అజిత్,త్రిష 'పట్టుదల' రివ్యూ
రీసెంట్ గా ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారంకి ఎంపికైన తమిళ హీరో అజిత్ కొత్త సినిమా ‘విడాముయర్చి’.;
రీసెంట్ గా ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారంకి ఎంపికైన తమిళ హీరో అజిత్ కొత్త సినిమా ‘విడాముయర్చి’. ఈ సినిమాని ఎప్పటిలాగే తెలుగులో పట్టుదల టైటిల్ తో డబ్బింగ్ చేసి వదిలారు. యాక్షన్ థ్రిల్లర్ గా మన ముందుకు వచ్చిన ఈ చిత్రం కథేంటి..తెలుగువారికి నచ్చే సినిమానేనా, చూసినవారికి ఎలాంటి థ్రిల్‌ను పంచింది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
అజర్‌బైజాన్ దేశంలో అర్జున్ (అజిత్‌కుమార్) ఓ అమెరికన్ కంపెనీలో ఉన్నతోద్యోగి. ఆయన భార్య కాయల్ (త్రిష). ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరూ పన్నెండేళ్లు తర్వాత రకరకాల కారణాలతో ఇద్దరూ విడిపోవాలనుకుంటారు. ఈ క్రమంలో ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి బయిలుదేరుతుంది. ఆమెను చివరగా తానే కార్‌లో దిగబెడతానని అంటాడు అర్జున్.
అక్కడనుంచి జంట ప్రయాణంలో రకరకాల సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఓ టైమ్ లో కాయల్ కనిపించకుండా పోతుంది. ఆమెను ఎవరు ఎత్తుకుపోయారు. విడిపోదామనుకున్న బార్యను అర్జున్ వెతికి వెనక్కి తెచ్చుకున్నాడా..ఇంతకీ ఈ కథలో రక్షిత్ (అర్జున్), దీపిక (రెజీనా)కీ పాత్రలు ఏమిటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎనాలసిస్
స్క్రిప్టే ఈ సినిమాకు మైనస్ గా మారింది. ఓ ఫ్యామిలీ రోడ్ ట్రిప్ లో అనుకోని ప్రయాణంలో ఇరుక్కోవటం ప్రధానంగా ఇలాంటి కథలు సాగుతుంటాయి. కొన్ని హారర్ రోడ్ ట్రిప్ పిల్మ్ లు అయితే మరికొన్ని థ్రిల్లర్ రోడ్ ట్రిప్ మూవీస్ ఉంటుంది. హాలీవుడ్ లో ఇవి పరమ రొటీన్ సినిమాలు. ఇక్కడ మనకు డబ్బింగ్ అయ్యి వస్తూంటాయి. అలా చాలా ఏళ్ళ క్రితం వచ్చిన హాలీవుడ్ చిత్రం బ్రేక్ డౌన్ సినిమాని యాజిటీజ్ పాయింట్ ని , సీన్స్ ని లేపి చేసిన సినిమా ఇది.
అజిత్ స్టైల్ సినిమాని ఆశించి వెళ్తే అలాంటి సీన్స్ ఏమీ ఉండవు. ఏదో స్టైలిష్ యాక్షన్ సినిమా ..అదీ హాలీవుడ్ స్దాయిలో చేయాలని తపన పడి చేసిన సినిమా ఇది. కంటెంట్ సరిగ్గా లేనప్పుడు, అదీ అజిత్ స్థాయి కంటెంట్ కానప్పుడు ఎంత గొప్పగా తీసినా గోవిందానే అని మరోసారి ప్రూవ్ చేసిన సినిమా ఇది. సినిమాలో ట్విస్ట్ లు ఉన్నాయి కానీ వాటిని పండించడంలో డైరెక్టర్ ఫెయిలయ్యారు. ఫస్టాఫ్ లో అయితే అసలు ఏమీ జరిగిన ఫీలింగ్ రాదు. సెకండాఫ్ అయితే రిపీట్ సీన్స్ తో విసిగిస్తుంది.
టెక్నికల్ గా
మాస్ సినిమాని రియలిస్టిక్ గా చూడాలని డైరెక్టర్ చేశారు. అయితే డైరెక్టర్ ..అజిత్ వంటి మాస్ హీరోని అలా ప్యాసివ్ క్యారక్టరైజేషన్ లో చూపించటమే పెద్ద ఇబ్బంది. ఇక అజిత్, త్రిష జోడీ ఎప్పటిలాగే ఆకట్టుకుంటుంది. అజిత్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నా..తెరపై పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయనే చెప్పాలి.
ఇక తెలుగు, తమిళంలో నెంబర్ వన్ గా వెలుగుతున్న అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం ఇచ్చారు. అయితే పాటలు వర్కవుట్ కాలేదు. ఉన్నంతలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యింది. అయితే అప్ టుది మార్క్ లేదు. ఇక ఓం ప్రకాష్ కెమెరా వర్క్ బాగుంది. సినిమాకు ఓ మూడ్ ని, టోన్ ని సెట్ చేసింది. శ్రీకాంత్ ఎడిటింగ్ సెకండాఫ్ లో షార్ప్ తగ్గిపోయింది. తెలుగు డబ్బింగ్ డైలాగులు సోసోగా ఉన్నాయి.
చూడచ్చా
బ్రేక్ డౌన్ ఇంగ్లీష్ సినిమా చూడనివారు ఓ లుక్కేయచ్చు. మిగిలినవారికి ఇదో సాగతీసిన థ్రిల్లర్ గా అనిపిస్తుంది
నటీనటులు: అజిత్, త్రిష, అర్జున్, రెజీనా, ఆరవ్, రవి రాఘవేంద్ర, జీవ రవి, రమ్య సుబ్రహ్మణ్యం తదితరులు;
సంగీతం: అనిరుధ్ రవిచందర్;
ఎడిటింగ్: ఎన్.బి.శ్రీకాంత్;
సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాశ్;
నిర్మాత: సుభాష్‌కరణ్;
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మాగిజ్ తిరుమనేని;
తెలుగులోవిడుదల: ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీలక్ష్మీ మూవీస్