కూలీ vs వార్ 2: తెలుగు మార్కెట్ లెక్కలు – రేట్లు, బ్రేక్ ఈవెన్

డబ్బింగ్ సినిమాలు కూడా స్ట్రైట్ సినిమాలా "పాన్ ఇండియా బడ్జెట్"తో,హంగామాతో రిలీజ్ అవుతున్నాయి.;

Update: 2025-07-08 06:30 GMT

ఒకప్పుడు తెలుగులో డబ్బింగ్ సినిమాలకు ఒకప్పుడు ఎక్కువ పే చేసేవారు కాదు. దాంతో ఎంత వచ్చినా హ్యపీనే. ఒక చిన్న Tamil సినిమా తెలుగులో ₹1 కోటి చేసినా, అది సెన్సేషన్! కొన్ని డబ్బింగ్ సినిమాలు సూపర్ హిట్ అయ్యి నిర్మాతలకు కనక వర్షం కురిపించేవి కూడా. అయితే ఇప్పుడు బెట్టింగ్ మారింది. డబ్బింగ్ సినిమాలు కూడా స్ట్రైట్ సినిమాలా "పాన్ ఇండియా బడ్జెట్"తో,హంగామాతో రిలీజ్ అవుతున్నాయి.

హీరో బాలీవుడ్,కోలీవుడ్ అయినా, తేడా కొడితే నష్టాలు మాత్రం తెలుగు డిస్ట్రిబ్యూటర్ల ఎక్కౌంట్లోనే పడుతున్నాయి. ఈ మధ్యన డబ్బింగ్ సినిమాలు పెద్దగా ఆడటం లేదు. అయినా వార్ 2, కూలీ చిత్రాలను భారీ మొత్తాలకు తీసుకుని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. దాంతో ఇప్పుడు ట్రేడ్ దృష్టి వీటిపైనే ఉంది. ఎంతకు తీసుకున్నారు. ఎంత వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది అనేవి చర్చనీయాంశంగా మారాయి.

2025 ఆగస్టు 14 — తెలుగు సినిమా మార్కెట్‌కు ఇది పండుగ కాదు… ఇది పరీక్ష.

రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న కూలీ,

ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కలయికలో వస్తున్న War 2

రెండు చిత్రాలూ ఒకే రోజు విడుదల కానున్నాయి. వీటికి లక్ష్యం ఒకటే: తెలుగు మార్కెట్‌ను ఫుల్‌గా క్యాష్ చేయడం. కానీ ఇద్దరికీ మార్గాలు భిన్నం.రెండు చిత్రాల మార్కెట్ డైనమిక్స్ – “Telugu Buyers’ Perspective”

* కూలీ : మాస్ క్రేజ్ + మోడ్రన్ డైరెక్షన్ – కానీ భారీ రిస్క్

తెలుగు థియేట్రికల్ రైట్స్: ₹42 కోట్లు

బ్రేక్ ఈవెన్ గ్రాస్: ₹90 కోట్లు పైగా

రైట్స్ తీసుకున్నది : దిల్ రాజు, సునీల్ నారంగ్, సురేష్ బాబు

ఇది రెగ్యులర్ రజనీ సినిమా కాదు. లోకేష్ కనగరాజ్ బ్లాక్‌బస్టర్ ఫార్ములాను అర్థం చేసుకున్న దర్శకుడు. అందుకే డిస్ట్రిబ్యూటర్లు నమ్మారు. గతంలో రజనీ సినిమాలపై పెట్టిన పెట్టుబడులు రికవరీ కాలేదు అన్న విషయాన్ని చెప్తూనే ఈ రైట్స్ ని అంత రేట్లు పెట్టి తీసుకున్నారు.

ఇక్కడ వాళ్ల నమ్మింది ఒకటే ... “Star power opens the door. Script keeps it open.” – David Heyman (Producer, Harry Potter) అంటే రజనీ వంటి సూపర్ స్టార్ పవర్ జనాలని థియేటర్ దాకా లాక్కొస్తే, మంచి స్క్రిప్టు వచ్చిన ప్రేక్షకులను చివరిదాకా ఎంగేజ్ చేస్తుంది. కూలీ కథ ఎలా ఉందనేది ఇప్పటిదాకా లీక్ కాలేదు. కానీ రజనీ స్టైలిష్ మాస్ అవతారం, లోకేష్‌కి ఉన్న సరికొత్త ప్రెజెంటేషన్ స్కిల్ సినిమాపై భారీ నమ్మకం కలిగిస్తున్నాయి.

* War 2: సక్సెస్ ఫుల్ స్పై చిత్రాల బ్రాండ్ – తెలుగులో ఎన్‌టి‌ఆర్ క్రేజ్

తెలుగులో అసలు డిమాండ్: ₹100 కోట్లు (YRF)

ఫైనల్ డీల్: నాగ వంశీ ద్వారా, తగ్గిన రేటుకు (అంకెలు బయటకు రాలేదు)

ఇది ఓ డబ్బింగ్ చిత్రం. కానీ ఇందులో తెలుగు మాస్ ఐకాన్ ఎన్టీఆర్ ఉన్నాడు. War 2 స్పై యూనివర్స్‌లో భాగం. తెలుగులో ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ పెద్దది. కానీ ప్రశ్న ఏమిటంటే – తెలుగు ఆడియెన్స్ స్పై యూనివర్శ్ ఎమోషనల్ ఏ మేరకు కనెక్ట్ అవుతారనేది?. టీజర్ మీద వచ్చిన ట్రోలింగ్, హృతిక్ డామినేషన్, హిందీ నేటివ్ టోన్ వల్ల తెలుగు ప్రేక్షకుడు “సొంత సినిమా”లా ఫీల్ అవడంలో తడబడతాడు అని లేదు ఎన్టీఆర్ ఉండటం వల్ల సినిమా మనవాళ్లకు బాగా ఎక్కే అవకాశం ఉందని దేని లెక్కలు దానికే ఉన్నాయి.

“ఇప్పుడు ఫిల్మ్ బిజినెస్‌లో గెలుపు కేవలం హీరో ఇమేజ్ వల్ల కాదు… అది డేటా లెవెల్ డిస్ట్రిబ్యూషన్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఉంటుంది.”

డేటా ఆధారంగా ఎనాలసిస్:

ఫిల్మ్ తెలుగు రైట్స్ బ్రేక్ ఈవెన్ పెద్ద ప్లస్ కీలక రిస్క్

Coolie ₹42 Cr ₹90 Cr+ Director Branding Past Rajini Losses

War 2 ₹? ₹85–100 Cr NTR Craze Hindi Tone & Mixed Buzz

ట్రేడ్ ఏంగిల్స్:

మార్కెట్ ఓవర్‌స్టరేషన్: ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు వస్తే, రెండు కలెక్షన్లూ మినిమమ్ 30% పడిపోతాయన్నదే గ్లోబల్ స్టడీ.

రిపీట్ వ్యూ వాల్యూ: కూలీ కి మాస్ రిపీట్ వసూళ్లు వస్తే బెనిఫిట్. War 2 కి WOM బాగా వస్తే, రన్ స్టాబిలిటీ వస్తుంది.

ఫైనల్ గా :

Coolie ఓ మాస్ ఫెస్టివల్. కానీ అది ఒక స్కిల్‌ఫుల్ డైరెక్షన్ మీద ఆధారపడి నిలబడుతుంది.

War 2 ఓ ప్యాన్-ఇండియా బ్రాండ్. కానీ అది తెలుగు ప్రేక్షకుడి కనెక్టివిటీపై ఆధారపడుతుంది.

వరల్డ్ ఫిల్మ్ ట్రేడ్ ఎనాలసిస్ట్ లు చెప్పే మాట ఒకటుంది “You don’t bet on a film. You bet on its momentum.” అంటే ఓ సినిమా భాక్సాపీస్ సక్సెస్ ని నిర్ణయించేవి సినిమా స్టోరిలైన్, నటన కన్నా దాని చుట్టూ అల్లుకున్న పాపులారిటీ, బజ్, పాజిటివ్ మౌత్ టాక్, సోషల్ మీడియా యాక్టివిటీ, క్రిటికల్ రివ్యూలు. సినిమా ఓ మాస్టర్ పీస్ కానక్కర్లేదు కానీ ఓ స్ట్రాంగ్ బజ్ , మూమెంట్ ఎక్కువమందిని ఎట్రాక్ట్ చేసి, రెవిన్యూ అందిస్తుంది. ఇదే ఇప్పుడు ఈ రెండు సినిమాలకు అవసరం.

"తెలుగు ప్రేక్షకుడు ఒక సినిమా మీద తన డబ్బును ఖర్చు చేయడానికి ముందు, మూడుసార్లు ఆలోచిస్తాడు. కాని ఒకసారి ఎమోషన్ కనెక్ట్ అయితే, ఒకటికి నాలుగుసార్లు చూట్టానికి వెనుకాడడు."

* కామెంట్స్‌లో చెప్పండి.

Coolie,War 2 లలో దేనికి మంచి ఓపినింగ్స్ వస్తాయి. ఏది త్వరగా బ్రేక్ ఈవెన్ అవుతుంది? మీ అభిప్రాయం ఏమిటి?

Tags:    

Similar News