రాజమౌళి, మహేష్ చిత్రం టైటిల్ ఇదేనా? వెరైటీగా ఉందే..

జెన్ 63 వెనుక ఉన్న అసలు సీక్రెట్;

Update: 2025-08-14 02:30 GMT

“The right title is your movie’s passport to the world.”: John Ford

పెద్ద సినిమాకి టైటిల్ అన్నది సింపుల్ ఫ్లాష్‌కార్డ్ కాదు… అది ఒక మూడ్ సెట్టర్. టైటిల్ విన్న వెంటనే ఆడియెన్స్ మెదడులో ఒక సినిమా ప్లే అవ్వాలి. అలాగే పెద్ద సినిమాలకు కంటెంట్, కథ, టెక్నికల్ వర్క్ ఎంత ముఖ్యమో, టైటిల్ కూడా అంతే ప్రాధాన్యం కలిగి ఉండాలి. టైటిల్‌ అనేది మొదటి ఇంప్రెషన్, అది ప్రేక్షకులలో ఆసక్తిని, ఊహలను, బజ్‌ను సృష్టిస్తుంది. ముఖ్యంగా పాన్-వరల్డ్ లేదా పాన్-ఇండియన్ స్థాయిలో ప్లాన్ చేస్తున్న సినిమాల్లో, టైటిల్ ద్వారా గ్లోబల్ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించడం మరింత అవసరం.

సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి టైటిల్ చాలా పవర్ ఫుల్ గా ఉండాలి. అలాగే టైటిల్ అనేది సినిమా కోసం చేస్తున్న ఫస్ట్ స్ట్రాటజిక్ మావ్ లాంటిదే. ఈ విషయాలన్ని టాలీవుడ్ మాస్టర్ క్రాఫ్ట్స్‌మన్ ఎస్‌.ఎస్‌. రాజమౌళికు తెలుసు. అందుకే ఆయన తన కొత్త ప్రాజెక్ట్ SSMB 29 కు సరైన, కొత్తదనమున్న టైటిల్ కోసం స్పెషల్‌గా ఆలోచిస్తున్నారు.

SSMB 29 – గ్లోబల్ అంచనాలను రేపుతున్న పాన్ వరల్డ్ ఎపిక్

తాత్కాలికంగా గ్లోబ్‌ట్రాటర్ అని పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది ప్రారంభం నుంచే ఇంటర్నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్‌గా మారింది. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో, టెక్నాలజీ, స్కేల్, ప్రెజెంటేషన్ పరంగా భారీగా తెరకెక్కుతోంది. కేవలం ఇండియన్ ఆడియెన్స్ కాకుండా, ఇంగ్లీష్ ప్రేక్షకులను కూడా టార్గెట్ చేస్తూ, రాజమౌళి హాలీవుడ్ టాప్ టెక్నీషియన్లను హైర్ చేసి పనిచేస్తున్నారు. సినిమా కథ, విజువల్స్ మాత్రమే కాకుండా వరల్డ్‌వైడ్ అటెన్షన్ దక్కేలా ప్రతీ అంశంలో కొత్తదనం కోసం ప్లాన్ చేస్తున్నారు.

'జెన్ 63' – టైటిల్ వెనుక ఉన్న మిస్టరీ

“గ్లాడియేటర్‌ అనే టైటిల్ వింటే , ఒక యోధుడి దృఢ సంకల్పం కళ్ల ముందు కనిపిస్తుంది.

డ్యూన్ అని వింటే , విస్తీర్ణమైన ఎడారి వాతావరణం మనసుకు చేరుతుంది.

ఇవి కేవలం పదాలు కావు, ఒక పూర్తి ప్రపంచపు తలుపులు ఓపెన్ చేసే తాళాలు

ఇలాంటి టైటిల్స్‌నే రాజమౌళి కోరుతున్నాడు — మనసులను సృష్టించే మాయాజాలం.”

ఫిల్మ్‌నగర్ టాక్ ప్రకారం, ఈ సినిమాకు ‘జెన్ 63’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని వినికిడి. జెన్ 63 అంటే 63వ జనరేషన్. కథ ప్రకారం, మహేష్ బాబు ఒక శక్తివంతమైన వంశంలో 63వ తరం వారసుడిగా కనిపిస్తారట. ఈ స్టోరీలో హిందూ పురాణాలకు చెందిన అంశాలు ఉంటాయని, రామాయణంతో లింక్ ఉండవచ్చని అంటున్నారు. ముఖ్యంగా, రామాయణంలోని కొన్ని పవర్‌ఫుల్ ఆర్టిఫాక్ట్స్ కోసం జరిగే అన్వేషణ చుట్టూ కథ తిరుగుతుందని సమాచారం. అలాగే, కాశీ నగరానికి కూడా ఈ కథలో కీలక ప్రాధాన్యం ఉండబోతోందట.

63వ తరం అంటే ఆ వంశం వేల ఏళ్ల క్రితం ప్రారంభమై, త్రేతా యుగం లేదా ద్వాపర యుగాలతో కనెక్ట్ అయ్యి ఉండవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ టైటిల్ అఫీషియల్ గా బయిటకు రాలేదు.

షూటింగ్ అప్‌డేట్

జనవరి 2025లో ప్రారంభమైన ఈ సినిమా, మధ్యలో కొంత విరామం తర్వాత మళ్లీ హైదరాబాద్‌లో వేగంగా సాగుతోంది. ప్రియాంక చోప్రా మరోసారి హైదరాబాద్ చేరి, మహేష్ బాబుతో కలిసి కీలక సన్నివేశాల్లో నటిస్తున్నారు. ఆసక్తికరంగా, మహేష్ బాబు తన 50వ పుట్టినరోజు వేడుకలను విదేశాల్లో కాకుండా, షూటింగ్‌లోనే గడిపారు.

ప్రియాంక సెట్స్ బయట తన కూతురితో గడిపిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, ఫ్యాన్స్‌ను కనెక్ట్ చేస్తున్నారు.

మొదట కెన్యా నేషనల్ పార్క్స్‌లో గ్రాండ్ యాక్షన్ సీన్స్ తీయాలని అనుకున్నా, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా రాజమౌళి బ్లూ-స్క్రీన్ టెక్నాలజీతో హైదరాబాద్‌లోనే ఆ వాతావరణాన్ని రీక్రియేట్ చేస్తున్నారు.

రిలీజ్ ప్లాన్

ప్రస్తుతం గ్లోబ్‌ట్రాటర్ అనే వర్కింగ్ టైటిల్‌తో ముందుకు వెళ్తున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్, కె.ఎల్. నారాయణ నిర్మాణంలో, పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ, ఎం.ఎం. కీరవాణి సంగీతంతో రూపొందుతోంది. ఫైనల్ టైటిల్, ఫస్ట్ లుక్ టీజర్‌ను నవంబర్‌లో జరిగే గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. 2027లో వరల్డ్‌వైడ్ రిలీజ్ లక్ష్యంగా ప్లాన్ లు సిద్ధమవుతున్నాయి.

Tags:    

Similar News