ఒక చిన్న కథ… కేరళ బాక్సాఫీస్ కి తొలి వంద కోట్లు ఇచ్చింది!
మలయాళ సినిమా మార్కెట్ లో జరగిన విచిత్రం;
Update: 2025-05-15 04:26 GMT
"మార్కెట్లు కదలాలంటే... ఒక గొప్ప కథ ముందుండాలి."
ఈ మాట ఎన్నో సంవత్సరాలుగా సినిమా పరిశ్రమ వల్లె వేస్తోందే. అయితే ఆ గొప్ప కథ ఏమిటనేది ఎవరికీ తెలియదు. ఆ మ్యాజిక్ ఎప్పుడు జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అయితే ఖచ్చితంగా ఒక మంచి స్టోరీ మార్కెట్‌ను పెంచుతుంది. ఒక గొప్ప స్టోరీ – మార్కెట్‌ను రీడిఫైన్ చేస్తుంది. ఇప్పుడు అదే మలయాళ సినిమా మార్కెట్ లో జరిగింది.
ఇప్పటివరకు దక్షిణాది రాష్ట్రాలన్నీ వంద కోట్ల మార్క్‌ను టచ్ చేశాయి. కానీ కేరళ మాత్రం ఎప్పుడూ “స్మార్ట్ కానీ స్మాల్ మార్కెట్” అనే విషయం దగ్గరే ఆగిపోయింది. కానీ 2025, ఏప్రిల్ 25 న మోహన్‌లాల్ నటించిన తుడరుమ్ విడుదలైంది. పెద్దగా హైప్ లేకుండా వచ్చిందీ సినిమా. కానీ థియేటర్లలోకి ప్రవేశించిన దగ్గర నుంచి...మెల్లిమెల్లిగా జనాల్లోకి వెళ్లింది. ఊహించని విధంగా ఇప్పుడో రికార్డ్ కు నాంది పలికింది.
ఈ చిత్రం కేవలం 3 వారాల్లో కేరళలో రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి — చరిత్రను తిరగరాసింది. మలయాళ సినిమాకు ఇది ఒక పైనాన్షియల్ మార్గదర్శక మార్గం, ఓ మైండ్‌సెట్ బ్రేకర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.
"మార్కెట్లు రాత్రికి రాత్రే మారవు. కానీ అవి మారినప్పుడు, దానికి కారణం ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు."
— రీడ్ హేస్టింగ్స్, Netflix Co-founder (ఓ ఇంటర్వూలో..)
వంద కోట్లు అనేది మన తెలుగు మార్కెట్ వైపు నుంచి చూస్తే పెద్ద విషయం కాదు. కానీ కేరళ నుంచి చూస్తే అది పెద్ద విషయం. తుడరుమ్, భారీ ప్రమోషన్స్ లేకుండానే ప్రేక్షకుల్ని ఆకర్షించి, బ్లాక్‌బస్టర్ అయింది. ఇది మలయాళ సినిమాకు మాత్రమే కాదు — కేరళ దక్షిణాది మార్కెట్లలో పెద్ద కలెక్షన్లకు అవకాశం లేని ప్రాంతం అన్న అపవాదాన్ని తొలగించిన సంఘటనగా చరిత్రలో నిలిచిపోయింది.
కేరళ బాక్సాఫీస్ అనలిస్ట్ వ్యాఖ్యానించినట్టు, "2015లో బాహుబలి తెలుగు సినిమాకు ఏమి చేసిందో, ఇప్పుడు తుడరుమ్ మలయాళానికి అదే చేస్తోంది - కనపడని సైక్లాజికల్ అడ్డంకిని బద్దలు కొడుతోంది."
చిన్నదే కానీ శక్తివంతమైనది: కేరళ బాక్సాఫీస్ విశ్లేషణ
కేరళలో థియేటర్ల పరిమితి ఉంది.
కంటెంట్ డ్రివన్ సినిమాలకే ప్రాధాన్యత .
గల్ఫ్, యూరప్ మార్కెట్లపై ఎక్కువ డిపెండెన్స్
పాన్-ఇండియా స్టార్స్ కన్నా, నేటివ్ కధలే ఎక్కువ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతాయి.
అయినా కూడా, తుడరుమ్ 100 కోట్లను దాటి వెళ్లగలిగింది అంటే — ఇది కేవలం ఓ సినిమా విజయం కాదు.
ఇది మార్కెట్ షిఫ్ట్.
ఇది ఆడియన్స్ ట్రస్ట్‌కి సీల్.
ఇలాంటి పరిస్థితుల్లో కేవలం కంటెంట్ బేస్డ్‌గా ఉన్న స్థానిక మార్కెట్ నుంచి ₹100Cr వసూలు చేయడం — లాజిక్‌ని దాటి మార్గదర్శకంగా నిలుస్తుందనటంలో సందేహం లేదు.
ప్రముఖ దర్శకుడు డేవిడ్ పింఛర్ ఇంటర్వూలో అంటారు.. "నువ్వు కథను నిజంగా నమ్మితే... ప్రపంచం ఖచ్చితంగా వింటుంది." అని . ఈ సినిమాకు అదే జరిగింది. దృశ్యం సినిమా కథలా ఉందని చాలా మంది అన్నా ...డైరక్టర్, మోహన్ లాల్ వెనకడుగు వెయ్యలేదు. సక్సెస్ సాధించారు.
సినిమా స్టోరీ లైన్:
షణ్ముగం అలియాస్ బెంజ్ (మోహన్‌లాల్), ఒకప్పుడు తమిళ సినిమాల్లో యాక్షన్ డూప్. గాయం తర్వాత తన మాస్టర్ ఇచ్చిన అంబాసిడర్ కారుతో కేరళలో టాక్సీ డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తాడు. ఒకరోజు అతని కారును పోలీసులు సీజ్ చేస్తారు. అదే సమయంలో అతని కొడుకు అదృశ్యం అవుతాడు. బెంజ్ తన కుటుంబాన్ని, కారును తిరిగి పొందేందుకు చేసే పోరాటమే సినిమా.
తుడరుమ్ ఫెనామెనా: బడ్జెట్ లేని బ్లాక్‌బస్టర్
తుడరుమ్ అనేది ఫ్రాంచైజీ కాదు, సీక్వెల్ కాదు, మెగా బడ్జెట్ కూడ కాదు. కానీ ఈ చిత్రం సాలిడ్ స్క్రీన్‌ప్లే, దిగ్గజ నటుడు మోహన్‌లాల్ మేజిక్, బలమైన ఎమోషనల్ ఎంగేజ్‌మెంట్. ఈ మూడు అస్త్రాలతో కేరళ జనాల హృదయాని జయించింది. సినిమాలో ఎమోషన్, క్రైమ్, ఫన్ కలసి నడవటం కొత్తగా అనిపించిందని అని తేల్చారు.
ఇది ప్రేమకు, సమాజానికి, కుటుంబానికి మధ్య ఉన్న సంబంధాన్ని అద్భుతంగా నెరేట్ చేసింది. మోహన్‌లాల్ నటన, దర్శకుడు ఇచ్చిన డిఫరెంట్ ట్రీట్మెంట్, థియేట్రికల్ ఎమోషనల్ కనెక్ట్ సినిమాను సక్సెస్‌ఫుల్ హ్యుమన్ డ్రామాగా నిలబెట్టాయి.
తుడరుమ్ తర్వాత ఏంటి?
ఈ విజయం కేవలం మోహన్‌లాల్ విజయమే కాదు. ఇది కేరళ బాక్సాఫీస్ పరిమితులపై ఆలోచన మార్చే సంఘటన. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఈ విజయం వల్ల బడ్జెట్‌ను మరింత సమర్థవంతంగా ప్లాన్ చేసే అవకాశముంది. మరిన్ని పాన్-ఇండియా ప్రయత్నాలు, మార్కెట్ విస్తరణలు ఎదురుచూస్తున్నాయి.
మార్కెట్ లో వచ్చే మార్పులు:
మార్కెట్ మైండ్‌సెట్ మార్పు – నేషనల్ స్థాయిలో ప్రభావం. తుడరుమ్ విజయంతో, మలయాళ సినిమా ఇప్పుడు చిన్న మార్కెట్ నుంచి పెద్ద ఆలోచనల వైపు సాగుతుంది.
OTT డీల్స్ పునరాలోచన – భారీ మార్కెట్ పోటెన్షియల్ ఉన్నట్లు నిరూపించడంతో, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ పెట్టుబడులను పెంచే అవకాశం
నేషనల్ డిస్ట్రిబ్యూషన్ – ఇతర రాష్ట్రాల్లోనూ థియేట్రికల్ రిలీజ్‌ల అవకాశాలు
బలమైన కథలతో పెద్ద కలెక్షన్ల వైపు – నార్త్ ఇండియన్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసే కంటెంట్
తుడరుమ్ — పాన్-ఇండియా లేదు.
పాన్-బడ్జెట్ లేదు.
కానీ... పాన్-మనిషి!
ఆ ఒక్క సారి ప్రేక్షకుల గుండెల్లోకి వెళ్లగలిగితే – వంద కోట్లు ఎంత చిన్న లక్ష్యమో తుడరుమ్ నిరూపించింది.
భాక్సాఫీస్ కొత్త మంత్రం –
"కథ ఉంటే మార్కెట్ అదే వస్తుంది! సృజనాత్మకత అనేది కొత్త మూలధనం. దానిని నమ్మండి, దానిలో పెట్టుబడి పెట్టండి"