మహేష్, రాజమౌళి చిత్రం కథ- కొత్త సంగతులు

మామూలుగానే మహేష్ కొత్త సినిమా అంటే రచ్చ ఓ రేంజిలో ఉంటుంది. అదీ రాజమౌళి కాంబిషన్ అంటే చెప్పేదేముంది. రచ్చ పీక్స్.

Update: 2024-09-14 03:00 GMT

మామూలుగానే మహేష్ కొత్త సినిమా అంటే రచ్చ ఓ రేంజిలో ఉంటుంది. అదీ రాజమౌళి కాంబిషన్ అంటే చెప్పేదేముంది. రచ్చ పీక్స్. ఆర్ఆర్ఆర్ (RRR) లాంటి గ్లోబల్ హిట్ తరువాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం, అది కూడా సూపర్ స్థార్ మహేష్ బాబుతో అవడంతో ఈ సినిమాపై ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. దాంతో ఈ సినిమా ఎలా ఉండబోతోంది. అసలు కథ ఎలా సాగనుంది, ప్రస్తుతం సినిమా ఏ స్టేజిలో ఉంది, ఎప్పుడు మొదలు కావచ్చు వంటి విషయాలు సోషల్ మీడియాలో డిస్కషన్ గా మారాయి.

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఈ సినిమా గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ . ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఈ సినిమా షూటింగ్ నిర్వహించనున్నారు. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను జర్మనీలో స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే, అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేసారని తెలుస్తోంది. ఇక మహేశ్ బాబు తన లుక్ ను తనదైన మేకోవర్ లో కనిపించేలా రెడీ అవుతున్నాడు. ఇంతకు ముందు ఎప్పుడూ కనపడని రీతిలో ఇందులో మహేష్ బాబు కనిపిస్తారు.

అలాగే ఈ సినిమా పీరియడ్ డ్రామా అని, 18 శతాబ్దంలో జరిగే కథ అని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో కథ ఎక్కువ భాగం అడవుల్లో జరుగుతుందని, ఫారెస్ట్ ఎడ్వెంచర్ అని చెప్తున్నారు. ఈ సినిమాలో అరుదైన గిరిజన జాతికి సంభందించిన రిఫరెన్స్ లు ఉండబోతున్నాయని, ఆ మేరకు టీమ్ స్కెచ్ వేయిస్తోందని త్వరలోనే ఫైనలైజ్ చేసి కాస్ట్టూమ్స్ డిజైన్ చేయించబోతున్నారు. ఇందుకోసం వందలాజి జూనియర్స్ కి ట్రైనింగ్ ఇచ్చి షూట్ ప్రారంభానికి ముందే వారి లుక్స్ ఏమిటనేది లాక్ చేయబోతున్నారు.

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ ఆయన ఓ ఇంటర్వ్యూలో SSMB29 ప్రాజెక్ట్‌పై పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. మహేశ్‌- రాజమౌళి సినిమా 'ఇండియానా జోన్స్‌'లా ఉంటుందని క్లారటీ ఇచ్చేశారు. కానీ ఈ ప్రాజెక్ట్‌కు ఇంకా టైటిల్‌ ఫైనల్‌ చేయలేదని చెప్పారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ ఎక్కువగా అడవి నేపథ్యంలోనే సాగుతుందని పేర్కొన్నారు. ఈ సినిమాతో మహేశ్‌ బాబు ఇమేజ్‌ భారీగా పెరుగుతుందని పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ ఒక్క సినిమాతోనే గుర్తింపురావాలని తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఆ కథేమిటో చెప్పకుండా, ‘రాజమౌళి నేనూ విల్బర్ స్మిత్‌కి పెద్ద ఫ్యాన్స్. ఆఫ్రికా అడవుల్లో బిగ్ కాన్వాస్ మీద అడ్వెంచరస్ కథగా వుంటుంది’ అని మాత్రం చెప్పారు.విల్బర్ స్మిత్ రాసిన హిస్టారికల్ ఫిక్షన్ బేస్ కింగ్ ఆఫ్ కింగ్స్ నవల బేస్ చేసుకుని ఈ కథ ఉంటుందంటున్నారు. కథా వస్తువు ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో వివక్ష, దాన్ని ఎదుర్కొనే సాహస గాథగా వుంటుంది. ఈ నవల రైట్స్ తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలో రాజమౌళి, ఆయన టీమ్ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ లొకేషన్స్ హంట్ చేస్తున్నారు. అరుదైన చాలా లొకేషన్స్ ని ఫైనలైజ్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమా కోసం రాజమౌళి నటీనటులు,టెక్నీషియన్స్ ఇప్పటికే పూర్తి చేసారని వినికిడి. సినిమా ప్రారంభానికి ముందే రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి మరీ టెక్నీషియన్స్, నటీనటుల వివరాలు ప్రపంచానికి తెలియచేస్తారని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకు సంబంధించి పెద్ద ఎత్తున సెట్స్ వేస్తున్నారు. అక్కడే వర్క్ షాపులు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తికాగా, నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ రాజమౌళి రకరకాల ఇంట్రెస్టింగ్ టైటిల్ ను పరిశీలిస్తునట్లు తెలుస్తోంది. ప్రస్తుతం SSRMB 29 వర్కింగ్ టైటిల్ తో వస్తోన్న ఈ మూవీకి ‘GOLD’ అనే టైటిల్ ను రాజమౌళి టీమ్ పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. అంతేకాకుండా ఎప్పటి నుంచో 'మహారాజ్' అనే టైటిల్ కూడా వినిపిస్తోంది.అయితే ఇవన్నీ అఫీషియల్ సమాచారాలు కావు. ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నవే. ఏది నిజమో..ఏది కాదో తెలియాలంటే కొద్ది కాలం వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News