‘జన నాయకన్’ సినిమా ‘భగవంత్ కేసరి’ కి రీమేక్?

వీటీవీ గణేశ్ స్పీచ్ ను హైలైట్ చేస్తున్న పత్రికలు;

Update: 2025-01-27 11:58 GMT

తమిళనాడులో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన ‘దళపతి’ విజయ్ చివరి చిత్రంగా ప్రచారం జరుగుతున్న సినిమాకు అధికారికంగా టైటిల్ ప్రకటించారు. కోలీవుడ్ సర్కిల్ లో మొదటి నుంచి ప్రచారం జరుగుతున్న ‘‘ జననాయకన్’’ పేరునే ఫిక్స్ చేశారు. ఇది విజయ్ కు 69 వ చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్రం 2023 లో నందమూరి నటసింహం బాలకృష్ణ, కాజోల్ అగర్వాల్, శ్రీలీల జంటగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘ భగవంత్ కేసరి’కి రీమేక్ అని ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమా తరువాత విజయ్ పూర్తిగా రాజకీయాలకు అంకితం కావాలని నిర్ణయించుకున్నాడు. గత ఏడాది ఆయన ‘తమిళ వెట్రి కజగం’ పార్టీ ని స్థాపించారు. తరువాత ఆయన విక్రమ్ వాండీలో అతిపెద్ద పార్టీ సమావేశం నిర్వహించారు. దీనికి లక్షలాది అభిమానులు హజరయ్యారు.
చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో దళపతి విజయ్ సెల్పీ తీసుకుంటూ ఉండగా, వెనక వైట్ అండ్ వైట్ తో వేలాదిగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో విడుదల చేయడంతో లక్షలాది మంది లైక్ లు, షేర్లు, రీట్వీట్ లు చేశారు.
నిజంగా రీమేక్?
తెలంగాణ టుడే ప్రకారం.. కోలివుడ్ నటుడు వీటీవీ గణేశ్ ఇటీవల విడుదలైన ‘‘ సంక్రాంతికి వస్తున్నాం’’ సినిమా ఫంక్షన్ సందర్భంగా మాట్లాడుతూ.. దళపతి విజయ్ ‘‘ భగవంత్ కేసరి’’ సినిమాను ఐదు సార్లు చూసినట్లు చెప్పుకొచ్చారు. తరువాత చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడిని సంప్రదించి తమిళ హక్కులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కానీ డైరెక్టర్ దీనిని తిరస్కరించాడు. 
జననాయకన్ సినిమాకు హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీత దర్శకుడు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం విజయ్ దాదాపుగా 200 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని కోలీవుడ్ మీడియా ప్రచారం చేస్తోంది.
విజయ్ కు జోడిగా ఇందులో పూజా హెగ్దే నటిస్తున్నారు. అలాగే మమితా బైజు, బాబీ డియోల్, ప్రియమణి, గౌతమ్ వాసుదేవ మీనన్, వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 2025 దసరా సందర్భంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే చిత్రీకరణలో ఆలస్యం అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకురావాలని ప్రణాళిక వేసుకుంటున్నారని తెలంగాణ టుడే వెల్లడించింది.
Tags:    

Similar News