అంటే ఎన్టీఆర్ పై చంద్రబాబు కోపం లేనట్లేనా?

గత కొద్ది రోజులుగా సినిమా సర్కిల్స్ లో ఓ గమ్మత్తైన డిస్కషన్ జరుగుతోంది. అదేమిటంటే... ఆంధ్రప్రదేశ్ లో దేవర చిత్రానికి టిక్కెట్ హైక్ ఉంటుందా అని.

Update: 2024-09-15 03:00 GMT

గత కొద్ది రోజులుగా సినిమా సర్కిల్స్ లో ఓ గమ్మత్తైన డిస్కషన్ జరుగుతోంది. అదేమిటంటే... ఆంధ్రప్రదేశ్ లో దేవర చిత్రానికి టిక్కెట్ హైక్ ఉంటుందా అని. నిన్న మొన్న రిలీజైన విజయ్ గోట్ సినిమాకు కూడా టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు ఫర్మిషన్స్ ఇచ్చారు. అలాంటిది తెలుగులో వస్తున్న భారీ హైప్ ఉన్న సినిమాకు ఎందుకు టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు ఫర్మిషన్ ఎందుకు ఇవ్వరు అని. అయితే ఆంద్రప్రదేశ్ లో ఉన్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఎన్టీఆర్ కొంతకాలంగా ఆయనకు దూరంగా ఉంటూ తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నారు. ఎలక్షన్స్ లో కూడా ఎక్కడా సపోర్ట్ చేయలేదు. అలాంటప్పుడు చంద్రబాబు ఎందుకు దేవర చిత్రానికి ఫర్మిషన్ ఇస్తాడని కొందరు వాదన లేవ దీసారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కల్కి సినిమాకు టికెట్ రేట్లు పెంచారు. అశ్వనీదత్ తో చంద్రబాబుకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది కాబట్టి టిక్కెట్ రేట్లు పెంచారన్నారు. దాంతో దేవర కు చేస్తారా చేయరా అనే డౌట్ మొదలైంది. కొందరైతే దేవర రిలీజ్ కు ఆల్రెడీ టిక్కెట్ల పెంపుకు చెందిన జీవో లో కొన్ని రోజుల ముందు మార్పుచేర్పులు జరుగుతాయని, కొత్త జీవో వస్తుందని టాక్ మొదలెట్టేసారు. దేవర టికెట్ల రేట్లు పెంపుకోసం తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను ఆల్రెడీ నిర్మాతలు కోరారని, ఫర్మిషన్స్ కూడా వచ్చేసిందని తెలుస్తోంది. అంటే చంద్రబాబు ప్రభుత్వం టిక్కెట్ల రేటు పెంపుకు సముఖంగానే ఉన్నట్లు అర్దమవుతోంది.


అయితే దేవర కు టిక్కెట్ల రేట్లు పెంపుకు ఫర్మిషన్స్ ఇవ్వకపోతే ఓ రకమైన నెగిటివ్ ని జనాల్లోకి తీసుకెళ్తుందని చంద్రాబుకు తెలుసు. ఆయన ఏ వర్గాన్ని చేతులారా దూరం చేసుకోరు. ఇలాంటి విషయాలపై రాజకీయాలు చేయటానికి ఇష్టపడరు అని ఆయన గురించి తెలిసిన వారు అంటున్నారు. అందులో ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన సినిమాలు గత ప్రభుత్వంలో టిక్కెట్ల రేట్ల విషయంలో సమస్యలు ఎదుర్కొన్నాయనే సంగతి తెలిసిందే. దాంతో సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందనేది నిజం.

ఇక దేవర మూవీ పెరిగిన టికెట్ల రేట్లు ఇలా ఉన్నాయి..

నైజాం : Multiplexes - Rs 413/-

Single Scresns - Rs 250/-

ఆంద్రప్రదేశ్ : Multiplexes - Rs 325/-

Single Scresns - Rs 200/-

అలాగే దేవర 12AM స్పెషల్ షోల టికెట్ ధరను రూ. 1,000 వరకు, ఉదయం 4 గంటల షోలకు రూ. 500 వరకు పెంచాలని దేవర నిర్మాతలు నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణలు ప్రభుత్వాలను కోరినట్లు వార్తలు వస్తున్నాయి.

పాన్ ఇండియా స్దాయి లో తెరకెక్కిన దేవర చిత్రం కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఇంకాస్త ఎక్కువైయ్యాయి. ఎన్టీఆర్ అండ్ టీమ్ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉంది . మరీ ముఖ్యంగా నార్త్ బెల్ట్ పై గట్టి ఫోకస్ పెట్టారు. అక్కడ భారీ ఓపెనింగ్స్ రాబట్టడమే లక్ష్యంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఆదిపురుష్ సినిమా తర్వాత దేవర చిత్రంలో మరోసారి విలన్ పాత్రలో కనిపించనున్నాడు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళం భాషలలోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది.విడుదల తేదీ దగ్గర పడడంతో దేవర చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు తారక్.

Tags:    

Similar News