మద్రాస్ హైకోర్టులో హీరో విశాల్ కు ఎదురుదెబ్బ

లైకా నుంచి తీసుకున్న 20 కోట్లు వడ్డీతో సహ కట్టాల్సిందే అని ఆదేశాలు;

Update: 2025-06-05 13:19 GMT
నటుడు విశాల్

లైకా ప్రొడక్షన్ తో జరుగుతున్న వివాదంలో హీరో విశాల్ కు ఎదురుదెబ్బ తగిలింది. రుణ చెల్లింపుకు సంబంధించిన ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు లైకా ప్రొడక్షన్స్ కు 30 శాతం వడ్డీతో చెల్లించాల్సిందే అని విశాల్ కు, ఆయన నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీకి మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

లైకా ఆరోపణలు..
విశాల్ నిర్మాణ సంస్థ ఫైనాన్షియర్ జీఎన్ అన్భు చెజియాన్ గోపురం ఫిల్మ్స్ నుంచి తీసుకున్న 21.29 కోట్ల రుణంపై వివాదం ప్రారంభమైంది. ఆ రుణాన్ని లైకా ప్రొడక్షన్స్ ఆధీనంలోకి తరువాత వెళ్లింది.
ఒప్పందం ప్రకారం అప్పు పూర్తిగా చెల్లించే వరకూ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మించే అన్ని చిత్రాల హక్కులు లైకా కే ఉంటాయి. అయితే కంపెనీ అనుమతి లేకుండా సినిమాలు విడుదల చేయడం ద్వారా విశాల్ ఒప్పందాన్ని ఉల్లంఘించాడని లైకా ఆరోపించింది. తన రుణం కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.
పాత ఆర్డర్ ప్రకారం..
గతంలో హైకోర్టు విశాల్ ను మధ్యంతర చర్యగా రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఉత్తర్వును సమర్థించింది. సింగిల్ జడ్జి తుది తీర్పు వచ్చే వరకూ విశాల్ ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయడంలో విఫలం అయితే థియేటర్లు లేదా ఓటీటీ ప్లాట్ ఫాంలలో ఏదైనా సినిమాల విడుదల చేయడాన్ని నిషేధించింది.
ఈ కేసును జస్టిస్ పీటీ ఆశా విచారించారు. కోర్టు ఆదేశాలను పాటించడంలో విఫలం అయినందుకు ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయాలన్న తన ఆస్తుల వివరాలను సమర్పించాలన్న విశాల్ కు వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి.
విచారణ సందర్బంగా విశాల్ కోర్టుకు హజరయ్యారు. నిబంధనలు పాటించకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం విశాల్ అసలు, వడ్డీ, కోర్టు ఖర్చులు కూడా చెల్లించాలి.
విశాల్ తన ఆస్తుల వివరాలను సమర్పించాడు. అందులో మూడుకార్లు, ఒక మోటార్ సైకిల్, రెండు బ్యాంకు ఖాతాల పత్రాలు, గృహ రుణం వివరాలు ఉన్నాయి.
ఈ వివాదం పై బుధవారం జస్టిస్ ఆశా, విశాల్ కు లైకా ప్రొడక్షన్స్ కు 30 శాతం వడ్డీతో పాటు రూ. 21.29 కోట్ల అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించారు. అదనంగా కోర్టు ఖర్చులు సైతం భరించాలని విశాల్ ను ఆదేశించారు.
Tags:    

Similar News