గౌతమ్ మీనన్ 'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' రివ్యూ
దర్శకుడుగా గౌతమ్ మీనన్ కు తెలుగు,తమిళంలో మంచి పేరు ఉంది. ఒక టైమ్ లో ఆయనతో సినిమాలు చేయడానికి హీరోలు క్యూలు కట్టారు.;
దర్శకుడుగా గౌతమ్ మీనన్ కు తెలుగు,తమిళంలో మంచి పేరు ఉంది. ఒక టైమ్ లో ఆయనతో సినిమాలు చేయడానికి హీరోలు క్యూలు కట్టారు. తెలుగులోనూ ఆయన నాగచైతన్యతో ఏం మాయ చేసావే, వెంకటేష్ తో ఘర్షణ వంటి సూపర్ హిట్స్ ఇచ్చారు. అయితే ఊహించని విధంగా ఆయన కెరీర్ లో వెనకపడ్డారు. సరైన సక్సెస్ అందుకుని పదేళ్లు పైగానే అవుతుంది. నాగచైతన్య హీరోగా 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ఫ్లాఫ్ తర్వాత ఆయన ఫామ్ లో లేకుండా పోయారు.
ఆ తర్వాత తమిళంలో ధనుష్, శింబు హీరోలుగా చేసిన సినిమాలు ఆడలేదు. విక్రమ్ హీరోగా చేసిన 'ధ్రువ నక్షత్రం' షూట్ పూర్తై చాలా కాలం అయినా ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆయన మళయాళం లోకి ఎంట్రీ ఇస్తూ మమ్ముట్టితో సినిమా చేసి హిట్ ట్రాక్ ఎక్కాలని ప్రయత్నించారు. ఆ సినిమానే 'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' (Dominic and the Ladies Purse) .
ఈ'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23న ప్రేక్షకుల వచ్చింది. ఈ సినిమాలో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించగా... గోకుల్ సురేష్, లీనా, సిద్ధికి, విజయ్ బాబు, విజి వెంకటేష్ ఇతర సహాయ పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు నీరజ రాజన్, సూరజ్ రాజన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ స్క్రీన్ ప్లే రాశారు. మమ్ముట్టి కంపెనీ పతాకం మీద మమ్ముట్టి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ డిస్ట్రిబ్యూట్ చేశారు. అంత క్రేజీ ప్రాజెక్ట్ గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉంది..అసలు ఈ చిత్రం కథేంటి వంటి విషయాలు చూద్దాం.
స్టోరీ లైన్ ఏంటంటే
ఒక ఫేక్ సర్టిఫికెట్ కారణంగా పోలీస్ ఉద్యోగం కోల్పోయిన సి.ఐ.డామినిక్ (మమ్ముట్టి), ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ ఓపెన్ చేస్తారు. ఏవో చిన్న చిన్న కేసులు డీల్ చేస్తూ కాలక్షేపం చేస్తూంటాడు. మధ్య మధ్యలో అసిస్టెంట్ విఘ్నేష్ (గోకుల్ సురేష్) తో కలిసి కొన్ని బ్లాక్ మెయిలింగ్ కేసులు డీల్ చేస్తూంటాడు. ఈ టైమ్ లో తన ఇంటి ఓనర్ మాధురి (విజ్జీ వెంకటేష్) అడిగిందని.. హాస్పిటల్ లో దొరికిన ఒక లేడీస్ పర్స్ ని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలెడతాడు.
అయితే ఆ పర్స్ ఓనర్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అని తెలియడంతో రిలాక్స్ అయిపోయి కేసు క్లోజ్ చేసేద్దామని అనుకుంటాడు డామినిక్. అయితే.. ఊహించని విధంగా మరో విషయం తెలుస్తుంది. అదేమిటంటే ఆమె 4 రోజులుగా కనిపించడం లేదు. దాంతో ఆమె ఎలా మాయమైంది అనే విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టిన డామినిక్ కి.. ఈ ఇన్వెస్టిగేషన్లో ఊహకు అందని నిజాలు బయటపడతాయి? అవేమిటి, చివరకు ఏమైంది? వంటి ప్రశ్నలకు సమాధానమే “డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్” కథాంశం.
ఎలా ఉందంటే..
డైరెక్టర్ గా గౌతమ్ మీనన్ సక్సెస్. కానీ ఆయన సినిమాల్లో రెగ్యులర్ గా ఉండే స్లో నేరేషన్ ఈ సినిమాలో మరికాస్త ఎక్కువై విసిగించనేది మెయిన్ కంప్లైంట్. అలాగే ఈ సినిమా కథ వేరే రచయిత అందించడంతో కథనంలో గౌతమ్ మార్క్ మిస్ అయ్యిందని అభిమానులు అంటున్నారు. అయితే క్లైమాక్స్ మాత్రం అదరకొట్టాడు. ఫైట్ సీన్ ని డాన్స్ తో కంపేర్ చేస్తూ తెరకెక్కించిన విధానంలో మాత్రం గౌతమ్ మార్క్ స్పష్టంగా కనిపించింది. అయితే.. మమ్ముట్టి క్యారెక్టరైజేషన్ మాత్రం కాస్త గమ్మత్తుగా పాతకాలం డిటెక్టివ్ సినిమాల్లో మాదరి ఫన్ తో సాగుతుంది. ఎడిటింగ్, కలరింగ్, డి.ఐ వంటి టెక్నికల్ అంశాలకు పేరు పెట్టలేం. సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది.
చూడచ్చా
గౌతమ్ మీనన్ అభిమానులుకు నచ్చే చిత్రం ఇది. మమ్ముట్టి అభిమానులు కాస్త ఓపిక చేసుకుని చూడాలి.
ఓటీటీలో వచ్చేదాకా వెయిట్ చేయాలి
తెలుగులో చూడాలంటే మాత్రం త్వరలోనే ఓటీటీలోకి వస్తుంది. అప్పటిదాకా మనవాళ్లు వెయిట్ చెయ్యాలి