బ్యాన్ NETFLIX హ్యాష్ ట్రెండింగ్, హిందువులను నిజంగా అవమానించారా,అసలేం జరిగింది?

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ విషయం ట్రెండింగ్ లో కి వస్తుందో ఎవరూ ఊహించలేరు. తాజాగా ఇపుడుట్విటర్​ లో బైకాట్​ నెటిఫ్లిక్స్​ అనే హ్యాష్​ ట్యాగ్​ ఇప్పుడు ట్రెండింగ్​ లోకి వచ్చింది.

Update: 2024-09-02 03:00 GMT

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ విషయం ట్రెండింగ్ లో కి వస్తుందో ఎవరూ ఊహించలేరు. తాజాగా ఇపుడుట్విటర్​ లో బైకాట్​ నెటిఫ్లిక్స్​ అనే హ్యాష్​ ట్యాగ్​ ఇప్పుడు ట్రెండింగ్​ లోకి వచ్చింది. నెటిజన్లు నెట్ ప్లిక్స్ ఓటీటీ ని ఓ రేంజిలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఓ కొత్త వెబ్​ సిరీస్​ కు స్ట్రీమింగ్ అవుతున్న ఈ సమయంలో నెట్​ ఫ్లిక్స్​ ఓటీటీ సంస్థ చిక్కుల్లో పడింది. నెట్ ప్లిక్స్ హిందువులకు వ్యతిరేకంగా ఉందంటూ నెటిజన్లు హ్యాష్ ట్యాగ్ తో నెట్ ప్లిక్స్ ని ఆడుకుంటున్నారు. అసలేం జరిగింది. ఏ విషయంలో నెటిజన్లుకు ఇంత ఆగ్రహం వచ్చిందో చూద్దాం.

రియల్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కిన సీరీస్ ఐసీ 814 ది కాంధార్ హైజాక్. పాతికేళ్ల క్రితం జరిగిన హైజాక్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ వెబ్ సీరీస్ లో విజయ్ వర్మ, నసీరుద్ధీ షా, పంకజ్ కపూర్, కూద్ మిశ్రా, అరవింద స్వామి నటించారు. ఈ వెబ్ సీరీస్ ను అనుభవ్ సిన్హా, త్రిశాంత్ శ్రీవాస్తవ డైరెక్ట్ చేశారు. నెట్ ఫ్లిక్స్ లో లేటెస్ట్ గా రిలీజైన ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అయితే ఈ సీరిస్ లో ఓ చోట హిందువులకు వ్యతిరేకంగా దర్శకుడు వ్యవహరించారనేది నెటిజన్లు ఆరోపణ.

శ్రింజయ్ చౌదరి రాసిన ఫ్లైట్ ఇన్ టూ ఫియర్ బుక్ ఆధారంగా తెరకెక్కిన సీరీస్ ఇది. కాంధార్ హైజాక్ కథతో సీరీస్ మొత్తం నడిపించారు దర్శకులు. కాఠ్మండు నుంచి ఢిల్లీకి వెళ్లే విమానం ముందు పరిస్థితులతో సీరీస్ మొదలు పెట్ట్ ఫ్లైట్ హైజాక్ అయ్యేంత వరకు కథను నడిపారు.

ఈ సిరీస్ లో మొత్తం ఆరు ఎపిసోడ్‌లు ఉన్నాయి. ప్రతీ ఎపిసోడ్‌ లో అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయనేది డీటేయిలింగ్ ఇస్తూ అనుభవ్ సిన్హా, త్రిశాంత్ శ్రీవాస్తవ కథని వివరించారు. కథ ప్రకారం 176 మంది ప్రయాణికులతో కాఠ్‌మాండు నుంచి ఢిల్లీకి బయలుదేరిన ‘ఐసీ 814’ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్‌ చేస్తారు. అయితే ఈ వెబ్​ సిరీస్​ లో చూపిన ఉగ్రవాదుల పేర్లపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

నాడు కాందహార్ విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదుల పేర్లు..

1.- ఇబ్రహీం అక్తర్

– 2. షాహిద్ అక్తర్

– 3. సన్నీ అహ్మద్

– 4. జహూర్ మిస్త్రీ

– 5. షకీర్

కానీ అనుభవ్ సిన్హా నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘IC 814’లో హైజాకర్లను-‘ భోలా- శంకర్’ అనే హిందువుల పేర్లతో చూపాడని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హిందూ వర్గాలతోపాటు సాధారణ నెటిజన్లు కూడా అటు అనుభవ్ సిన్హాను, ఇటు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీని ఓ రేంజ్​ లో తిట్టిపోస్తున్నారు. వెబ్ సిరీస్‌ల పేరుతో హిందువుల పరువు తీయడం ఆపండి అంటూ మండి పడుతున్నారు. అయితే అక్కడ జరిగింది ఏమిటి అంటే హైజాక్ జరిగినప్పుడు ఆ టెర్రరిస్ట్ లు ఒకరిని ఒకరు పిలుచుకునే కోడ్ నేమ్స్ భోళా- శంకర్.

నిజంగా ఆ హైజాక్ సంఘటన జరిగినప్పుడు ఆ టెర్రరిస్ట్ లు పెట్టుకున్న కోడ్స్ నేమ్స్ ఇవి.. Chief, Doctor, Burger, Bhola, Shankar

వీటినే సీరిస్ లోనూ వాడటం జరిగింది.

Tags:    

Similar News