'సితారే జమీన్ పర్' లాస్ట్ మినిట్ ట్విస్ట్
అమీర్ ఖాన్ కు కోట్లలో దెబ్బ?";
అమీర్ ఖాన్ భారీ అంచనాలతో రూపొందించిన చిత్రం ‘సితారే జమీన్ పర్’. ఇప్పుడు విడుదలకు వారం ముందే పెద్ద సమస్యలో చిక్కుకుంది. సినిమా పూర్తిగా అన్ని పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉండగా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మాత్రం ఇప్పటికీ సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయలేదు. కారణం?… సెన్సార్ బోర్డు కోరిన రెండు కీలక సన్నివేశాల తొలగింపుపై ఆమీర్ ఖాన్ గట్టి అభ్యంతరం చెప్పటమే.
రెండు కట్స్
‘సితారే జమీన్ పర్’ సినిమాను చూచిన సెన్సార్ బోర్డు ఎగ్జామినింగ్ కమిటీ, సినిమాలోని రెండు సన్నివేశాలను తొలగించాలన్న డిమాండ్ చేసింది. కానీ ఆమీర్ ఖాన్ స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నాడు.
“ఈ కథను డైరెక్టర్ ఆర్.ఎస్. ప్రసన్నతో కలిసి ఎంతో శ్రమపడి తీర్చిదిద్దాం. ఈ సన్నివేశాలు కథకు లాజికల్‌గా అవసరమే. కట్ చేస్తే ఆ ఫీల్ మిస్సైపోతుంది.”
ఈ వివాదంతో సినిమా విడుదలకు అడ్డంకి ఏర్పడింది. ఇప్పటికీ సర్టిఫికేట్ రాకపోవడంతో థియేటర్లలో టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభించలేని పరిస్థితి ఏర్పడింది. సెన్సార్ లేకుండా అడ్వాన్స్ బుకింగ్ నిషిద్ధం కాబట్టి – ఈ సమావేశం ఇప్పుడు కీలకం.
ఈ రోజే (జూన్ 16) ఫైనల్ ?
ఈ పరిణామాల నేపథ్యంలో, ఆమీర్ ఖాన్ సోమవారం (జూన్ 16) న మరోసారి సెన్సార్ బోర్డు ఎగ్జామినింగ్ కమిటీని కలవనున్నాడు. సానుకూల పరిష్కారం వచ్చే ఆశతో ఉన్నారు. ఒకవేళ ఈ సమావేశంలో ఓకే వస్తే... థియేటర్లలో టికెట్ బుకింగ్‌ను వెంటనే ప్రారంభించనున్నారు.
UKలో ముందే సర్టిఫికేషన్ – "డిస్క్రిమినేషన్ & మోడరేట్ సెక్స్ రిఫరెన్సులు"
ఇంకో పాజిటివ్ అప్డేట్ ఏమిటంటే – బ్రిటన్‌లో BBFC (British Board of Film Classification) ఇప్పటికే ‘సితారే జమీన్ పర్’కి 12A రేటింగ్ ఇచ్చింది. ఫిల్మ్ నిడివి 2 గంటల 35 నిమిషాలు. BBFC ప్రకారం, సినిమాలో “వివక్ష, మితమైన సెక్స్ సూచనలు” ఉన్నాయని స్పష్టంగా పేర్కొన్నారు.
3500 స్క్రీన్స్ టార్గెట్ – ఓటీటికి అమ్మలేరు!
తొలుత ఈ సినిమాను లిమిటెడ్ థియేటర్లలో రిలీజ్ చేసి, word of mouth ద్వారా విస్తరించాలని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు... ఆమీర్ ఖాన్ తన మార్కెటింగ్ మాస్టర్ ప్లాన్ మార్చేశాడు. ఒక్కసారిగా 3000–3500 స్క్రీన్స్‌లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ ఓటీటీల వైపు పరుగెడుతున్నప్పుడు,
అమీర్ మాత్రం తన సినిమాను ఒక్క OTT కీ ముందుగా అమ్మకుండా థియేట్రికల్ విడుదలపై పూర్తి బెటింగ్ వేశాడు.
ఇది ఇండస్ట్రీలో చాలామంది నిర్మాతలకు డేర్ మూవ్ గా మారింది.
Box Office బిజినెస్ కోణం:
OTT డీల్స్ లేకపోవడం వల్ల థియేటర్లపై డిపెండెన్సీ భారీగా పెరిగింది.
సెన్సార్ డీలే అయితే బిజినెస్ పై ప్రభావం ఉంటుంది.
సినిమాకు పాజిటివ్ బజ్ ఉన్నా, సెన్సార్ సర్టిఫికేషన్ సరైన టైమ్ కు క్లియర్ కాకపోతే, బుకింగ్స్ మొదలయ్యేంతవరకు డిజిటల్ ప్రమోషన్లు కూడా ఆగిపోతాయి. ఇది ప్రీ రిలీజ్ బిజినెస్ పై ఇంపాక్ట్ పడుతుంది.
3000+ స్క్రీన్స్ లలో వచ్చే ఓపెనింగ్ పరంగా ఇది బిగ్ గ్యాంబుల్ – చిన్న డిలే కూడా కోట్లలో లాస్ కు దారి తీస్తుంది.