని. మద్యం మత్తులో ఉన్నా, రవి అన్న తన మిత్రులతో కలిసి వెంటనే అక్కడికి చేరుకుంటాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించి, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా పోలీసులకు అప్పగిస్తే అసలైన నిందితుడిని పట్టుకోవడం సులభమవుతుంది అనుకుంటాడు.
ఇంతలో డైరెక్టర్ మళ్లీ కథను ఫ్లాష్‌బ్యాక్‌కి తీసుకెళ్తాడు… అక్కడ కనిపిస్తాడు మన అశోక (JP Thuminad). ఊరిలోని ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోయాడు. ప్రేమలో మునిగి తేలిపోతూ, ఆమె ఎలా సబ్బుతో స్నానం చేస్తుందో చూడాలనుకుంటాడు – మూర్ఖపు కోరిక, అమాయకపు చర్య. కానీ బాత్‌రూలో ఉన్నది ఆమె కాదు, ఆమె అవ్వ! అదే దురదృష్టం. అవ్వ అరిచేసి తన కొడుకుకి చెబుతుంది, అతను వెళ్ళి... రవి అన్నకి ఫోన్ చేస్తాడు.
ఈ చిన్న ఉన్మాద చర్య ఊరిలో పెద్ద గందరగోళానికి దారి తీస్తుంది. అశోక నిజంగానే తప్పుడు ఆలోచనలతో వచ్చాడా? లేక భ్రమలో చేశాడా? ఇదంతా సులోచన అనే ఆత్మ వలన జరిగిందా? అసలు ఆ సులోచన ఎవరు? ఇది ఒక ఫన్ రైడ్ మాత్రమే కాదు. ఇది అమాయకత, అవగాహన, ఊరితనం, అర్థం కాక తడబాటు, చివరికి మనిషిలో మార్పు ఎలా వస్తుందో చెప్పే కథ.
** ఫేవరబుల్ టైమింగ్
సినిమా విడుదల జూలై 25, కర్ణాటకలో ఇతర స్టార్ హీరో సినిమాలతో పాటు థియేటర్లలో దిగింది. కానీ క్లాస్ టాక్, మాస్ స్పందనతో ఆదివారం ఉదయం 6కి కూడా షోలు హౌస్‌ఫుల్! ఇది చిన్న సినిమాల హిట్ కాన్ఫిడెన్స్‌ను ఎలా పెంచిందంటే – బెంగళూరులో మల్టీప్లెక్సులు వేకువ జామునే ఓపెన్ చేసాయి.
** బుక్ మై షో ర్యాంకింగ్స్:
కన్నడలో ఇప్పటిదాకా టాప్ లో ఉన్నవి:
దర్శన్ – కాటేరా
సుదీప్ – మ్యాక్స్
ఇప్పుడు – సు ఫ్రమ్ సో
ఈ ర్యాంక్‌కి కేవలం వసూళ్లు కాదు, ఆడియన్స్ ఎంగేజ్‌మెంట్, రిపీట్ వ్యూయర్ బేస్ కూడా కీలకం.
** తెలుగులోకి – మైత్రి ద్వారా
అగస్టు 8న తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేయబోతున్న ఈ సినిమా, వార్ 2, కూలీ వంటి పెద్ద సినిమాలకి ముందు వన్ వీక్ గ్యాప్‌లో రిలీజ్ అవుతోంది. “Short but loud run” అనే ప్లాన్‌తో మైత్రి వస్తోంది. అంటే... "చిన్న సినిమాకు సరైన విండో దొరికితే... అది పెద్ద సినిమాను కూడా ప్రక్కన పెట్టగలదు" అన్న సూత్రాన్ని మరోసారి ఋజువు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది.
** మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ
"Cinema is no longer about scale; it’s about strategy."
– ఇండస్ట్రీ ట్రేడ్ అనలిస్టులు.
సినీ పరిశ్రమలో మల్టిప్లెక్స్ డామినెన్స్ పెరిగిన తరువాత, కంటెంట్ మీదే గేమ్ ఉంది అన్న నమ్మకం బలపడుతోంది. సు ఫ్రమ్ సో తరహా సినిమాలు: థియేటర్లో వసూళ్లు మాత్రమే కాదు, స్ట్రీమింగ్ డీల్స్, శాటిలైట్ రైట్స్, రీమేక్ రైట్స్ ద్వారా మల్టిపుల్ రెవెన్యూ స్ట్రీమ్స్‌ను తలపెడతాయి.
** చివరగా చెప్పాలంటే:
చిన్న సినిమా సక్సెస్ అనేది ఒక్కసారి జరిగిన గాథ కాదు... అది తర్వాతి తరం ఫిల్మ్‌మేకర్స్ కోసం ఓ బిజినెస్ మోడల్.
చిన్న బడ్జెట్, పెద్ద విజయం అన్నది ఎప్పుడూ ఆగిపోయిన డ్రీమ్ కాదు. సు ఫ్రమ్ సో సక్సెస్ అయిన విధానం చూస్తే... ఆ డ్రీమ్‌కు పునర్జీవం వచ్చింది. కంటెంట్, మార్కెటింగ్, టైమింగ్, పాజిటివ్ బజ్, ట్రేడ్ ప్లేస్‌మెంట్ అన్నీ కచ్చితంగా కుదిరితే – చిన్న సినిమా కూడా కంపెనీ లాభాల షీట్లో మలుపు తిప్పగలదు.