'అంధేరా' వెబ్ సిరీస్ రివ్యూ!
స్పార్క్ లేని డార్క్ ఐడియా;
ముంబైలో ఓ రాత్రి పూట వీధులలో, భయంతో పరుగెత్తే అమ్మాయి బానీ బారుహ్ (24, బైపోలార్) తో అంధేరా ప్రారంభమవుతుంది. కనిపించని చీకటి శక్తి ఆమెను కవర్ చేస్తూంటుంది, అంతేకాదు ఓ హోటల్ విండో నుండి క్రిందకి పడిపోయి మరణించడానికి కారణమవుతుంది. ఆ దృశ్యాన్ని జే షేథ్ (కరణ్‌వీర్ మాల్హోత్రా),అనే ఒక మెడికల్ స్టూడెంట్, చూస్తాడు – అనుకోకుండా బానీతో అతను కలిసినట్టు అనిపిస్తుంది.
జే తన ఆలోచనలు, హల్యూసినేషన్లు, గురించి రుమీ (ప్రాజక్తా కోళి)తో షేర్ చేసుంటూంటాడు, ఆమె ముంబైలోని పారానార్మల్ ఘటనలపై యూట్యూబ్ షో చేస్తుంది. ఇద్దరూ కలిసి ఆ “అంధేరా” ఏమిటి, అది వాస్తవం లేదా మిథ్ అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే జే షేథ్ అన్నయ్య పృధ్వీ సైతం ఓ ప్రమాదానికి గురి అయ్యి కోమాలోకి వెళ్తాడు. ఆ సమయంలో అతన్ని ఓ 'అంధకారం' అలుముకోవటం గమనిస్తాడు. అసలు ఈ 'అంధకారం' ఏమిటనే క్లారిటీ కి రాలేకపోతాడు.
ఇదే సమయంలో, బానీ తండ్రి ముంబై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తారు. ఆమె మిస్సింగ్ కేసుగా నమోదు అవుతుంది. ఇక్కడ మనకు పరిచయం అవుతుంది కల్పన కాదమ్ (ప్రియా బాప్ట్). ఆమె ధైర్యవంతురాలైన ముంబై పోలీస్ ఆఫీసర్. ఆమె తన టీమ్ తో కలిసి కేసును పరిశీలించడం ప్రారంభిస్తుంది. బానీ తల్లి,తండ్రులను కలుస్తుంది. వాళ్లూ కాస్తంత డిఫరెంట్ గా బిహేవ్ చేయంటోతో ఆమెను అయోమయంలో పడేస్తుంది.
కేసు డెప్త్ లోకి వెళ్లేకొలిది అసాధారణ నిజాలు బయటకొస్తాయి – జే , బానీతో ఎలాంటి రిలేషన్ ఉంది, ఫృద్వీ ప్రయోగానికి ఈ 'అంధకారం' కి సంభదం ఏమిటి, జే హల్యూసినేషన్ల మూలం ఏమిటి, అంధేరా నిజంగా ఒక శక్తేనా, లేక మిథ్ మాత్రమేనా అనే విషయం తెలియాలంటే సీరిస్ పూర్తి గా చూడాల్సిందే.
ఎనాలసిస్
ఇలాంటి సూపర్ న్యాచురల్ సినిమాలు కానీ వెబ్ సీరిస్ లు కానీ ఒక విషయాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతాయి. అదేంటంటే తెరపై చూపెట్టే దృశ్యాలకంటే, ప్రేక్షకుల ఊహల్లో భయం పెంచడమే ముఖ్యమైన అంశం. అలాగే నిజ జీవితంలో మనకు రెగ్యులర్ గా కనిపించే తరహా ప్రదేశాలు, నిజ జీవిత పరిస్థితులు ఉపయోగించడం + రియల్ గా అనిపించే సౌండ్ డిజైన్ వాడి హారర్ ని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్తారు. ఇక అంధేరా కాన్సెప్ట్ , డిజైన్‌లో హై లెవిల్ ఐడియాలజీ ఉంది. అయితే హారర్ జానర్ నుంచి ఎదురు చూసే డెప్త్ ను ఇవ్వడంలో మాత్రం ఫెయిల్ అయ్యింది. అలాగే క్యారెక్టర్ డెవలప్మెంట్స్ స్లో బిల్డ్‌అప్ తో వెళ్లటంతో కొద్దిగా సహనానికి పరీక్షగానే అనిపించాయి.
ఇలాంటి సూపర్ నేచురల్ స్క్రిప్టు ఆలోచనలను పూర్తిగా ఇక్కడి వరకు తీసుకురావడానికి, మరింత ruthless స్క్రిప్ట్ అవసరం ఉంది, ఇది క్యారెక్టర్స్‌ను వారి లిమిటేషన్స్ ను మించిపోయే స్థాయికి పుష్ చేయాలి. ఇది కేవలం ఇంటర్నల్ హారర్ ని మాత్రమే కాదు, ఎక్స్‌టర్నల్ భయాల రూపాలను కూడా చూపాల్సి ఉంటుంది, కానీ షో ఈ రెండింటి మధ్య ఎక్కడ లైన్ డ్రా చేయాలో సరిగ్గా డిసైడ్ చేయలేక కనెక్ట్ కాని ఫీలింగ్ ఇస్తుంది.
అలాగే ‘అంధేరా’కు ఉన్న మరో నెగటివ్ పాయింట్, డైరెక్టర్స్ సూపర్ హిట్ నెట్ ప్లిక్స్ సీరిస్ ‘Stranger Things’ ను కొంచెం ఎక్కువగా copy చేయడం. అదేవిధంగా, చాలామంది నటీ-నటులు ఉన్నప్పటికీ, కేవలం 2-3 క్యారెక్టర్స్ మాత్రమే కథను డామినేట్ చేస్తాయి; మిగతా క్యారెక్టర్స్ ఒక నిర్దిష్ట సమయంలో props లా మారిపోతారు. కేతన్ సోధా యొక్క brooding మ్యూజిక్ కొంత వరకు మాత్రమే ఎఫెక్టివ్ గా ఉంది, అదేవిధంగా, దర్శకుడు రాఘవ్ చిల్లింగ్ అనుభవం ఇవ్వడంలో విఫలమయ్యాడనే చెప్పాలి.
చూడచ్చా
మీరు రెగ్యులర్ గా హారర్ సినిమాలు చూసే వాళ్లు కాకపోతే మాత్రమే ‘అంధేరా’ మీకు నచ్చుంది. భయంతో ‘అంధేరా’ అనిపిస్తుంది. కానీ హారర్ జానర్ ఫ్యాన్ అయితే, ఈ ప్రైమ్ వీడియో సిరీస్ మీకు ఇప్పటికే చూసిన వాటి మిక్స్ మాత్రమే అనిపిస్తుంది. అదనంగా, ‘Stranger Things’ ఇచ్చే రిఫరెన్స్‌లు కొంచెం ఎక్కువగా, overstretchగా ఉన్నాయి. కాపీ చేయడం, ఇన్స్పిరేషన్ పొందటం మధ్య గీత గీయటం కష్టం కానీ ముఖ్యం.
ఫైనల్ థాట్
Misinformation( సమాచార మోసం), displacement (స్థలమార్పు), violations (హక్కుల ఉల్లంఘన)లాంటి పరిస్థితులు ఉన్న నేటి ప్రపంచంలో భయం అనేది ఒక సహజమైన ఎమోషనల్ రియాక్షన్. Capitalism, greed వల్ల మనం ఎటు వెళ్తున్నామో అర్దం కాని పరిస్దితుల్లో ఉండటం నిజమైన భయం. అంధేరా ఆ ప్రశ్నల నుంచి ప్రారంభమై, చివరికి ఒక కంట్రోలు లేని గందరగోళం గా మారుతుంది. సమాధానాలు ఇవ్వకుండా, షో నిరంతరం సాగుతూ, కొన్ని చోట్ల ప్రేక్షకుల patience ని పరీక్షిస్తూనే ఉంటుంది.
ఎక్కడ చూడచ్చు
అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది.