మైక్రోసాఫ్ట్ బాస్ నుంచి “జై శ్రీకృష్ణా”!
క్యూకి సాస్ 2లో మైండ్‌బ్లోయింగ్ ట్విస్ట్!
బిల్ గేట్స్ అనగానే మనకు కంప్యూటర్ ప్రపంచాన్ని మార్చేసిన వ్యాపారవేత్త, మానవతావాది గుర్తుకు వస్తారు . సాధారణంగా టెక్ కాన్ఫరెన్స్‌లు, హెల్త్ ప్రోగ్రామ్స్ లేదా యూనివర్సిటీ స్పీచ్‌లలో మాత్రమే కనిపించే ఆయన, ఇప్పుడు హిందీ టెలివిజన్ సీరియల్‌లో కనిపించడం అందరికీ షాక్ ఇచ్చింది.
అది కూడా మనకు గుర్తుండిపోయే క్లాసిక్ షో — “క్యూకి సాస్ భీ కభీ బహు థీ” లో. తులసి విరాణీ (స్మృతి ఇరానీ) పాత్రను తిరిగి తెరపైకి తెచ్చిన ఈ రెండో సీజన్‌లో, బిల్ గేట్స్ వీడియో కాల్ ద్వారా తులసితో మాట్లాడే సీన్ ప్రసారం అయింది.
అవును నిజం...మైక్రోసాఫ్ట్ స్థాపించి కంప్యూటర్ ప్రపంచాన్ని మార్చేసిన బిల్ గేట్స్ ఇప్పుడు హిందీ టీవీ సీరియల్‌లో కనిపించి ఆశ్చర్యపరిచారు. “క్యూకి సాస్ భీ కభీ బహు థీ 2” లో తులసి విరాణీతో జూమ్ కాల్ చేస్తున్న సీన్ ప్రసారం కావడంతో సోషల్ మీడియాలో కలకలం రేగింది!
ప్రోమోలో బిల్ గేట్స్ స్మృతిని ఉద్దేశించి “నమస్తే టుల్సీ జీ, జై శ్రీకృష్ణా” అంటారు. ఆమె కూడా తన స్టైల్లో “జై శ్రీకృష్ణా” అని స్పందిస్తుంది. ఆ కొద్ది సెకన్లలోనే ఇండియన్ టీవీ చరిత్రలో కొత్త చాప్టర్ రాసేశారు ఇద్దరూ!
బిల్ గేట్స్ ఇండియాకు ఎందుకు ఇంత దగ్గరగా?
గేట్స్ ఫౌండేషన్ సంవత్సరాలుగా భారతదేశంలో మాతా-శిశు ఆరోగ్యం, వాక్సినేషన్, పోషకాహారం వంటి రంగాల్లో పనిచేస్తోంది. ఇప్పుడు ఆయన ఆ సందేశాన్ని భారతీయ పాప్ కల్చర్‌లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్టుంది. సినిమా, సీరియల్, సోషల్ మీడియా — ఇవే ఇప్పుడు అవగాహనకు నూతన భాషలు. అందుకే బిల్ గేట్స్ ఈసారి స్పీచ్ కాకుండా సీరియల్ సీన్ ను ఎంచుకున్నారు.
ఇక బిల్ గేట్స్ ఒక భారతీయ టీవీ సీరియల్లో నటించడం ఇదే మొదటిసారి. ఈ సీరియల్లో తులసిగా స్మృతి ఇరానీ నటించి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. కానీ గత ఎన్నికల్లో ఓడిపోవడంతో మళ్ళీ అదే పాత్రలో ఆమె నటించడం మొదలుపెట్టారు. ఆమెతో బిల్ గేట్స్ ముచ్చటించిన ఈ సీన్ ఇప్పుడు సెన్సేషన్ అయింది.
ఇండియాకు ప్రత్యేకంగా దగ్గరగా ఉండే బిల్ గేట్స్ ఇప్పుడు ఇండియన్ టెలివిజన్ లోకంలోకి అడుగుపెట్టడం — నిజంగా ఎవరూ ఊహించని ట్విస్ట్! ఈ ఎపిసోడ్‌తో స్టార్ప్లస్ TRP లెవల్స్ అమాంతం పెరిగిపోయాయి! “బిల్ గేట్స్ ఇన్ క్యూకి” — ఇదే ఇప్పుడు న్యూస్ ఇండియా మొత్తం మాట్లాడుతున్న టాపిక్! స్టార్ప్లస్ ఈ ఎపిసోడ్‌కి షేర్ చేసిన ప్రోమోతోనే ట్రెండ్స్ ఫ్లడ్ అయ్యాయి. ముఖ్యంగా “బిల్ గేట్స్ జై శ్రీకృష్ణా” అంటూ చెప్పిన క్షణం. ఇది టెలివిజన్ హిస్టరీలో ఒక మెమరబుల్ క్రాస్‌ఓవర్ మోమెంట్ గా మిగిలిపోతుంది.