2025 అనుష్క దే.... రెండు రిలీజ్ లు ,రెండూ షాకింగ్ క్యారక్టర్సే

బాహుబలి వంటి సినిమాల తర్వాత ఏ స్టార్ అయినా వరస ప్రాజెక్టులు చేస్తారు. కానీ అనుష్క బ్రేక్ తీసుకుంది. తన బరువు సమస్యలతో గత కొన్నేళ్లుగా స్క్రీన్ కు దూరంగా ఉంటూ వచ్చింది.

Update: 2024-10-25 06:18 GMT

బాహుబలి వంటి సినిమాల తర్వాత ఏ స్టార్ అయినా వరస ప్రాజెక్టులు చేస్తారు. కానీ అనుష్క బ్రేక్ తీసుకుంది. తన బరువు సమస్యలతో గత కొన్నేళ్లుగా స్క్రీన్ కు దూరంగా ఉంటూ వచ్చింది. ఆమె బరువు తగ్గటానికి ట్రీట్మెంట్ తీసుకున్నా పెద్ద ఫలితాలు ఇవ్వకపోవటంతో ఇబ్బందులు పడింది. ఆమె సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసే అభిమానులుని నిరాశపరుస్తోంది. అయితే ఆమె మిస్సెస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఆ సినిమా డీసెంట్ హిట్ అవటంతో ఉత్సాహంగా మళ్లీ బిజి అవుతోంది.ఇప్పుడు ఆమె రెండు సినిమాలు చేస్తోంది. 2025లో ఆ రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

వాస్తవానికి అనుష్క మార్కెట్ ఇప్పటికీ ఏమీ తగ్గలేదు. ట్రేడ్ నుంచి అదుతున్న సమాచారం మేరకు ..అనుష్క సినిమాలు చాలా మంది మీడియం రేంజి హీరోల చిత్రాల కన్నా కూడా మంచి బిజినెస్ చేస్తున్నాయి. ఆమె సినిమా దాదాపు ఇరవై కోట్లు వరకూ బిజినెస్ అవుతోందని చెప్తున్నారు. తన తోటి హీరోయిన్స్ కాజల్, తమన్నా, శృతి హాసన్ లతో పోలిస్తే అనుష్క మార్కెట్ చాలా బాగుందని చెప్తున్నారు. రజనీ కాంత్, ప్రభాస్, నాగార్జున, మహేష్ వంటి స్టార్స్ తో చేయటమే కాకుండా అరుంధతి, రుద్రమదేవి,భాగమతి వంటి చిత్రాలలో తనేంటో ఇండిడ్యువల్ గా చూపించింది. అదే ఆమెకు ప్లస్ అయ్యిందంటున్నారు. బాహుబలితో ఆమెకు ప్యాన్ ఇండియా మార్కెట్ వచ్చింది. అవన్ని అనుష్కను పూర్తి స్దాయి బిజీ చేస్తున్నాయి.

ప్రస్తుతం అనుష్క దర్శకుడు క్రిష్ తో కలిసి ''ఘాతి'' అనే చిత్రం చేస్తోంది. ఈ చిత్రం పస్ట్ లుక్ రిలీజ్ చేసి చాలా రోజులు అయినా ఆ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. క్రిష్ ..పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మొదలైన హరి హర వీరమల్లు చిత్రం ప్రారంభమై లేటు అవటంతో ఆ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకుని వేరే దర్శకుడుకి అప్పచెప్పారు. క్రిష్ ప్రస్తుతం ''ఘాతి'' ని పూర్తి చేసిరిలీజ్ కి రెడీ చేస్తున్నారు.ఇదొక ఇంట్రస్టింగ్ ప్రాజెక్టు అని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాతలుగా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు. ఈ సినిమాలో అనుష్క ఇప్పటివరకూ కనపడని ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో నటిస్తుందని తెలుస్తోంది. ప్రతీకారం, విముక్తి తో నడిచే గ్రిప్పింగ్ స్టోరీ, ఇక్కడ నేరస్థురాలిగా మారిన బాధితురాలి ఎలా లెజెండ్ స్థాయికి ఎదిగింది అనేదే కథాంశం. ఘాటి మహిళా-కేంద్రీకృత పాత్రలో అనుష్క ఒంటరి తల్లిగా కనిపించినుంది.

అలాగే అనుష్క మలయాళంలో ఓ సినిమాలో నటిస్తోంది. అనుష్క మళయాళంలో కథనార్‌- ద వైల్డ్‌ సోర్సరర్‌ అనే థ్రిల్లర్‌ సినిమా చేస్తోంది. ఈ చిత్రానికి రాజిన్‌ థామస్‌ దర్శకత్వం వహిస్తుండగా జయసూర్య హీరోగా నటిస్తున్నాడు. దాదాపు రూ.75 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకుగానూ అనుష్క రూ. 6 కోట్లు డిమాండ్‌ చేసినట్లు వినిపిస్తోంది. ఇకపోతే గతంలో ఒక్క సినిమాకు మూడు కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్న అనుష్క మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టికి ఐదారుకోట్లు తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి.

అనుష్క ఇంతకాలం పాజిటివ్ రోల్స్ చేస్తూ వచ్చింది. అయితే అవి బోర్ కొట్టాయో ఏమో కానీ ఇప్పుడు ఓ నెగిటివ్ రోల్ లో ఆమె కనపడబోతోందని తెలుస్తోంది. ఫస్ట్ టైమ్ ఆమె ఇలాంటి పాత్ర కమిటైందని నటనకు అవకాసం ఉన్న పాత్ర అని చెప్తున్నారు. అయితే ఈ పాత్రలో ఆమెకు రెండు షేడ్స్ ఉంటాయని , అయితే అది డ్యూయిల్ రోలా లేక ఒక్కరే ఇద్దరిగా కనపడతారా అనేది తెలియాల్సి ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. రోజిన్ థామస్ దర్శకత్వంలోఈ చిత్రం రూపొందుతోంది. మూఢ న‌మ్మ‌కాలు, క్షుద్ర పూజ‌లు, ఆత్మ‌లూ వంటి వాటితో ఫాంట‌సీ క‌థ ఇది చెప్తున్నారు. టెక్నిక‌ల్ గా ఈ సినిమాని హై స్టాండ‌ర్డ్స్‌లో తీర్చిదిద్దుతున్నట్లు వినిపిస్తోంది. ఈ సినిమా కోసం వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీని వాడుతున్నారు. ఆ విధానంలో రూపొందే మొట్ట మొదటి ఇండియన్ ఫిల్మ్ ఇదే. అనుష్క నెగిటివ్ రోల్ చేస్తోందని, అది ట్విస్ట్ లా రివీల్ అవుతుందని మళయాళ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మే కేరళ పూజారి కడమతుత్తు కథనార్ కథల ఆధారంగా ఈ సినిమాని తరకెక్కిస్తున్నారు. పలు యదార్థ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ హారర్ మూవీ కడమట్టు అనే ప్రాంతంలోని ఓ చర్చి ఫాదర్ జీవితం నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అనుష్క క్యారెక్టర్ 'అరుంధతి' మూవీ తరహాలో చాలా ఛాలెంజింగ్ గా ఉంటుందని అంటున్నారు. ఒక సూపర్ నాచురల్ హారర్ సినిమాలో అనుష్క శెట్టి కూడా భాగం కావడం ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారింది. పాన్ ఇండియన్ భాషలతో కలిపి మొత్తం 14 భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న మొదటి పాన్ వరల్డ్ మూవీ, ఆమెకి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి. 2025లోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.

Tags:    

Similar News