దుబాయ్ వేదికగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్..

ఛాంపియన్ ట్రోఫి షెడ్యూల్ విడుదల చేసిన పాకిస్తాన్, ఫైనల్ కు రెండు వేదికలు

Update: 2024-12-23 05:28 GMT

పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫికి షెడ్యూల్, వేదికలు ఖరారయ్యాయి. చిరకాల ప్రత్యర్థులు భారత్ - పాకిస్తాన్ లు ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా తలపడబోతున్నాయి. టీమిండియా పాకిస్తాన్ వెళ్లడానికి నిరాకరించిన నేపథ్యంలో మనం ఆడే మ్యాచుల కోసం తటస్థ వేదికగా దుబాయ్ ను ఎంచుకున్నారు.

అలాగే భారత్ సెమీ ఫైనల్, ఫైనల్ క్వాలిఫై అయితే ఆ మ్యాచులు కూడా దుబాయ్ వేదికగా జరగబోతున్నాయి. టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరుగుతుంది. ప్రారంభ మ్యాచులో ఆతిథ్య పాకిస్తాన్ తో న్యూజిలాండ్ తో కరాచీ వేదికగా తలపడబోతున్నాయి.

శనివారం రాత్రి పిసిబి ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ యుఎఇ క్రికెట్ చైర్మన్ షేక్ నహ్యాన్ అల్ ముబారక్ మధ్య జరిగిన సమావేశం తరువాత దుబాయ్‌ను తటస్థ వేదికగా ఎంచుకున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ధృవీకరించింది. ప్రస్తుతం సింధ్‌లోని ఘోట్కీ ప్రాంతంలో విహారయాత్రలో ఉన్న షేక్ నహ్యాన్, ఆ దేశ అంతర్గత మంత్రి అయిన నఖ్వీ, పాకిస్తాన్ నిర్వహించే మెగా-ఈవెంట్ కోసం లాజిస్టికల్ అడ్మినిస్ట్రేటివ్ విషయాలను తెలుసుకున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యంపై గురువారం ప్రతిష్టంభన ముగిసింది, ఆతిథ్య దేశం పాకిస్థాన్‌కు బదులుగా భారత్ తమ 50-ఓవర్ల మ్యాచ్‌లను తటస్థ వేదికలో ఆడుతుందని ICC ప్రకటించడంతో, టోర్నమెంట్‌లకు ఇదే విధమైన ఏర్పాటు పూర్తయ్యయి.
దీనికి బదులుగా పాకిస్తాన్ కు ఆదాయంలో పెంచడంతో పాటు భారత్ లో జరిగే ఐసీసీ ఈ వెంట్లను ఇదే విధంగా తటస్థ వేదికలలో నిర్వహించాలని షరతు విధించారు. 9 నుంచి 10 మ్యాచ్‌లకు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో ఐసిసి ఇప్పుడు ఈవెంట్ చివరి షెడ్యూల్‌ను ప్రకటించాలని భావిస్తున్నారు.
ఒకవేళ భారత్ ఫైనల్‌కు అర్హత సాధించకపోతే ఫైనల్ లాహోర్‌లో ఉంటుంది. ఈ హైబ్రిడ్ ఏర్పాటు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (పాకిస్తాన్), వచ్చే ఏడాది భారతదేశంలో జరిగే మహిళల క్రికెట్ ప్రపంచ కప్ తో పాటు 2026లో భారత్ - శ్రీలంక సంయుక్తంగా నిర్వహించబోయే టీ20 వరల్డ్ కప్ కూడా ఇలాగే హైబ్రిడ్ వేదికగా నిర్వహించనున్నారు.
భద్రతా కారణాల దృష్ట్యా ఫిబ్రవరి-మార్చిలో జరగాల్సిన ఈవెంట్ కోసం పాకిస్థాన్ వెళ్లేందుకు భారత్ నిరాకరించింది. 2008 ముంబై ఉగ్రదాడిలో 150 మంది మరణించిన తర్వాత భారతీయులు పాకిస్థాన్‌లో ఆడలేదు. రెండు దేశాల చివరి ద్వైపాక్షిక సిరీస్ 2012లో జరిగింది.
పాకిస్తాన్ వెళ్లడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో బీసీసీఐ కూడా తన వైఖరిని స్పష్టం చేసింది. అయితే గత ఏడాది భారత్ వేదికగా నిర్వహించిన వన్డే ప్రపంచకప్ కు పాకిస్తాన్ వచ్చినందున, భారత్ కూడా తమ దేశం రావాలని పట్టుబట్టింది. టీమిండియా రాకపోతే తమ సొంత ప్రజల ముందు పీసీబీ పరువుపోతుందని ఆ దేశం కూడా భావించడంతో వివాదం చెలరేగింది. కానీ చివరికి దిగిరాకతప్పలేదు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూపులు
గ్రూప్ A: పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇండియా, న్యూజిలాండ్
గ్రూప్ బి: ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా


Tags:    

Similar News