వరుణ్ తేజ్ ఇప్పుడీ సినిమా చేసి ఏంటి ఉపయోగం ? ఓటిటిలో వచ్చేసిందే

ఓటిటిల చేతుల్లోకి సినిమా ఇండస్ట్రీ వెళ్లిపోతోందనేది అందరూ అంటున్న మాటే. దగ్గరగా చూస్తే అదే నిజం కూడా.

Update: 2024-09-25 09:14 GMT

ఓటిటిల చేతుల్లోకి సినిమా ఇండస్ట్రీ వెళ్లిపోతోందనేది అందరూ అంటున్న మాటే. దగ్గరగా చూస్తే అదే నిజం కూడా. పెద్ద,చిన్నా తేడా లేకుండా ఏ ప్రొడ్యూసర్ అయినా సినిమా మొదలెట్టాలంటే ఓటిటి కన్ఫర్మేషన్ చూసుకుంటున్నారు. ఎంత రేటు పలుకుతుంది అనేది లెక్కేసుకుని హీరో రెమ్యునరేషన్ , బడ్జెట్ లెక్కలు వేస్తున్నారు. చివరకు అంతా చేసి ఓటిటి వాళ్లు సినిమాకు తాము అనుకున్న రేట్ ఇవ్వకపోతే సంస్దల చుట్టూ ప్రదిక్షణాలు చేస్తున్నారు. మొదట్లో ఓటిటి సంస్దలు ..నిర్మాతల చుట్టూ తిరిగేవి. ఇప్పుడు నిర్మాతలు అంతా ఓటిటి సంస్దల చుట్టూ తిరుగుతున్నారు. అంతెందుకు తెలుగులో ఓ పెద్ద నిర్మాత ఇప్పుడు సంక్రాంతికి తమ సినిమా రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ చేసుకుని, ఓటిటి డీల్ ఫైనల్ కాలేదని తిరుగుతున్నారని వినికిడి. ఇలాంటి సిట్యువేషన్ లో వరుణ్ తేజ్ ని ఓటిటి సంస్ద దెబ్బ కొట్టిందనే వార్త హాట్ టాపిక్కే మరి. ఇంతకీ ఏం జరిగింది.

కిల్ అనే హిందీ చిత్రం సూపర్ హిట్టైంది. ఆ సినిమా రీమేక్ రైట్స్ కోసం చాలా మంది ట్రైల్స్ వేస్తున్నారు. జూలై 5న రిలీజైన ఈ సినిమా అక్కడ తెగ ఆడి రికార్డ్ లు క్రియేట్ చేసింది. ఫుల్ ఆన్ యాక్షన్ కథతో వచ్చిన ఈ సినిమా రీమేక్ రైట్స్ పై మన వాళ్ల దృష్టి పడింది.ఇప్పటికే హాలీవుడ్‌ ఫిల్మ్‌ ‘జాన్‌ విక్‌’ను తెరకెక్కించిన దర్శకుడు ఛార్లెస్‌ ఎఫ్‌. స్టాహెల్స్కీ ఇంగ్లీష్‌ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడు. ‘జాన్‌ విక్‌’మూవీలో యాక్షన్‌ సన్నివేశాలు ఎలా ఉంటాయో యాక్షన్‌ ప్రియులకు బాగా తెలుసు. అలాంటి మూవీని తీసిన ఛార్లెస్‌ ఇందులోని స్టంట్స్‌కు ఫిదా అయ్యాడంటే అవి ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

దాంతో ‘కిల్’ సినిమా తెలుగు రీమేక్ హక్కులు నిర్మాత కోనేరు సత్యనారాయణ దక్కించుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఆయన ప్రయత్నం చేస్తున్నారు. దర్శకుడిగా రమేష్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, ఈ భారీ ప్రాజెక్టుకు తగిన దర్శకుడు ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు. హీరో ఎంపిక విషయానికి వస్తే, వరుణ్ తేజ్ పేరు బలంగా వినిపించింది. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవడంలో వరుణ్ తేజ్ ఎప్పుడూ ముందుంటారు. ‘ఫిదా’ లాంటి సినిమాల్లో అతను చేసిన పాత్రలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ‘కిల్’ సినిమాలోని క్లిష్టమైన పాత్రకు వరుణ్ తేజ్ బాగా సరిపోతారని భావించారు. ఆయన్ను కలిసి ఒప్పించారని కూడా తెలిసింది. అయితే తెలుగు వెర్షన్ కు ఏమి మార్పులు చేస్తారో చూసి ఫైనల్ చేస్తాను అన్నారుట.

అయితే ఈ లోగా ఊహించని ట్విస్ట్ పడింది. “కిల్” సినిమా ఓటీటీలోకి అదీ తెలుగులోకి వచ్చేసింది . అలాంటప్పుడు రీమేక్ చేసి ఉపయోగం ఏంటి? అనే మాట వినపడుతోంది. వాస్తవానికి ఇలా ఓ రీమేక్ అనుకున్నప్పుడు, తెలుగు డబ్బింగ్ తో పాటు, తెలుగు థియేట్రికల్ రిలీజ్ ను ఆపేస్తేనే ఫలితం ఉంటుంది. కానీ అప్పటికే స్ట్రీమింగ్ రైట్స్ కింద తెలుగు వెర్షన్ హక్కులు కూడా ఇచ్చేస్తే, ఇలాంటి సమస్యలే ఎదురౌతాయి. ఇప్పుడు ధైర్యం చేసి చేసినా కిల్ ఆల్రెడీ ఓటిటిలో ఉంది కాబట్టి చాలా మంది చూసేస్తారు. థియేటర్స్ లో సమస్య వస్తుంది. బిజినెస్ అనుకున్న స్దాయిలో అవ్వదు. సరికదా ఓటిటి రైట్స్ అమ్ముదామన్నా ఇదే సమస్య వస్తుంది.

ఇంతకు ముందు శింబు నటించిన సూపర్ హిట్ “మానాడు” విషయంలో కూడా ఇదే జరిగింది. ఆ సినిమాను రానా రీమేక్ చేయాలనుకున్నాడు. అంతా ఓకే అయిపోయింది. ఈలోగా తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులోకి వచ్చేసింది. దీంతో ఆ రీమేక్ ను ఆపేశారు. ఇప్పుడు “కిల్” రీమేక్ విషయంలో మేకర్స్ ఏం చేస్తారనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.

కిల్ సినిమా అంతా దాదాపుగా ట్రైన్ లోనే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో అయితే కంప్లీట్ గా సీక్వెన్స్ తో ఉంటుంది. అలాంటి యాక్షన్ ఎంటర్టైనర్ ని వరణ్ తేజ్ తో తీయడం ఫెరఫెక్ట్. అయితే ఇవేమీ పట్టించుకోకుండా స్క్రిప్టు వర్క్ జరుగుతోందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. అలాగే యాక్షన్ ఫ్లేవర్ తగ్గకుండా తెలుగు వర్షన్ కి తగ్గట్టు స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయబోతున్నారు రమేష్ వర్మ.

ఏదైమైనా తెలుగులో పూర్తి యాక్షన్‌ మూవీ అంటే వర్కవుట్‌ కాకపోవచ్చు. చాలా తక్కువ సినిమాలు మాత్రమే ఈ జానర్‌లో ప్రేక్షకుల కు నచ్చాయి. అలాగని ‘కిల్‌’లాంటి చిత్రంలో కామెడీ, పాటలు జొప్పిస్తే, కిచిడీ అయి కూర్చొంటుందనేది నిజం. బాలీవుడ్‌ మూవీలో ఉన్న యాక్షన్‌ ఫ్లేవర్‌ తగ్గకుండానే ఇక్కడి నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నాడంటున్నారు.

అసలే రమేష్ వర్మ కిల్ రీమేక్ చేస్తే కిల్ చేసినట్లే అని సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది. ఇప్పుడేమో ఓటిటిలో వచ్చేసింది ఈ సినిమా. ఫ్లాఫ్ ల్లో ఉన్న వరుణ్ తేజ్ కు ఈ సినిమాతో అయినా హిట్ పడుతుందనుకుంటే ఇలా జరిగింది ఏమిటనేది ఫ్యాన్స్ కేమి అర్దం కావటం లేదు.

'కిల్' చిత్రం కథేంటంటే..

ఎన్‍ఎస్‍జీ కమాండోగా పని చేస్తున్న అమిత్ రాథోడ్ ( లక్ష్‌ లాల్వానీ) ఢిల్లీ నుంచి రాంచీకి ఒకే ట్రైన్‍లో బయలుదేరి వస్తూంటాడు. అమిత్‍తో పాటు తోటి కమాండో తన స్నేహితుడు వీరేశ్ (అభిషేక్ చౌహాన్) కూడా ఉంటాడు. రాత్రిపూట ప్రయాణం. అమిత్ ఆలోచనల నిండా ఒకటే. తను ప్రేమించిన అమ్మాయి కోటీశ్వరరాలు అయిన తులికా (తాన్య మనక్తిలా)కు వేరే అబ్బాయితో ఎంగేజ్‍మెంట్ చేసేసారు. వాళ్లకు కమెండో గా పనిచేసే అమిత్ ఆనడు. దాంతో ఆమె తల్లితండ్రులు ఇలా వేరే కుర్రాడితో ఎంగేజ్మెంట్ చేసేసారన్నమాట. అదే ట్రైన్ లో ఆమె తన ఫ్యామిలీతో ఉంది. ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలనేది అమిత్ ఆలోచన.

ఇదిలా ఉండగా...ఊహించని విధంగా ఆ ట్రైన్ పై బందిపోట్ల దాడి జరుగుతుంది. ఫణి (రాఘవ్ జుయల్), బేని (ఆశిష్ విద్యార్థి) లీడ్ చేస్తున్న ఓ బందిపోట్ల ముఠా ఆ ట్రైన్ లోని ప్రయాణికులపై దాడి చేస్తుంది. ప్రయాణికులను ఆ బందిపోట్లు దోచుకునేందుకు వస్తారు. ఆ బందిపోట్లు కేవలం దోచుకోవడమే కాకుండా ప్రయాణికుల ప్రాణాలు కూడా తీస్తుంటారు. బయిటకు కాల్స్ వెళ్లకుండా జామర్లు పెట్టి ఎవరి ఫోన్లు పని చేయకుండా చేస్తారు. ఈ క్రమంలో ఆ ట్రైన్ లో ఉన్న ప్రయాణీకుల తో పాటు తులికా కుటుంబం కూడా ప్రమాదంలో పడుతుంది. అప్పుడు అమిత్ రంగంలోకి దిగుతాడు. తన స్నేహితుడు వీరేశ్ సాయింతో కమెండో స్కిల్స్ తో ఆ బందిపోట్లపై సునామీలా విరుచుకుపడతాడు. అప్పుడు ఏం జరిగింది. తులికా ఫ్యామిలీని, ప్రయాణీకులను రక్షించగలిగారా....అనేది మిగతా కథ.

Tags:    

Similar News