అదృశ్యం: (ఈటీవీ విన్) క్రైమ్ థ్రిల్లర్ రివ్యూ!

2022లో విడుదలై ప్రశంసలు అందుకున్న ‘ ఇని ఉతరమ్’ మలయాళం మూవీకి తెలుగు వర్షన్ ఇది. ఇప్పుడు ఓటీటిలోకి సైలెంట్ గా వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది..చూడచ్చా?

Update: 2024-04-05 08:08 GMT

ఆకాశ‌మే నీ హ‌ద్దురా ఫేమ్ అప‌ర్ణ బాల‌ముర‌ళి హీరోయిన్‌గా న‌టించిన సినిమా “అదృశ్యం”. ఈ సినిమా 'ఇని ఉత్త‌ర‌మ్‌' అనే మళయాళ చిత్రంకు డ‌బ్బింగ్ వెర్ష‌న్‌. ఈ సినిమా 2022లోనే విడుదలయ్యి.. సినీ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. అయితే రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటిలోకి సైలెంట్ గా వచ్చింది. పెద్దగా పబ్లిసిటీ లేకుండా వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది..చూడచ్చా?


స్టోరీ లైన్ ఏంటంటే...

డాక్టర్ జానకి (అపర్ణ బాలమురళి) ల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫ‌ర్‌ అశ్విన్ ( సిద్ధార్థ్ మీనన్)ని ప్రాణంగా ప్రేమిస్తుంది. సహజీవనంలో ఉన్న వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లిచేసుకోవటానికి డిసైడ్ అవుతారు.. వీళ్ల ప్రెండ్ వివేక్ మంచి సపోర్ట్ ఇస్తూంటారు. ఇలా జరుగుతూండగా ఓ రోజున జానకి లోకల్ పోలీస్ స్టేషన్ కి వస్తుంది. తాను తన ప్రెండ్ వివేక్ ను వారంరోజుల క్రితం మర్డర్ చేశానని సీఐ కరుణన్ (కళాభవన్ షాజోన్)కి చెబుతుంది.అంతేకాకుండా ఆ శవాన్ని అక్కడి దగ్గరలోని అటవీ ప్రాంతంలో పాతిపెట్టానని చెప్తుంది.

తనతో వస్తే శవాన్ని ఎక్కడ పూడ్చినది చూపిస్తానని చెబుతుంది.ఆ మాటలు విని.. ఆమె మెంటల్ కండిషన్ సరిగ్గా లేదనుకుంటారు పోలీస్ లు. దాంతో ఆమె అడ్రెస్ ఇచ్చి వెళ్లమని, తాము ఇన్వెస్టిగేట్ చేస్తామని పోలీస్ లు చెబుతారు ఈలోగా ఈ విషయం మీడియాకు లీక్ అవ్వటంతో వాళ్లంతా వచ్చి జానికి చుట్టుముట్టి ఏం జరిగిందని అడుగుతారు. ఆమె పోలీస్ లకు చెప్పిందే అక్కడా చెప్తుంది. అలాగే సీఐ కరుణన్ పట్టించుకోవడం లేదని అంటుంది.

ఈ లోగా ఫామ్ హౌస్ నుంచి వారం రోజుల నుంచి వివేక్ మిస్సయ్యాడంటూ సీఐ కరుణన్ కి ఇన్ఫర్మేషన్ వస్తు్ంది. దాంతో తప్పనిసరి పరిస్దితుల్లో ఆమె తో పాటు పోలీస్ లు, ఆ వెనుకే మీడియా వెళుతుంది. అయితే అక్కడే ట్విస్ట్ పడుతుంది. ఆమె అడవిలో ఒక చోటకు తీసుకెళ్తుంది. జానకి చెప్పినట్టుగానే ఆ ప్రదేశంలో వెతుకుతారు. కానీ ఊహించని విధంగా మరో శవం కూడా బయటపడటంతో అంతా షాక్ అవుతారు.

అలాగే ఆ రెండు శవాల్లో ఏదీ కూడా వివేక్ ది కాదని తేలడంతో పోలీస్ డిపార్టుమెంట్ నోట మాట రాదు.ఈ ట్విస్ట్ లు చాదదన్నట్లు ఆ హత్యలలో తనకు సీఐ కరుణన్ సహకరించాడని అని మీడియాతో చెబుతుంది. విచారణ జరిపితే నిజాలు బయటికి వస్తాయని చెప్పి షాక్ ఇస్తుంది. అప్పుడేమైంది..అసలు ఆ శవాలు ఎవరివి...జానికి నిజంగానే మర్డర్ చేసిందా..ఎస్సైకు నిజంగానే ఆ మర్డర్స్ తో సంభందం ఉందా..ఒక శవం కాకుండా రెండు శవాలు ఉండటం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

మలయాళ సినిమా అనగానే మనకు క్రైమ్ థ్రిల్లర్స్ గుర్తు వచ్చేస్తున్నాయి. నేచురాలిటీ యాక్టింగ్​తో ఆ మూవీస్ ఆడియెన్స్​కు సీట్​ఎడ్జ్​థ్రిల్లింగ్​ను కూర్చోపెడ్తున్నాయి. మరీ ముఖ్యంగా మిస్టరీ క్రైమ్, మర్డర్ థ్రిల్లర్స్​ఉత్కంఠగా సాగుతుంటాయి. అందుకే వాటికి ఓటీటీలో సూపర్ క్రేజ్ ఏర్పడింది. అవి స్ట్రీమింగ్​కు అందుబాటులో వచ్చీ రాగానే ఓ రేంజి ​రెస్పాన్స్​తో వ్యూస్​ను అందుకుంటుంటున్నాయి. అందుకే తమ యూజర్స్​ను ఆకట్టుకునేందుకు, కొత్తవారిని ఎట్రాక్ట్ చేసేందుకు... ఎక్కడెక్కడి మిస్టరీ క్రైమ్​, మర్డర్​థ్రిల్లర్స్​కు వెతికి ఓటీటీ ప్లాట్​ఫామ్​లు పోటీ పడి మరి విడుదల చేస్తున్నాయి. ఆ కోవలో వచ్చిందే ఈ చిత్రం.

అదృశ్యం సినిమా కథ గొప్పగా లేకున్నా దాన్ని స్క్రీన్ ప్లేతో ఇంట్రస్టింగ్ గా మార్చారు. నేరుగా కథలోకి వెళ్లిపోవటం కలిసొచ్చింది. సోష‌ల్ మెసేజ్‌కు ఇంట్రస్టింగ్ గా ఉండే క్రైమ్ ఎలిమెంట్స్ జోడించి ద‌ర్శ‌కుడు సుదీష్ రామ‌చంద్ర‌న్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. అప‌ర్ణ బాల‌ముర‌ళి క్రేజ్‌తో మ‌ల‌యాళంలో ఈ మూవీ మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. కానీ తెలుగులో డబ్ చేసి థియేటర్ లో రిలీజ్ చేద్దామని లేదా రీమేక్ అయినా చేద్దామన్నట్లుగా ఈ సినిమాని ఓటిటికి ఇవ్వకుండా ఆపారు. అయితే రెండేళ్లు కావటంతో ఇప్పుడు ఈ సినిమాని ఓటిటికి వదిలేసారు. విజ‌య్ దేవ‌ర‌కొండ ఖుషి ఫేమ్ షీష‌మ్ అబ్దుల్ వ‌హాబ్...అదృశ్యం మూవీకి మ్యూజిక్ అందించాడు.

అపర్ణ బాల మురళి.. ఈ సినిమాలో కూడా తన అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాకు సుదీష్ రామ‌చంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కాగా ఈ సినిమాలో అప‌ర్ణ బాల‌ర‌ముర‌ళితో పాటు హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, సిద్ధిఖీ ముఖ్య పాత్రలు పోషించారు.
చూడచ్చా
క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కథలను ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.

ఎక్కడ చూడచ్చు

ఈటీవీ విన్  లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.


Tags:    

Similar News