'కల్కి 2898 ఏడీ' భారీ సక్సెస్..ఆ రెండు సినిమాలకి చావు దెబ్బ

'కల్కి 2898 ఏడీ' సినిమా సక్సెస్ ఎఫెక్ట్ తో రెండు వర్కవుట్ అవుతాయనుకున్న సినిమాలు పడుకున్నాయి.

Update: 2024-07-03 06:41 GMT

ట్రేడ్ లో లెక్కలు చిత్రంగా ఉంటాయి. ఓ సినిమా ప్లాప్ అయితే యావరేజ్ గా ఉన్నా అదే వారం రిలీజైన మరో సినిమా పికప్ అవుతుంది. ఓ సినిమా సూపర్ హిట్ అయితే అప్పటికే ఉన్న కొన్ని చిన్న సినిమాలకు మంగళం పాడాల్సి వస్తుంది. ఇది సినిమా వాళ్లకు తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రభాస్‌ నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ' బ్లాక్ బస్టర్ అయింది. ఎక్కడ చూసినా కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. అయితే ఈ సినిమా సక్సెస్ ఎఫెక్ట్ తో రెండు వర్కవుట్ అవుతాయనుకున్న సినిమాలు పడుకున్నాయి. అవేంటో చూద్దాం.

'కల్కి 2898 ఏడీ' రిలీజ్ రోజు మార్నింగ్ షో నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. ఈ సినిమా రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. తొలిరోజు ఏకంగా రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. సినిమా కు ఓ రేంజి హిట్‌ టాక్‌ రావడంతో వీకెండ్ దాటినా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ ఏమాత్రం తగ్గడం లేదు. కల్కి నాలుగు రోజుల్లో రూ. 555 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అధికారికంగా ప్రకటించింది.

దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ ఇండియన్ సినిమాగా కల్కిని రూపొందించాడు. ప్రభాస్, దీపికా పదుకొణె, శోభన, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్‌ కల్కి మూవీలో నటించి మెప్పించారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు ఆ విజువల్‌ వండర్‌ ప్రపంచాన్ని మరిచిపోలేకపోతున్నారు. మహాభారతాన్ని ఫ్యూచర్‌ కథకు ముడి పెట్టి కల్కిని తెరకెక్కించిన నాగ్ అశ్విన్‌ను నెటిజన్లు అభిమానిస్తున్నారు.

కల్కి నాలుగు రోజుల్లో రూ. 555 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టింది. తెలుగులో 204.5 కోట్లు, హిందీలో రూ. 134.5 కోట్లు, తమిళ్‌లో రూ. 32.9 కోట్లు, మలయాళంలో రూ.35.1 కోట్లు, ఇతర దేశాల్లో రూ. 158 కోట్లు వచ్చాయి. అదే నెట్‌ పరంగా అయితే కల్కి ప్రపంచ వ్యాప్తంగా నాలుగురోజుల్లో రూ. 320 కోట్లు రాబట్టింది.

దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ కలెక్షన్స్ ఇలాగే కొనసాగితే మరో వారం రోజుల్లో రూ.1000 కోట్ల మార్కును దాటేస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ మూవీలో ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె ఒకరికి ఒకరు పోటిగా అదరకొట్టారు. నార్త్ లో అమితాబ్, దీపికాకు ఉన్న ఫాలోయింగ్ తో కలక్షన్స్ దుమ్ము రేపుతున్నాయి. తమిళనాట కమల్ కు ఉన్న మార్కెట్ తో ఓపినింగ్స్ వచ్చి స్టడీ అయ్యింది. ఇక ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ, ఆర్ట్, కాస్ట్యూమ్స్, ఎడిట్, మేకప్‌, టెక్నీకల్ డిపార్ట్మెంట్స్ గురించి చాలా మంది స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రపంచస్థాయి సినిమా ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని కల్కి రానున్న రోజుల్లో కలెక్షన్స్ పరంగా మరిన్ని అద్భుతాలు క్రియేట్ చేసే పనిలో ఉందని ట్రేడ్ అంచనా వేస్తోంది.


ఇక ఈ సినిమా ఇలా ఉంటే... ఈ సినిమాకన్నా ముందు రిలీజైన మహారాజా చిత్రం కలెక్షన్స్ ఫుల్ డ్రాప్ అయ్యాయి. విజయ్ సేతుపతి నటించిన ఆ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. వరల్డ్ వైడ్ గా 85 కోట్ల గ్రాస్ వచ్చింది. తెలుగులోనూ రెండు కోట్లుతో కొన్నారు. పది కోట్లు దాకా వస్తాయని అంచనా వేసారు. అదే స్దాయిలో హౌస్ ఫుల్స్ అవుతోంది. కానీ ముందుగా చేసుకున్న అగ్రిమెంట్స్ ప్రకారం ఈ సినిమాని చాలా థియేటర్స్ లో తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో కలెక్షన్స్ దారుణంగా డ్రాప్ అయిపోయాయి.


మరో ప్రక్క హిందీలో హారర్ కామెడీ గా ప్రేక్షకులను మెప్పించడానికి వచ్చిన బాలీవుడ్ మూవీ ‘ముంజ్య’ (Munjya). ఆదిత్య సర్పోట్దర్ తెరకెక్కించిన ‘ముంజ్య’.. 1950, 2023.. ఇలా రెండు టైమ్ జోన్స్‌లో నడుస్తూ జనాలను బాగానే అలరిస్తోంది. ఈ సినిమాకు కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. ఇప్పటిదాకా ఈ సినిమా 93 కోట్లు దాకా కలెక్ట్ చేసింది. హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. ఈ లోగా కల్కి వచ్చింది. దాంతో ఈ సినిమా కూడా పూర్తి డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు వంద కోట్ల మార్క్ ని చేరుకోవటం కష్టంగా ఉంది.

Tags:    

Similar News