కొరియన్ రీమేకే కానీ... : 'టచ్ మీ నాట్' వెబ్ సీరిస్ రివ్యూ
ఈ సీరిస్ మన తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.;
ఇతర దేశంలో క్లిక్ అయిన వెబ్ సీరిస్ లు కూడా ఇప్పుడు రీమేక్ లుగా మన ముందుకు వస్తున్నాయి. అలా కొరియన్ లో సక్సెస్ అయిన సిరీస్ ‘హీ ఈజ్ సైకోమెట్రిక్’ ఆధారంగా టచ్ మీ నాట్.. అనే సీరిస్ ని రూపొందించారు. ఆ సీరిస్ కథ ఏంటి, రీమేక్ చేసేటంత గొప్ప కంటెంట్ ఏముంది, ఈ సీరిస్ మన తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
చిన్నతనంలో భవనంపై నుంచి పడిన రిషి (దీక్షిత్ శెట్టి), ఓ అరుదైన శక్తిని పొందుతాడు — సైకోమెట్రిక్. ఏ వస్తువైనా తాకితే, దాని గతం అతడి కళ్ల ముందు సినిమాల్లో ఆడుతుంది. ఈ ప్రత్యేకతను గమనించిన పోలీసులు, గోదావరి హాస్పిటల్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదాన్ని ఛేదించేందుకు అతని సహాయాన్ని కోరుతారు. ఈ ప్రమాదంలో అనేక ప్రాణాలు పోయాయి.
కేసును ఇన్విస్టిగేట్ చేస్తున్న ఎస్పీ రాఘవ్ (నవదీప్), ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దేవిక, విచారణలో ఊహించని నిజాలను వెలికి తీస్తారు. ఈ ఘటన, ఏళ్ల క్రితం మారుతి అపార్ట్‌మెంట్‌లో జరిగిన మాస్ మర్డర్‌తో అనుసంధానమై ఉందని వాళ్లు గుర్తిస్తారు. ఆ ఘటనలో గాయపడ్డవాడే రిషి.
ఇంతలో రిషి కాలేజీలో ప్రేమించిన మేఘ (కోమలీ ప్రసాద్), పోలీస్ కానిస్టేబుల్‌గా అతని జీవితంలో తిరిగి ప్రవేశిస్తుంది. కానీ… ఆమె తండ్రి కూడా ఈ కేసులో కీలకంగా ప్రస్తావించబడుతుంది. ఇది కేవలం యాక్సిడెంటేనా? లేక ప్లాన్ చేసిన క్రైమ్‌నా?
మరోవైపు, కేసుకు సంబంధించిన అనుమానితులు ఒక్కొక్కరుగా హత్యలకు గురవుతుండటంతో… మిస్టరీ మరింత డార్క్ గా మారుతుంది.
ఒక్కొక్కటిగా తెరలేరిగే ఈ కథలో రిషి శక్తి అతన్ని రక్షిస్తుందా? లేక కంట్రోల్ చేయలేని మానసిక భారం అవుతుందా? రాఘవ్‌ను వెంటాడుతున్న మాస్క్ మ్యాన్ ఎవరు? ఈ మిస్టరీకి ఫైనల్ కంక్లూజన్ ఏమిటో తెలుసుకోవాలంటే...సైకోమెట్రిక్ ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సిందే.
టెక్నికల్ గా
దర్శకుడు చాలా స్టైలిష్ & ఇంటెన్స్ టోన్‌తో కథను నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేశారు. మిస్టరీ ఎలిమెంట్స్ ను పక్కా ప్లేస్‌మెంట్‌తో చూపిస్తూ, ఎపిసోడ్ రిక్యాప్‌లు, క్లిఫ్‌హ్యాంగర్ ముగింపులు బాగా వర్కౌట్ చేసారు. కానీ కథలో కావాల్సిన హ్యుమన్ ఎమోషనల్ + సైకలాజికల్ థ్రిల్ మధ్య పొంతన కుదరలేదు. స్క్రీన్‌ప్లే ఫ్లో ఇంట్రెస్టింగ్‌గా లేదు.
మహతి స్వరసాగర్ అందించిన BGM ఈ సిరీస్‌కు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. మ్యూజిక్‌తోనే థ్రిల్ ఫీల్‌ను ఆడియెన్స్‌లో కలిగించాడు. ముఖ్యంగా సైకోమెట్రిక్ విజన్ దృశ్యాలకి చాలా atmospheric. టెన్షన్ సీన్స్‌లో సౌండ్ డిజైన్ ఉత్కంఠను పెంచుతుంది.మిగతా డిపార్టమెంట్స్ కూడా బాగా చేసాయి. నవదీప్, దీక్షిత్ శెట్టి తో పాటు మిగిలిన వారి యాక్టింగ్ కూడా బాగా చేసారు.
చూడచ్చా
ఓ వెరైటీ కాన్సెప్టు కోసం ఈ సీరిస్ చూడచ్చు. అలాగే తెలుసున్న ఆర్టిస్ట్ లు చేసారు కాబట్టి పెద్దగా ఇబ్బంది అనిపించదు. చూస్తున్నంతసేపు నడిచిపోతుంది.
ఎక్కడ చూడచ్చు
‘జియో హాట్‌స్టార్’లో తెలుగు లో ఈ సీరిస్ ఉంది