హైదరాబాద్ పోలీసులకు 'ఐబొమ్మ' బహిరంగ వార్నింగ్ !?

వెనకున్న మాఫియా ఎవరూ?

Update: 2025-10-01 11:02 GMT

హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్ పోలీసులు సినిమా, ఓటీటీ పైరసీపై దర్యాప్తును ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా థియేటర్‌ల్లో రికార్డింగ్ చేసే వారిని, సర్వర్లు హ్యాక్ చేస్తున్న కీలక నిందితులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ibomma వెబ్‌సైట్‌పై దృష్టి పెట్టగానే… నిర్వాహకులు పోలీసులకు బహిరంగ సవాల్ విసరడం సంచలనం రేపుతోంది!

పోలీసులు ఆ సవాల్‌ను ఛాలెంజ్‌గా తీసుకుని ఆ వెబ్‌సైట్ కోసం పనిచేస్తున్న నలుగురు మందిని అదుపులోకి తీసుకున్నారు. మరింత షాకింగ్‌గా, బీహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో కూడా ఐబొమ్మకు ఏజెంట్లు ఉన్నట్లు బయటపడింది.

ఇక ఓటీటీ కంటెంట్ తస్కరణతో నిర్మాతలకు తలనొప్పి పెరుగుతుండటంతో, విచారణ వేగవంతమైంది. ఇదే సమయంలో, ibomma పేరిట తెలుగులో వెలువడిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో “సినిమాలకు అనవసరంగా భారీ బడ్జెట్ పెడుతున్నారు, చివరికి భారాన్ని ప్రేక్షకులపై, ముఖ్యంగా మధ్యతరగతివారిపై మోపుతున్నారు” అంటూ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అయింది.

ఐబొమ్మ నిర్వాహకులను త్వరలోనే పట్టుకుంటాము. వారిని అరెస్ట్ చేసి చూపిస్తామని పైరసీ సినిమాలను అప్లోడ్ చేసే వెబ్ సైట్ ఐబొమ్మకు మాజీ సీపీ సీవీ ఆనంద్ రెండు రోజుల క్రితం హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలకు ఐబొమ్మ నిర్వాహకులు అంతే స్థాయిలో బదులిస్తూ కొన్ని అంశాలను ప్రస్తావించారు.

‘ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం’. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్స్ అమ్మిన తరువాత మీరు ఎం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ OTT రెవిన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు.

మా వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తే మీ ఫోన్ నంబర్లు బయటపెడతాం. మా టెలిగ్రామ్‌ గ్రూపులు, సబ్‌స్క్రిప్షన్లు బహిర్గతం చేస్తాం. రూ. 5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మా దగ్గర ఉంది. మీడియా, OTT, హీరోలకూ షాకింగ్‌ రివీల్ అవుతుంది. ప్రతి యూజర్ ఫోన్ నంబర్‌ మా డేటాబేస్‌లో ఉంది. ఇండియా మొత్తంలో మా సపోర్ట్ ఉంది. మా వెబ్‌సైట్ బ్లాక్ చేస్తే – మీరే ఎక్స్‌పోజ్ అవుతారు. ఫ్యాన్స్‌కి సీక్రెట్‌గా ఉన్న హీరోల పేర్లు బయట పెడతాం. మమ్మల్ని టార్గెట్ చేస్తే ఇండస్ట్రీకి పెద్ద షాక్ వస్తుంది. రూ. 5 కోట్ల యూజర్లను ఒకేసారి రివీల్ చేయగలమని హెచ్చరిక!

1) హీరోలకు అంత రెమ్యూనిరేషన్ అవసరమా? అది మీ కొడుకు అయినా ఎవరు అయినా

2) సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది వున్నారు, వాళ్ళు ఎం అయిపోతారు అని కబుర్లు చెప్పకండి. వాళ్ళకి మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసిన వస్తాయి కానీ మీ హీరోకి హీరోయిన్ కి వస్తాయా.

3) సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యూరురేషన్స్ మరియు విదేశాలలో షూటింగ్ లకు మరియు ట్రిప్స్ కి ఖర్చుపెడుతున్నారు, ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చుపెడుతున్నారు ? ఇండియా లో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది. కదా? అక్కడ వాళ్ళకి ఉపాధి కలుగుతుంది కదా.

4) అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికావెర్టీ కి దానిని మా మీద రుద్ది ఎక్కువకి అమ్ముతున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ ని కలెక్ట్ చేసుకోవటానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరికి మధ్యతరగతివాడే బాధపడుతున్నాడు.

‘మా వెబ్సైటు మీద ఫోకస్ చేయటం ఆపండి లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. మీ యాక్షన్ కి నా రియాక్షన్ ఉంటుంది’. ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్లు మీద మీ ద్రుష్టి పెట్టండి. ఈ మిడిల్ లో – వేరే ఏ హీరో కూడా (example: Vijay) టార్గెట్ అవ్వటం ఇష్టం లేదు, మేము స్వతహాగా వెబ్సైటు నుంచి తొలిగిస్తున్నాం, ఇప్పుడు ఇమ్మీడియేట్ డిలీట్ చేస్తే మీకు బయపడి లేదా మీరు తీయించినట్టు వుంటది అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తరువాత తీసివేయాలని అనుకుంటున్నాం.

ఐ బొమ్మ వాళ్ళు ఇండియా లో తీసివేసిన తరువాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరము, దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయటం లేదు. మేము ibomma.net వళ్ళంత అంత మంచివాళ్లం కాదు. బురదలో రాయి వేయకండి అది కూడా పెంట మీద అసలు వేయకండి.

మేము ఏ దేశం లో వున్నా భారత దేశం, అందులో తెలుగు వానికోసం ఆలోచిస్తాము. (చావుకు భయపడని వాడు దేనికి భయపడడు – There’s nothing more dangerous than a man who has nothing to loose.) అని పోలీసులకు కౌంటర్ గాహెచ్చరిక చేసారు.

అంతేకాక, థియేటర్లలో కెమెరాలతో సినిమాలు రికార్డు చేసి విడుదల చేసే వెబ్‌సైట్స్‌పై దృష్టి పెట్టాలని పోలీసులకు సూచించడం గమనార్హం. “మేమెక్కడ ఉన్నా, మనసు మాత్రం భారతదేశంలోనే… తెలుగు ప్రేక్షకులకోసమే ఆలోచిస్తాం” అని చెప్పడం మరింత చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News