నిత్యా మీనన్ 'కాదలిక్క నేరమిల్లై' OTT రివ్యూ!
రొమాంటిక్ కామెడీ డ్రామా రివ్యూ...;
Update: 2025-02-13 11:33 GMT
నిత్యామీనన్ కు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు,తమిళ,మళయాళంలో ఆమె నటనకు ఫిదా అయ్యి వచ్చే ప్రతీ సినిమాను చూస్తూంటారు. అయితే ఆమె తన క్రేజ్ ని క్యాష్ చేసుకోవటానికి చూడదు. కథల ఎంపిక చాలా జాగ్రత్తగా ఉంటుంది. నటనకు అవకాసం ఉంటేనే సైన్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 14వ తేదీన థియేర్లకువచ్చిన ఓ చిత్రం తెలుగులో డబ్బింగై ఓటిటిలో అందుబాటులోకి వచ్చింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా కథేమిటి, చూడదగ్గ సినిమానేనా అనేది చూద్దాం.
స్టోరీ లైన్
సిద్ధార్థ్ ( జయం రవి ) బెంగుళూర్ లో ఆర్కిటెక్ట్ . అతను నిరుపమ (భాను)తో ప్రేమలో ఉంటాడు. కానీ అది పెళ్లి దాకా వెళ్లదు. ఎందుకంటే సిద్దార్ద్ కు పెళ్లి, పిల్లలు అంటే ఆసక్తి ఉండదు. దాంతో ఆమె దూరం అవుతుంది. ఇక చెన్నైలో శ్రియ (నిత్యామీనన్) ఓ ఆర్కిటెక్ట్ . తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నా కాస్త ఇండిపెండింట్ ఉమెన్. కరణ్ (జాన్ కొక్కెన్)తో ఆమె నాలుగు సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్నా కొన్ని కారణాలతో విడిపోతుంది.
ఇదిలా ఉండగా ఓ సారి కొన్ని తప్పనిసరి పరిస్దితుల్లో సిద్ధార్థ్ 'స్పెర్మ్' డొనేట్ చేయవలసి వస్తుంది. అయితే అతను తన పేరు జేమ్స్ అని చెప్పి, తప్పుడు అడ్రెస్ ఇస్తాడు. అదే సమంయలో కరణ్ కి దూరమైన శ్రియ, టెస్టు ట్యూబ్ బేబీని కనాలని అనుకుంటుంది. దాంతో ఆమె అటు వైపు ప్రయాణం పెట్టుకుంటుంది,సక్సెస్ అవుతుంది. అయితే ఆమెకు తన బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకోవాలనే ఆలోచన. దాంతో ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.
కొన్నేళ్ల తర్వాత కంపెనీ పనిపై సిద్ధార్థ్ చెన్నై కి వెళతాడు. అక్కడ అతనికి శ్రియతో పరిచయం పెరిగి, ప్రేమలో పడతారు. ఇద్దరూ కలిసి జర్నీ మొదలెడదామనుకుంటారు. అప్పుడు కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. అవేమిటి.. శ్రియకు తన బిడ్డ తండ్రి ఎవరో తెలిసిందా. చివరకు ఏం జరుగుతుంది? అనేది కథ.
ఎలా ఉంది?
ఈ చిత్రం దర్శకురాలు కృతిగ ఉదయనిధి మరెవరో కాదు ...తమిళ హీరో, నిర్మాత, రాజకీయ నాయకుడు ఉదయనిథి స్టాలిన్ భార్య. ఆమె గతంలో వణక్కం చెన్నై, కాళీ, పేపర్ రాకెట్ వంటి సినిమాలు, వెబ్ సీరిస్ లు చేసారు. తాజాగా ఆమె సంక్రాంతికి ఈ రొమాంటిక్ కామెడిని తీసుకొచ్చారు. ఈ జనరేషన్ ఆలోచనలు, వివాహం పట్ల, ప్రేమ పట్ల ఉన్న ఫీలింగ్స్ ని ఈ సినిమాలో చెప్పటానికి ప్రయత్నించారు. పెద్దగా మలుపులు లేని ఈ కథలో ప్రేమ అంటే ఒకరి నిజాయితీని మరొకరు గుర్తిస్తూ .. గౌరవిస్తూ ముందుకు సాగాలని చెప్పటం జరిగింది.
ఆశించిన స్దాయిలో పెద్దగా కామెడీ లేదు. కానీ కొన్ని సీన్స్ నిజాయితీగా ఈ కాలం యూత్ ని రిప్రజెంట్ చేయటానికి ప్రయత్నించినట్లు అనిపిస్తుంది. స్క్రిప్టు ఇంకాస్త టైట్ గా ఉండాలనిపిస్తుంది. కొన్ని చోట్ల బాగా సాగతీసిన ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమాలో ఏకైక ప్లస్ ఏమిటంటే క్లాస్ లు పీకే కార్యక్రమం పెట్టుకోలేదు. ఏది చెప్పినా పాత్రల మధ్య జరిగే సన్నివేశాలతోనే చెప్పే ప్రయత్నం చేసారు. అయితే స్లోగా ఉంది నేరేషన్. చాలా చోట్ల గతంలో చూసినట్లు క్లీషే ఫీలింగ్ వచ్చింది.
ఎవరెలా చేశారు?
ఈ సినిమాని నిత్యామీనన్ కోసమే చూస్తాము. అయితే ఆమె పాత్ర ఓకే కన్మణి (ఓకే బంగారం)ని గుర్తు చేస్తుంది. అలాగే ఈ సినిమాలో మరో ప్లస్ పాయింట్ ఏ ఆర్ రహమాన్ మ్యూజిక్. కేవలం ఆయన బ్రాండ్ కోసం కాకుండా సోల్ ఫుల్ మ్యూజిక్ కోసం ఈ సినిమా చూడచ్చు. మిగతా పాత్రల్లో జయం రవి బాగా చేసారు. మిగతా వాళ్లు సోసోగా చేసుకుంటూ వెళ్లారు. టెక్నీషియన్స్ లో దర్శకురాలు మెచ్యూరిటీ లెవిల్స్ కాస్తంత ఇబ్బంది పెడతాయి అక్కడక్కడా. ఆమె ఐడియాలజీ అర్దమైతే సినిమా చాలా బాగుందనిపిస్తుంది.
చూడచ్చా
నిత్యామీనన్ అభిమానులకు ఈ సినిమా మంచి ఆప్షన్. మిగతా వాళ్లకు ఓ సారి ఖాళీగా ఉన్నప్పుడు ఓ లుక్కేయదగ్గ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్
ఎక్కడుంది
నెట్ ప్లిక్స్ లో తెలుగులో ఉంది