నానిలా మాట్లాడిన మాటే ప్రియదర్శి కొంపముంచుతోందా?

నోరు జారి ..సమస్యను తెచ్చుకున్నాడా?

Update: 2025-10-21 07:14 GMT

“చెయ్యి జారితే తీసుకోవచ్చు, కానీ నోరు జారితే తీసుకోలేము!” — ఈ సామెత ఇప్పుడు యాక్టర్ కమ్ కమెడియన్ ప్రియదర్శి కెరీర్‌కే సరిపోతుందేమో! కమెడియన్‌గా అందరినీ నవ్వించే ప్రియదర్శి, మరోసారి హీరోగా మారి “మిత్రమండలి” సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే సినిమా హిట్ అవటం, ప్లాఫ్ అవటం అనేది నటీనటుల చేతిలో ఉండదు. అది రొటీన్ గా జరిగిపోతూంటుంది. అదే సమయంలో ఆయన అతి నమ్మకంతో మాట్లాడిన మాటలే ఇప్పుడు ఇప్పుడు ఆయనకు తలనొప్పిగా మారుతున్నాయి! నెక్ట్స్ సినిమాల బిజినెస్ కు అడ్డంకులుగా మారబోతున్నాయి.

ప్రియదర్శి ఎప్పటినుంచో "న్యూ-జెనరేషన్ కామెడీ ఐకాన్". పెళ్లి చూపులు నుంచి మల్లేశం వరకు ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఒక ఇంటెలిజెంట్ యాక్టర్‌కి క్లాస్‌రూమ్ ఎగ్జాంపుల్. కానీ హీరోగా స్టాండ్ అవ్వడానికి అవసరమయ్యేది స్క్రిప్ట్ స్ట్రెంగ్త్ + పబ్లిక్ కాన్ఫిడెన్స్.

కామెడీ నటులు హీరోగా మారినప్పుడు వారి పైన ఉండే పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ రెండు రెండు రకాలుగా ఉంటాయి. “అతను మనలాంటి మనిషి” అనేది ప్రేమ, “అతను స్టార్ కాదు” అనేది డౌట్. ప్రియదర్శి వీటి మధ్య లైన్‌లో ఫైట్ చేస్తున్నాడు. కానీ ఈసారి ఆయన మాట, ఆ ఫైట్‌లో ఆయన్నే వెనక్కి లాగింది.

ప్రియదర్శి ఏమని అన్నాడో తెలుసా?

‘మిత్రమండలి’ ప్రమోషన్స్ టైంలో ప్రియదర్శి కాస్త “ఓవర్ కాన్ఫిడెంట్” గా ఇలా అన్నాడు “ఒకవేళ ఈ సినిమా (మిత్రమండలి) మీకు నచ్చకపోతే, మీ డబ్బు వృథా అయ్యిందనిపిస్తే… దయచేసి నా నెక్స్ట్ సినిమా చూడకండి.”. సినిమా మీద అంత నమ్మకం చూపించడం గొప్పే, కానీ ఆ మాట ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయనను ట్రోల్‌ల మధ్య నిలబెట్టేసింది.

సినిమా ప్రమోషన్‌లో ఒక యాక్టర్ ఈ స్థాయి కండిషనల్ స్టేట్‌మెంట్ ఇవ్వడం అనేది ఒక “సింబాలిక్ గ్యాంబుల్”. నాని లాంటి స్థిరమైన స్టార్ అది చెప్పగలడు — ఎందుకంటే ఆయనకు ఒక కానిస్టెంట్ ట్రాక్ రికార్డ్ ఉంది. ప్రియదర్శి వద్ద మాత్రం “బ్రాండ్ లాయిల్టి” కంటే ఎక్కువగా “ఆడియన్స్ క్యూరియాసిటీ” ఉంది.

అంటే జనాలు ఇంకా “అతడు హీరోగా వర్క్ అవుతాడా?” అని టెస్ట్ మోడ్‌లో ఉన్నారు. ఇలాంటి సిట్యువేషన్‌లో ఒక ఛాలెంజింగ్ లైన్ అనేది ఆడియన్స్ ఈగోను ప్రోక్ చేస్తుంది. ఆడియన్స్ అప్పుడు సినిమా చూడటానికి కాదు, పరిశీలించటానికి వస్తారు. అది సినిమా చూస్తున్నప్పుడు జరిగే సబ్టిల్ సైకాలజికల్ షిఫ్ట్.

ఈ డైలాగ్ వెనుక నాని షాడో ఉందా?

సినీప్రేమికులందరికీ ఇది డెజావూ అనిపించింది. ఎందుకంటే, ఇలాంటి మాటను ముందు నాని తన ‘కోర్ట్’ సినిమా టైంలో అన్నాడు. నాని స్టైల్ లో తన సూపర్ హిట్ సినిమా ‘కోర్ట్’ ప్రమోషన్స్ టైంలో, “ఈ సినిమా మీకు నచ్చకపోతే, దీని తర్వాత వచ్చే నా సినిమా చూడొద్దు” అని అన్నారు. నాని ఆ మాట చెప్పడానికి ఆయనకు ఆ సినిమా కంటెంట్ మీద అంత నమ్మకం ఉంది. ఆయన నమ్మినట్టే, ‘కోర్ట్’ బ్లాక్‌బస్టర్ అయ్యింది. దాని తర్వాత సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది, ఎలాంటి సమస్య రాలేదు.

ఆయన చెప్పినప్పుడు ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది — అందుకే ఆ మాట పాజిటివ్‌గా మారింది. కానీ ప్రియదర్శి మాట మాత్రం బూమరాంగ్ అయింది!

“మిత్రమండలి” ఫలితం దారుణం

ఈ సినిమా మొదలయ్యే ముందు “ఇందులో కథ అంటూ ఏమీ లేదు” అని ఒక disclaimer వేశారు. అదే క్షణంలో సినిమాటిక్ స్పెల్ బ్రేక్ అయింది. ఆడియన్స్ సినిమా లోపలకి వెళ్లే ముందు, సినిమా దానినే invalidate చేసుకుంది. దీని వల్ల ఆడియన్స్ ఎంపతీ నశిస్తుంది.

కథే లేదంటే, మీ నమ్మకం మీద ఎందుకు మేము డబ్బు పెట్టాలి? అనే ప్రశ్న సైకలాజికల్‌గా జనాల్లో నాటుకుపోతుంది.

ఈ కాంట్రడిక్షన్ — “కథే లేదు” అని చెప్పిన సినిమా, “మీకు నచ్చకపోతే చూడొద్దు” అని చెప్పిన హీరో — ఇది ఒక “కమ్యూనికేషన్ ప్యారడాక్స్”

సినిమా సబ్జెక్ట్ కంటే ఈ contradiction పెద్దది అయింది.

ఫలితం? — రివ్యూస్ తో పాటు, సోషల్ మీడియా సైతం సినిమా పూర్తిగా ఫ్లాప్ అని తేల్చేసింది.

ఇప్పుడు అసలైన టెన్షన్ నెక్ట్స్ రిలీజ్ అయ్యే సినిమాకు!

ప్రియదర్శి తర్వాతి సినిమా మీద ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా పడబోతోంది. ఓ ప్రక్కన సినిమా డిజాస్టర్ ఎఫెక్ట్ బిజినెస్ పరంగా పడుతుంది అంటే మరో ప్రక్క ఇలాంటి స్టేట్మెంట్స్ తో బిజినెస్ మరింత దిగజారే అవకాసం ఉంది . ‘మిత్రమండలి’ నచ్చని ఆడియన్స్ ఆయన మాటను సీరియస్‌గా తీసుకుని, “సరే బాస్, మీరు అన్నట్టు మీ తర్వాతి సినిమా చూడం…

Tags:    

Similar News