8 బెస్ట్ ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదం సినిమాలు ఇవే
ఇజ్రేల్ పాలస్తీనా వివాదం ఏమిటి? యూదు, అరబ్ జాతుల మధ్య పాలస్తీనా భూభాగంలో యుద్దం ఎలా మొదలయింది, బాధితులెలా తిరుగబడుతున్నారు? ఈ సినిమాలు చూస్తే అర్థమవుతుంది.
(సలీమ్ బాషా)
గాజా ప్రాంతలో ఇజ్రేల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రేల్ మీద రాకెట్లు ప్రయోగించిన హామాస్ మీద ప్రతికారం తీర్చుకునేందుకు, ఆ సంస్థను రూపుమాపేందుకు ఇజ్రేల్ గాజా ప్రాంతంలో భయంకరమయినదాడుల జరుపుతూ ఉంది. పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా ఈ దాడుల్లో హతమవుతున్నారు. ఇళ్లు, ఆసుపత్రులు నేలమట్టమవుతున్నాయి. ఈ మారణకాండను ఐక్యరాజ్య సమితి ఖండించింది. ప్రపంచ ఆరోగ్యం సంస్థ గాజాని భూతల నరకంగా పేర్కొంది. పాలస్తీనా, ఇజ్రేల్ సంఘర్షణ ఇప్పటిది కాదు. దీనికి చాలా చరిత్ర ఉంది.
ఈ సమస్య అందరికీ అంత ఈజీగా అర్థం కాదు. దీని మీద ఎన్నోపుస్తకాలు వచ్చాయి. ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఈ సంఘర్షణను, ముఖ్యంగా పాలస్తీన వాసుల సమస్యను అర్థం చేసుకునేందుకు కొన్ని సినిమాలున్నాయి. వాటికి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది. ఆ సినిమాలు ఇవే.
ఈ సినిమాలు ఇజ్రేల్ పాలస్తీనా సమస్యని వివిధ దృక్కోణాలనుంచి అర్థం చేసుకొని, మధ్య ఆసియాలో చెలరేగుతున్న యుద్ధం మీద ఒక అవగాహ ఏర్పరుచుకోవాడానికి సాయం చేయవచ్చు. ఇక్కడ బాగా ప్రజాదరణను, విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఎనిమిది సినిమాలను మీ ముందుకు తెస్తున్నాం.
ప్యారడైజ్ నౌ (2005) (Paradise Now)
ఇది ఇజ్రాయిల్ లోని సయ్యద్, ఖలెద్ అనే ఇద్దరు పాలస్తీనియా యువకుల సైకలాజికల్ డ్రామా. వారిద్దరూ ఇజ్రాయిల్ లో ఆత్మహత్య దాడికి తయారు కావడం సినిమా నేపథ్యం. వారు మతవాదులు గాని, రాజకీయవాదులు గాని కాదు. వారు ఏ సందర్భంలో కూడా ఉన్మాదుల్లాగా గుర్తింపు పొందిన వారు కాదు. వారిద్దరూ తమ చివరి రోజులను కలిసికట్టుగా గడపాలనుకున్నవాళ్లు. ఇజ్రాయిల్ సరిహద్దులో వారు పట్టుబడతారు. వారి పథకం బయటపడటంతో, వారి నిర్ణయం ప్రశ్నార్ధకమవుతుంది.
పాలస్తీనియా డచ్ దర్శకుడు హనీ అబూ అసద్ తీసిన ఈ సినిమాలో సూసైడ్ బాంబర్ దృక్కోణం ఒక అర్థవంతంగా , కళాత్మకంగా కాసింత సస్పెన్స్ తో కలిపి ప్రేక్షకులు స్పందించే విధంగా చిత్రీకరించబడింది. ఇది ఆస్కార్ కు నామినేట్ చేయబడిన మొట్టమొదటి సినిమా పాలస్తీనా సినిమా. విదేశీ చిత్రాల కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు పొందిన మొదటి పాలస్తీనా సినిమా కూడా ఇదే. ఇది వివిధ వర్గాల నుంచి నిరసనకు దారితీసింది. ఈ సినిమా తీవ్రవాదుల దాడులలో సాధారణ పౌరులను చంపడాన్ని సమర్ధిస్తున్నదని దీన్ని అవార్డుకు అనర్హంగా ప్రకటించమని కొన్ని వర్గాలు అకాడమీ ని కోరాయి.
" పాలస్తీనియన్ లు భే షరతుగా స్వేచ్ఛ, సమానత్వం పొందడానికి అర్హులని గుర్తించడమే ఈ అవార్డు" అని దర్శకుడు అవార్డు స్వీకరిస్తున్న సమయంలో చెప్పుకొచ్చాడు. ఈ సినిమా నిర్మించిన అమీర్ హరేల్.ఇజ్రాయిల్ యూదుడే " ఈ సినిమా ప్రేక్షకులు వాస్తవికతను అర్థం చేసుకునేలా చేయడమే ముఖ్యమైన విషయం" అని ఆయన ప్రకటించాడు. ఇంతకుముందు ఈ సినిమా దర్శకుడు ‘ఓమర్’ అనే సినిమా తీశాడు. ఈ మూవీని యుట్యూబ్ లో చూడవచ్చు.
వాల్జ్ విత్ బషిర్ (2008) (Waltz With Basheer)
ఇది దర్శకుడు హారి ఫోల్మన్ తీసిన ఒక అనిమేషన్ వార్ డ్రామా. 1982 లెబనాన్ యుద్ధంలో తాను సైనికుడిగా పని చేసిన కాలంలో మరుగున పడిపోయిన తన అనుభవాల జ్ఞాపకాలను వెతికే ప్రయత్నం. ఈ క్రమంలో ఈ సినిమా యుద్ధాల నిరర్థకత ప్రతిబింబిస్తూ, వాటి ద్వారా ఉత్పన్నమయ్యే బాధను, సంఘర్షణను చూపిస్తుంది.
డేవిడ్ పోలెన్సుకి కళాత్మకమైన యానిమేషన్ ఈ సినిమాని తప్పకుండా చూడవలసిన సినిమాగా మార్చింది. పరస్పర విరుద్ధంగా కనిపించినా ఈ సినిమా యుద్ధ వ్యతిరేకతను చక్కగా ప్రతిధ్వనిస్తుంది.
ఈ సినిమా ఇజ్రాయిల్ " shooting and crying" ( కాల్చడం చేయడం- ఏడవడం) పద్ధతిని ఎత్తి చూపినట్లు అనిపించినా, దర్శకుడు ఫోల్మన్ అంగీకరించలేదు. ఈ సినిమా విదేశీ చిత్రాల కేటగిరీలో నామినేట్ చేయబడిన యానిమేషన్ సినిమా మాత్రమే కాకుండా గోల్డెన్ గ్లోబ్ అవార్డు పొందిన మొదటి విదేశీ యానిమేషన్ సినిమా. అంతేకాకుండా ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన మ్యాక్స్ రిట్జర్ బెస్ట్ కంపోజర్ యూరోపియన్ ఫిలిం అవార్డు పొందడం విశేషం. ఇది చిత్రం యుట్యూబ్ లో చూడవచ్చు.
(
లెమన్ ట్రీ (2008) (Lemon Tree)
సల్మా ఒక విధవరాలు. పాలస్తీనాలోని ఒక గ్రామంలో తనకున్న ఏకైక నిమ్మ తోట మీద ఆధారపడి జీవిస్తూ ఉంటుంది. ఇజ్రాయిల్ రక్షణ శాఖ మంత్రి ఆమెకు పొరుగున ఉన్న ఇంటికి రావడంతో ఆమె కష్టాలు మొదలవుతాయి. భద్రత పేరుతో ఆ నిమ్మ తోట చెట్లను కొట్టేయాలని లేకుంటే తీవ్రవాదులు వాటిలో దాక్కొని, దాడి చేస్తారని మంత్రి సెక్యూరిటీ వాళ్లు చెప్తారు. అయితే ఆమె దానికి నిరాకరించి కేసు సుప్రీంకోర్టులో కేసు వేసి ఒక లాయర్ ని నియమించుకుంటుంది. దాంతో ఆమె కథ అంతర్జాతీయ స్థాయిలో అందరికీ తెలుస్తుంది.
ఇజ్రాయిల్ దర్శకుడు ఎర్రర్ రిక్లిస్ దర్శకత్వం వహించిన ఈ ఆసక్తికరమైన కథ ఓల్డ్ టెస్టమెంట్ లో పొరుగువాడి ద్రాక్ష తోటను కోరుకున్న రాజు ఇజ్రాయిల్ కథను పోలి ఉండడంతో మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాలో ఏ వర్గాన్ని కూడా టార్గెట్ చేయదు ఇజ్రాయిల్ పొగరుగాను, పాలస్తీనా వాళ్లు మొండిగాను ఉండడం విశేషం. లెమన్ ట్రీ అన్నది మానవ కోణంలో ఇరువర్గాల మధ్య విభజనను బహిర్గతం చేస్తుంది. . అదే సంవత్సరం విడుదలైన Waltz with bashir సినిమా లాగా బలమైన ముద్ర వేయకపోయినా, ఈ సాధారణ కల్పిత కథ Hiam Abbas (హియం అబ్బాస్) అద్భుత నటనతో బలమైన ముద్ర వేసింది. ఇది కూడా యు ట్యూబ్ లో చూడవచ్చు.
5 బ్రోకెన్ కెమెరాస్(2011) 5 (BROKEN CAMERAS)
బర్నాట్, గై దవిది తీసిన ఈ డాక్యుమెంటరీ తప్పక చూడవలసిన స్థాయి ఉంది. ఇజ్రాయిల్ ఆర్మీ ఆగడాలను అడ్డుకున్న సంఘటనలు ఈ డాక్యుమెంటరీ నేపథ్యం. తన ఇంటి బయట జరిగిన గందరగోళ్ల సంఘటనలను చిన్న వీడియో కెమెరాతో ఐదు సంవత్సరాలు పాటు బర్నాట్ రికార్డ్ చేయడం జరిగింది. ఒక ఔత్సాహిక వీడియో గ్రాఫర్ వ్యక్తిగతంగా తన ఇంటి బయట వెస్ట్ బ్యాంక్ టౌన్షిప్ లో జరిగిన జీవితాన్ని రికార్డు చేయడం, స్థానికుల హెచ్చరికలు కూడా లెక్క చేయకుండా నిక్షిప్తం చేయడం. సాధికారతకు తన కెమెరా ఒక పరికరం మాత్రమే కాకుండా తన వర్గాన్ని కూడా ఏకం చేయగల సాధనంగా గుర్తించాడు.
" నేను గాయాన్ని మానేసేలా చేయడం కోసమే సినిమాలు తీస్తాను" అంటాడు బర్నాట్.
“వాళ్లు ఏ క్షణంలోనైనా నా ఇంటి తలుపులు తట్టవచ్చని నాకు తెలుసు. . అయినా నేను సినిమాలు తీయడం ఆపను. జీవితాన్ని ఎదుర్కొని బతకడానికి అవి నాకు సాయం చేస్తాయి”.
5 బ్రోకెన్ కెమెరాస్ అని పేరు పెట్టడానికి కారణం అతని ఐదు కెమెరాలు ధ్వంసం కావడమే. ఈ సినిమా రాజకీయ, సినిమాటిక్ ఆచరణ తత్వం ప్రతిబింబించే ఒక ముఖ్యమైన పని. అంతేకాకుండా ఇది ఒక తన ఇల్లు అనుకున్న ప్రదేశం నుంచి పీడించబడి, వెళ్ళగొట్టబడిన సంఘటనకు ప్రత్యక్ష సాక్ష్యం. ఈ మూవీని కూడా యుట్యూబ్ లో చూడవచ్చు.
ది గేట్ కీపర్స్(2012) (THE GATE KEEPERS)
తీవ్రవాదంపై ఇజ్రాయిల్ యుద్ధాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ఇజ్రాయిల్ సీక్రెట్ సర్వీస్ షిన్ బెట్ అధికారులు 6 మంది వారి ఆలోచనలని పంచుకోవడం ఈ సినిమా కథ. ఇజ్రాయిల్ దర్శకుడు డ్రోర్ మోరే, భద్ర పరిచిన కొంత ఫుటేజ్ ని కంప్యూటర్ యానిమేషన్ తో పాటు కొన్ని ఇంటర్వ్యూలను కూడా ఏడు కలిపి వేరు వేరు సెగ్మెంట్లుగా దీన్ని తీశాడు. పాలస్తీనా ప్రాంతాలను, బస్ 300 వ్యవహారం( 1984లో ఒక సంఘటన జరిగింది. ఒక బస్సును హైజాక్ చేసిన పాలస్తీనా హైజాకర్స్ లొంగిపోయిన తర్వాత కూడా ఇద్దరినీ కాల్చి చంపడం) వంటి అంశాలను కలిపి షిన్ బెట్ ఆవిర్భావం, దాని పాత్ర, తీవ్రవాదుల హత్యలు ఈ సినిమా కథ.
ఆస్కార్ అవార్డు పొందిన ఎరోల్ మారిస్ డాక్యుమెంటరీ " ది ఫాగ్ ఆఫ్ వార్" నుంచి స్ఫూర్తి పొందిన దర్శకుడు, నైపుణ్యంతో ఎడిట్ చేసి తీసిన డాక్యుమెంటరీ ఇది. హింసాత్మక ఘటనలను తమ చేతుల మీదుగా జరిపిన వారు ఇచ్చిన ఈ చారిత్రాత్మక పాఠాలు ఒక కనువిప్పు
" నీతి నియమాలను పక్కన పెడితే, ఈ సినిమా మిమ్మల్ని ఏమాత్రం భవిష్యత్తు గురించి ఆశ కలిగించదు" అని ఒక అధికారి చెప్తే, మరొక అధికారి ఈ దారుణకాండలను , రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా యూదులు కానీ పౌరులను ఆక్రమిత పశ్చిమ యూరోప్ లో హింసించిన నాజీల దుర్మార్గంతో పోల్చడం చూస్తే ఎప్పుడో ఒకసారి నిజం బయటపడుతుందని ఆశ కలుగుతుంది. ఇది నెట్ ఫ్లిక్స్ లో లభ్యం.
ఫాక్స్ ట్రాట్ (2017) (FOXTROT)
సామ్యుల్ మయొజ్("లెబనాన్" దర్శకుడు) తీసిన నమ్మశక్యం కాని, ఒక కుటుంబ విషాద గాధ ఇది. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గ్రాండ్ జ్యూరీ వెండి సిమ్హం అవర్డ్ అందుకున్న సినిమా. దీని ప్రారంభమే ఒక విధ్వంసం తొ మొదలవుతుంది. కొంతమంది సైనికులు ఒక వృద్ధ దంపతుల దగ్గరకు వెళ్ళీ వారి కుమారుడు డ్యూటీ లో మరణించాడని చెప్తారు.
ఆ తర్వాత సరిహద్దులో పహార కాస్తున్న సైనికులు తమకు బోర్ కొట్టకుండా చేసే ప్రయత్నాలు చూపించబడతాయి. కలలాంటి రెండవ భాగం తర్వాత, మళ్లీ మూడో భాగం తిరిగి మొదట చూపించిన వృద్ధ దంపతుల దగ్గరికి వెళ్తుంది. ఈ సినిమా మనల్ని కదిలిస్తుంది. క్రమక్రమంగా ఈ సినిమాలోని పజిల్ లాగా అర్థం కాని విషయాలు ఒక్కొక్కటి మంచులా విడిపోతాయి. అవి చాలా బలంగా మనల్ని తాకుతాయి.. రాజకీయాల పేరు మీద ఏ దేశమైనా సరే యువతను చావడానికి పంపించడం తో ఉత్పన్నమయ్యే విషాదాన్ని న్యాయమైన ఆగ్రహంతో ఈ సినిమా ప్రశ్నిస్తుంది.
ఒక పరిహాసంతో మిళితమై తీసిన ఈ సినిమా చిక్కుల్లో పడింది. ఎందుకంటే ఇందులో ఇజ్రాయిల్ రక్షణ దళాలు, నలుగురు అరబ్ యువతను కాల్చి చంపడాన్ని ఎలా కవర్ చేస్తారో చూపించబడింది. అయితే ఇజ్రాయిల్ సంస్కృతిక శాఖ మంత్రి మిరి " ఈ సినిమా ఇజ్రాయిల్ వ్యతిరేక కథనం" చెప్పాడు. ఈ సినిమా ఒక మానవతావాది యుద్ధ నిరర్థక గురించి చేసిన విన్నపం గా భావించవచ్చు. ఇది అమెజాన్ ప్రైం లో ఉంది.
గాజా మాన్ అమౌర్ GAZA MON AMOUR(2020)
దీన్ని అనువదిస్తే " నా ప్రియమైన గాజా" అవుతుంది. 2022 అకాడమీ అవార్డు లకు ఇది అధికారిక ఎంట్రీ. టార్జాన్, అరబ్ నాజర్ తీసిన ఈ సినిమా అనే 60 ఏళ్ల వయసున్న ఒక జాలరిని మనకు పరిచయం చేస్తుంది. తాను ప్రేమిస్తున్న సిహం అనే మహిళకు, ఆ విషయం చెప్పే ధైర్యం లేకపోవడం, ఈ సినిమా కథ. ఒకసారి ఇతని వలలో గ్రీకు దేవుడైన అపోలో శిల్పం ఒకటి చిక్కుకుంటుంది. అది స్థానిక అధికారు లకు తెలిసిన తర్వాత ఇతని జీవితం చిక్కుల్లో పడుతుంది.
గాజా మాన్ అమౌర్ అనేది ఒక చిన్న సినిమా. ముందు చెప్పిన సినిమాల లాంటి తీవ్రత లేకపోయినా. గాజా లో సమస్యాత్మక జీవితం యొక్క వివిధ రూపాలను ఈ చక్కగా చూపిస్తుంది. ఈ సినిమా సామాజిక రాజకీయ కోణాలను పెద్దగా సూచించదు. ఒక ప్రేమ కథను మాత్రమే చూపిస్తుంది. అయినప్పటికీ సమకాలీన పాలస్తీనా పరిస్థితులను చక్కగా చూపిస్తుంది. దీనికి సలీం ద, హియం అబ్బాస్ ల చక్కని నటన. కొంత వాస్తవికతను మేళవించిన అబ్సర్డ్ కామెడీ రకమైన సినిమా ఇది.అమెజాన్ ఫ్రైం లో ఉంది.
ది వ్యూయింగ్ బూత్ (The viewing) (2020)
కల్పిత రూపాలను మనం ఎలా మనకు, మన నమ్మకాలకు అన్వయించుకుంటాం అన్నది ఈ సినిమా నేపథ్యం ఇజ్రాయిల్ దర్శకుడు రానన్ అలెగ్జాండ్రొవిస్జ్ ఇజ్రాయిల్ మిలిటరీ పరిపాలన కింద పాలస్తీనా లో జీవితం గురించి ఆన్ లైన్ లో వచ్చిన వీడియో ఫుటేజ్ లను అమెరికా విద్యార్థుల కు చూపిస్తాడు. వారి స్పందనను చిత్రీకరిస్తాడు. ముఖ్యంగా మాయ లేవి అనే ఒక ఇజ్రాయిల్ మద్దతు దారు అయిన విద్యార్థి ని పై ఫోకస్ చేస్తాడు. ఆరు నెలల తర్వాత మరోసారి ఆ విద్యార్థినిని మరింత పుటే చూడడం కోసం ఆహ్వానిస్తాడు. ఈసారి ఆ అమ్మాయి తాను గతంలో వీడియో ఫుటేజ్ లో చూస్తున్న వీడియోను(కొంత ఎడిట్ చేసిన) చూస్తుంది. అప్పుడు ఆమె గతంలో వీడియో చూసినప్పుడు ఉన్న అభిప్రాయాన్ని కొంత ప్రతిబింబిస్తూ మన అభిప్రాయాలను, పక్షపాత ధోరణితో ఎలా ఏర్పరచుకుంటాం, మనల్ని మనం ఎలా సమర్థించుకుంటాం అన్నది చెబుతుంది.
ఈ సినిమా 2020లో అనేక ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శింపబడింది. అమెజాన్ ప్రైం ఈ చిత్రం లభ్యం.