బాబీ డియోల్ 'ఆశ్రమ్' (సీజన్ 3 - పార్ట్ 2) సిరీస్ రివ్యూ!
ఈ సీజన్ లో జరిగే కథ ఏమిటి, మొదటి రెండు సీజన్స్ స్థాయిలో ఈ సీజన్ కూడా కొనసాగిందా అనేది చూద్దాం.;
సూపర్ హిట్టైన హిందీ 'ఆశ్రమ్' సిరీస్ కు మరో కొత్త సీజన్ ఇది . కుట్రలు,కుతంత్రాలతో కొనసాగే ఆశ్రమంలో ఏం జరుగుతుంది మొదటి రెండు సీజన్స్ ఆసక్తిగా చెప్తాయి. ఇప్పుడు ఆఖరి సీజన్ లో బాబాజీకి చెక్ చెప్పే కార్యక్రమం పెట్టుకున్నారు. సీజన్ 3కి సంబంధించి పార్టు 2ను 5 ఎపిసోడ్స్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఈ సీజన్ లో జరిగే కథ ఏమిటి, మొదటి రెండు సీజన్స్ స్థాయిలో ఈ సీజన్ కూడా కొనసాగిందా, ఈ సీజన్ లో ఏం కథ చెప్పారు, ఆ స్దాయి హిట్ అవుతుందా అనేది చూద్దాం.
స్టోరీ లైన్
అంతకు ముందు ఎపిసోడ్స్ మాదిరిగానే బాబాజీ (బాబీ డియోల్) వందల కోట్ల ఆస్తులు .. జనాదరణ తో తన 'కాశీపూర్' లోని ఆశ్రమాన్ని అడ్డుపెట్టుకుని చెలరేగిపోతూంటాడు.తన అనైతిక కార్యక్రమాలకు అడ్డు అదుపూ లేకుండా ,ఎదురనేది లేకుండా ముందుకు వెళ్తూంటాడు. రాష్ట్ర రాజకీయాలను బాబాజీ శాసిస్తూ ఉంటాడు. బాబాజీ చేసే అక్రమాలకు అతని స్నేహితుడు 'బొప్పా' (చందన్ రాయ్)నే పూర్తి అండ. బాబాజీ కారణంగా 'పమ్మి' (అదితి పోహంకర్) అన్యాయానికి గురవుతుంది. తన తల్లిదండ్రులను .. సోదరుడిని కోల్పోయి జైలుపాలవటంతో కథ మలుపు తిరుగుతుంది.
దాంతో వేరేదారి లేక బాబాజీ నిజస్వరూపాన్ని బయట ప్రపంచానికి పూర్తిగా చూపించాలంటే తాను కూడా అక్కడే ఉండాలని, 'పమ్మి' భావించి, బాబాజీ పట్ల తొందరపాటుతో వ్యవహరించినందుకు క్షమించమని కోరుతుంది. ఆమె మారిపోయిందని భావించిన బాబాజీ, తన ఆశ్రమానికి తీసుకుని వస్తాడు. బాబాజీని దెబ్బతీయటానికి ముందుగా 'బొప్పా'ను వశపరచుకోవాలని భావించి ఆ పనిలో ఉంటుంది. ఆ క్రమంలో ఆశ్రమంలో ఆమెకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? బొప్పా ఆమెకు లొంగుతాడు? అతన్ని అడ్డం పెట్టి బాబాజీ నిజ స్వరూపం ఆమె బయిటపెట్టగలుగుతుందా ? చివరకు ఏమైంది? అనేది కథ.
ఎలా ఉంది
ఎన్నో సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు ప్రకాష్ ఝా క్రాఫ్ట్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని ప్రత్యేకత ప్రతి పాత్ర, సీన్ మెయిన్ స్ట్రీమ్ కథా, కథనంలో కలిసిపోయి ప్రవహిస్తుంది. ఈ సిరీస్‌ను మాస్-అప్పీల్ ఫిల్మ్‌గా ఆయన రూపొందిస్తున్నారు, కథకు తగ్గట్టుగానే ఉంటూనే ప్రతి పాత్రకు తగిన న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు. గత సీజన్‌ల మాదిరిగానే, ఈ సారి కూడా దాని లోపాలని కవర్ చేస్తూ డిజైన్ చేశారు. అయితే పెద్ద పెద్ద ఎపిసోడ్‌ల కారణంగా ఇది ఒకే స్పీడులో వెళ్లటానికి కష్టపడుతుంది. ఎడిటర్ సంతోష్ మండల్ ఎడిటింగ్ క్రిస్పర్ గా ఉన్నా. ఇది బాబా జీపై ప్రతీకారం తీర్చుకోవాలనే పమ్మి యొక్క కోరిక,తాపత్రయం ను పెద్దగా సాగదీయకపోవటంతో ఎట్రాక్షన్ గా తయారైంది.
సీరిస్ లో పేసింగ్ సమస్యలు కొంతవరకూ మెయిన్ ప్లాట్ కు దూరంగా వచ్చేలా చేస్తే, సీరిస్ లో ఉండే ఎట్లా స్మియర్, కాంప్లికేట్, నేపథ్య సంగీతం మనల్ని వెనుకకు లాగుతూంటుంది. కొన్ని సీన్స్ మనపై బలమైన ప్రభావాన్ని చూపుతుండగా, మరికొందరు ఎక్కవ సినిమా టెక్ చేసినట్లుగా భావిస్తాం, వాస్తవికతకు దూరంగా తీసుకెళ్లినట్లు అనిపిస్తుంది. ఈ సీజన్ బాబా నిరాలా పాత్రను లోతుగా పరిశోధిస్తుంది, మాంటీ స్వయం ప్రకటిత దేవుడగా ఎలా రూపాంతరం చెందిందో వెల్లడిస్తుంది. ప్రతి ఎపిసోడ్ ఆకట్టుకునే పేస్ తో ముగుస్తుంది, ప్రేక్షకులు నెక్ట్స్ ఎపిసోడ్ ని చూడటానికి ఆసక్తిగా ఉండేలా చూసారు.
ఎవరెలా చేశారు
షో లో మెయిన్ ఎట్రాక్షన్ బాబీ డియోల్ అనడంలో సందేహం లేదు. అతను నిజమైన స్వామీజీ గా కనపడతాడు. అదే సమయంలో కపటత్వం కళ్లల్లో కనపడుతుంది.మరో ప్రక్క దొరికిపోతానేమో అనే భయం కూడా చూపించాడు. అదితి పోహంకర్ బాబా జీపై ప్రతీకారం తీర్చుకోవాలనే తన ఉద్దేశ్యం నుండి తప్పుకోకుండా చూసుకునే స్టార్‌గా మిగిలిపోయింది.
చందన్ రాయ్ సన్యాల్ మరోసారి గ్రిప్పింగ్ పెర్‌ఫార్మెన్స్‌ని అందించాడు, తన పాత్రను ఇంట్రస్టింగ్‌గా చేసాడు. అలాగే చివర్లో వేరే లేయర్‌ని జోడించాడు. త్రిధా చౌదరి, దర్శన్ కుమార్ నటన మెచ్చుకోకుండా ఉండలేం. వాళ్లు క్లైమాక్స్ వరకు కథాంశానికి కీలకంగా ఉండటంతో వారి పాత్రలు మరిన్నిచిన్న చిన్న డిటేల్స్ తో బాగా షైన్ అయ్యారు.
టెక్నికల్ గా
ఈ సీజన్ కు స్క్రీన్ ప్లేనే ప్రధానంగా దర్శకుడు కథను నడిపించారు. ఉత్కంఠ, కథలో ఇంటెన్సిటీ ప్రధానంగా సాగుతుంది. 5 ఎపిసోడ్స్ ఎక్కడా బోర్ అనిపించకుండా కొనసాగడానికి కారణం కథ,కథనం ఎంతో టెక్నికల్ టీమ్ కూడా అంతే కారణం. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడా తగ్గలేదు. సినిమా స్దాయిలో తీశారు. ఎక్కడ తగ్గేదేలే అన్నట్లు భారీతనం కొట్టచ్చినట్లు కనపడుతుంది. చందన్ కౌలి కెమెరా వర్క్, అద్వైత్ నేపథ్య సంగీతం హైలెట్ . దానికి నీట్ గా క్రిస్పీ గా చేసిన సంతోష్ మండల్ ఎడిటింగ్ కలిసొచ్చింది.
చూడచ్చా
రెండు సీజన్స్ చూసిన వారికి ఈ సీజన్ కొంచెం కూడా నిరాశ పరచదు. అక్కడక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలు మాత్రం ఫ్యామిలీలను దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది.
ఎక్కడ చూడచ్చు
MX Player లో, అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది