వసూళ్లలో ‘డంకీ’ వెనకంజ, ‘జీరో’ కంటే ముందంజ

చాలా సంవత్సరాల తరువాత ఫామ్ లోకి వచ్చిన షారుక్, వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. వసూళ్లలో కొద్దిగా....

Producer :  Chepyala Praveen
Update: 2023-12-22 07:03 GMT
డంకీ చిత్రంలో ఓ సన్నివేశం

రాజ్ కుమార్ హిరానీ గత చిత్రాల లాగే సామాజిక సమస్యలను ఇతి వృత్తంగా తీసుకుని ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. అయితే కలెక్షన్ల పరంగా మిగిలిన సినిమాల కంటే కాస్త వెనకబడినట్లు ట్రేడ్ పండితులంటున్నారు.

కింగ్ ఖాన్ ఈ సంవత్సరం విడుదల చేసిన పఠాన్, జవాన్ స్థాయిని మాత్రం డంకీ అందుకోలేదని చెప్పవచ్చు. వసూళ్లలో షారుక్ గత చిత్రం ‘జీరో’ కంటే కాస్త ముందుందని బాక్సాపీస్ లెక్కలు తెలియజేస్తున్నాయి. పరిశ్రమ ట్రాకర్ sacnilk ప్రకారం గురువారం విడుదలయిన అన్ని ప్రాంతాల నుంచి రూ. 30 కోట్ల వసూళ్లను రాబట్టింది.

అలాగే 25.71 శాతం ఆక్యూపెన్సీని సాధించింది. 2018లో షారుక్ ఖాన్ ఇదే రోజు తన మూవీ ‘జీరో’ ను విడుదల చేశారు. అయితే అది అనుకున్నంత మేర వసూల్లను రాబట్టడంలో విఫలం అయింది. ఇప్పుడు అదే బాటలో డంకీ కూడా వెళ్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

అలాగే రాజ్ కుమార్ గత చిత్రం సంజూ(2018) కంటే కూడా డంకీ కాస్త తక్కువ వసూళ్లను రాబట్టింది. రణబీర్ కపూర్ నటించిన సంజూ మూవీ తొలిరోజు రూ. 34 కోట్లను రాబట్టింది.

ఓపెనింగ్ డే లెక్కల ప్రకారం డంకీ షారుక్ గత చిత్రాల పఠాన్, జవాన్, రణబీర్ కపూర్ అనిమల్, సన్నిడియోల్ గదర్2, కంటే తక్కువ వసూల్లను పొందింది. ఈ సంవత్సరం విడుదలైన అత్యధికంగా ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన ఏడో చిత్రంగా నిలిచింది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ మొదటి రోజు రూ. 57 కోట్లు, జవాన్ మొదటి రోజు రూ. 74.50 కోట్లు, సన్ని డియోల్ గదర్2 రూ. 40..1 కోట్లు, తాజాగా రణబీర్ కపూర్ సినిమా అనిమల్ రూ. 63 కోట్లను కొల్లగొట్టింది.

సలార్ ఎఫెక్ట్

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘సలార్’ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్, మళయాళ స్టార్ పృథ్వీరాజ్ కలిసి నటించారు. ఇంతకుముందు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్2 బాలీవుడ్ బాక్సీపీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు సలార్ కాంబో వస్తుండటం, ప్రచార చిత్రాలు ఇప్పటికే రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధించడంతో థియోటర్లలో మాస్ జాతర సాగుతుందని అంచనాలున్నాయి. ఇప్పటికే ముంబై లోని ఓ ధియోటర్ ముందు సలార్ సినిమా టికెట్ల కోసం వేలాది మంది తరలిరావడంతో ఆ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్ లా మారింది. కాబట్టి ఇలాంటి మాస్ యాక్షన్ సినిమా ముందు కామెడీ జోనర్ లో వచ్చినడంకీ నిలబడుతుందా అనేది పెద్ద ప్రశ్న. పోటీ తట్టుకుని నిలబడ్డా కలెక్షన్ల పరంగా షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది డంకీ కి కాస్త ఇబ్బందే అని ట్రేడ్ విశ్లేషణ.

Tags:    

Similar News