అక్షయ్ కుమార్ 'హౌస్‌ఫుల్ 5' హిందీ మూవీ రివ్యూ

క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా కథేంటి, అసలు ఎలా ఉంది, బాగా నవ్వించిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.;

Update: 2025-06-07 12:14 GMT

వరస పెట్టి హౌస్‌ఫుల్ ప్రాచైంజీలు వస్తూనే ఉన్నాయి. అయితే లక్కీగా కామెడీతో ఇప్పటిదాకా వర్కవుట్ అవుతూనే వచ్చాయి. ఇప్పుడు అదే ధైర్యంతో ఐదో ప్రాంఛైజీకు తెర తీసారు. అయితే ఈ సారి కొత్తగా ఏదో ఒకటి చెప్పాలని రెండు క్లైమాక్స్‌లుతో ప్రేక్షకులకు ఒక రకమైన 'డబుల్ సర్ప్రైజ్' ఇచ్చామని ప్రచారం చేసారు. అలా థియేటర్లలో "Housefull 5A" మరియు "5B" అంటూ వేర్వేరు క్లైమాక్స్‌లతో రిలీజ్ అవటంతో జనం బాగానే మాట్లాడుకున్నారు. ఓ కామెడీకు సినిమాకు కావాల్సిన హైప్, క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా కథేంటి, అసలు ఎలా ఉంది, బాగా నవ్వించిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

69 మిలియన్ డాలర్ల ఆస్దిపరుడు దోబ్రియాల్ (రంజిత్) . ఆయన తన 100వ పుట్టిన రోజును ఓ లగ్జరీ క్రూయిజ్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని ప్లాన్ చేస్తాడు. కానీ ఈ సంబరాల మధ్య ఆయన అనుమానాస్పదంగా చనిపోతాడు. ఆయన చనిపోయాక ఓ వీలునామా బయిటకు వస్తుంది. అందులో తన ఆస్తి జాలీ అనే తన మొదటి భార్య కుమారుడికి చెందాలని వెల్లడిస్తాడు. ఆ వారసుడుని గుర్తపట్టడానికి కొన్ని గుర్తులు చెప్తాడు.

ఈ క్రమంలో ముగ్గురు జాలీ తామే అంటూ ముగ్గురు వ్యక్తులు (అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్) తమ భార్యలు జారా, శశికళ, కాంచీ (సోనమ్ బజ్వా, జాక్వలైన్, నర్గీస్ ఫక్రీ)ల తో కలిసి వస్తారు.ఎవరికి వారే ఆస్తిపైన హక్కు తమదే అంటారు. డీఎన్ ఏ టెస్ట్ చేసి వారసుడుని కనుక్కుందామని ప్రయత్నించిన డాక్టర్ హత్యకు గురి అవుతాడు. ఆ మర్డర్ కేసుని సాల్వ్ చేయటానికి పోలీసులు బాబా (జాకీ ష్రాఫ్), బిద్దు (సంజయ్ దత్), దగ్డు (నానా పటేకర్) వస్తారు. అప్పుడేమైంది ? అసలు హంతకుడు ఎవరు? అసలు వారసుడు ఎవరు అనేది మిగతా సినిమా.

విశ్లేషణ

Housefull సిరీస్ ని వరసపెట్టి చూసి కథలు చెప్తామంటే... ఒక్కటీ గుర్తురాదు. ఎందుకంటే వాటిలో దేంట్లోనూ నిజంగా కథే ఉండదు. ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా మనకు నచ్చిందా లేదా అనేది ప్రక్కన పెడితే అదే Housefull USP. కానీ Housefull 5 దగ్గరకు వచ్చేసిరి ఆ ఫార్ములా కూడా ఫేడవుట్ అయ్యిపోయింది. జోకులు కూడా అవుట్ డేటెడ్ అయ్యిపోయాయి.

ఇలాంటి స్టోరిలైన్ లు గతంలో చాలా వచ్చాయి. అప్పట్లోనే తెలుగులో యస్ ...నేనంటే నేనే (కృష్ణ,కృష్ణంరాజు) , ఆ తర్వతా చంటబ్బాయి (చిరంజీవి) చేసారు. అయితే ఆ స్క్రిప్ట్‌లో ఎనర్జీ ఉంటే..ఈ స్కీన్ ప్లే లో ఎలర్జీ ఉంటుంది. హౌస్ ఫుల్ టైటిల్ పెట్టాము కదా అని తెర నిండా ఎప్పుడూ జనం , అదీ స్టార్స్ ని,పాపులర్ ఆర్టిస్ట్ లను తెచ్చి పోసేసారు.

అయితే అంత మాత్రానికే హౌస్ ఫుల్ పెట్టేసే పరిస్దితి థియేటర్స్ రాదు కదా. అసలు అంతమంది జనం ..ఒకేసారి ఎవరేం మాట్లాడుతున్నారో , ఎవరు ఎప్పుడు ఎక్కడ నించున్నారో వాళ్లకే తెలియని స్థితి. దీన్ని ఎక్స్టెంపో హాస్యం అని కొందరు అంటారు. కానీ ఇక్కడ అది "ఎక్స్టెస్ అయిన ఆర్టిస్ట్ లు సోది" గా మారిపోయిం . స్క్రిప్ట్‌ ఏ దిశలోనూ ముందుకు పోవడం లేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది.

రెండు క్లైమాక్స్‌లు – సృజనాత్మకత కాదు

"Housefull 5A", "Housefull 5B" అంటూ రెండు రకాల క్లైమాక్స్‌లతో సినిమాను విడుదల చేయడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం పబ్లిసిటి కోసమే అని తెలిసినా, ఏదో ఆసక్తి, అయితే దాన్ని నిర్దాక్ష్యణ్యంగా మొదటి పది నిముషాల్లోనే చంపేసారు.

పాత్రలు కాదు, కార్టూన్స్

ఈ సినిమాలో చాలా పాత్రలు (చిత్రంగదా, డినో మోరియా, శ్రేయాస్ తల్పాడే వంటి వారు)కార్టూన్స్ లా కనపడుతూంటారు. ఎవరిలోనూ జీవం ఉన్నట్లు కనపడరు. అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్, అక్షయ్ కుమార్ కామెడీ పండించగల సత్తా ఉన్నా... అప్పటికప్పుడు ఏదో ఒకటి అనేసుకుని ఓ స్కిట్ లా చేయించేసినట్లు కనపడుతుంది. నావల్టీ అనే పదానికి అయితే అసలు చోటేలేదు.

ఫైనల్ థాట్..

ఇంతవరకు వచ్చిన Housefull సినిమాలపై విమర్శలు ఉన్నా, అవి ఓ స్థాయి వరకు ‘కమర్షియల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్’తో అయినా బతికేవి.

కానీ Housefull 5 మాత్రం, తన ఇమాజినేషన్‌ని ఇంటెలిజెన్స్‌తో కాకుండా, అసహ్యపు అల్లరితో నింపేసారు. ఈ సినిమా, బాలీవుడ్ లో హాస్యం అంటే ఏమిటో అసలే మర్చిపోతున్న రోజుల్లో, ఇంకాస్త మరచిపోవాలని ట్రై చేసింది. ఇది నవ్వులకి కాదు... థియేటర్‌లో ఎందుకు వచ్చాం అనే ప్రశ్నకి గేట్‌వే లానే ఉంది.

“హౌస్‌ఫుల్” కాకుండా “హెడ్ఎక్‌ఫుల్!” అని పెట్టి ఉంటే బాగుండేది.

Tags:    

Similar News