పవన్ OG ని దెబ్బతీస్తున్న ‘కాంతార 1’ ? స్ట్రాటజీ ఏంటి?

దసరా బాక్సాఫీస్ షాక్

Update: 2025-10-04 11:16 GMT

దసరా సెలవురోజు తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్‌కి ఊహించని మలుపు ఇచ్చింది. రిలీజ్‌కు ముందు పెద్దగా హైప్‌ లేకపోయినా, ‘కాంతార: చాప్టర్ 1’ ఉదయం షో నుంచే కలెక్షన్లలో దూసుకుపోయింది. మధ్యాహ్నం వరకూ స్లోగా ఉన్న అడ్వాన్స్‌ బుకింగ్స్‌ సాయంత్రానికి షోలు పెరిగేంత క్రేజ్‌ క్రియేట్‌ చేశాయి.

ఆ ప్రభావం నేరుగా పవన్ కళ్యాణ్ ‘OG’ మీద పడింది. దసరా హాలీడే అని అదనపు బూస్ట్‌ రావాల్సిన చోట, ‘కాంతార’ దెబ్బతో OG నెంబర్స్ కుదేలయ్యాయి. ఫస్ట్ వీకెండ్‌ వరకూ ‘OG’ ఘనంగా నడిచినా, వర్కింగ్ డేస్‌లో నెంబర్స్ క్రమంగా తగ్గాయి. దసరా లాంటి హాలీడే కూడా కలెక్షన్లకు పెద్దగా హెల్ప్‌ కాలేదు.

అయితే ‘కాంతార: చాప్టర్ 1’కి రివ్యూలు మిక్స్‌ అయినప్పటికీ, ఫస్ట్ డే నెంబర్స్ షాకింగ్‌గా రికార్డులు బద్దలు కొట్టాయి. దసరా లాంగ్ వీకెండ్ కావడంతో థియేటర్ అన్నీ కళకళలాడుతున్నాయి. దాదాపు అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో కాంతార ప్రీక్వెల్ భారీ వసూళ్లను సాధిస్తోంది. ఫస్ట్ వీకెండ్‌కి మరింత వేగం పెరగనుంది అని ట్రేడ్ టాక్‌. వీకెండ్‌ వరకూ ‘కాంతార’ మోమెంటం కొనసాగితే, OG నెంబర్స్ ఇంకా ప్రెషర్‌కి గురయ్యే అవకాశం

ట్రేడ్ పర్స్పెక్టివ్:

1. కంటెంట్‌లో ఉన్న నేటివ్ కనెక్ట్

‘కాంతార’కు పాన్‌-ఇండియా బ్రాండ్ ఉంది. అలాగే ఇందులో చూపిస్తున్న ఫోక్ ఎలిమెంట్స్, మిథికల్ ఫీల్ తెలుగు ఆడియన్స్‌కి కూడా బలంగా కనెక్ట్ అయ్యాయి. ‘చాప్టర్ 1’లోని జానపదుల వాతావరణం, ఆధ్యాత్మిక లేయర్స్ ఆడియెన్స్‌ని థియేటర్లలోకి రప్పించే ప్రధాన కారణాలు అవుతున్నాయి.

2. దసరా హాలీడే ఫ్యామిలీ ఫాక్టర్

హాలీడే రోజున ఫ్యామిలీ ఆడియెన్స్‌కి ఒకే సాలిడ్ ఆప్షన్‌గా కాంతార నిలిచింది. యూత్ + ఫ్యామిలీ కలిసినప్పుడు, హాలీడే బూస్ట్‌తో షోలు పెరగడం సహజం. ఓజీ విషయంలో అభిమానుల ఫ్యామిలీలు మాత్రమే కదిలాయి.

3. పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ vs. మిక్స్ రివ్యూస్

రివ్యూలు మిక్స్‌గా ఉన్నా, ఫస్ట్ షో తర్వాత సోషల్ మీడియాలో “భారీ విజువల్స్, మాస్ సీక్వెన్స్‌లు” అన్న ఫీడ్‌బ్యాక్ వచ్చేసరికి బుకింగ్స్ పెరిగాయి. ముఖ్యంగా కాంతారా చాప్టర్ 1లో రిషబ్ శెట్టి కూడా గూస్ బంప్స్ తెప్పించేశాడని చెప్పుకుంటున్నారు. తెర మీద రిషబ్ శెట్టి పెర్ఫార్మెన్స్ చూసి ఆడియన్స్ అంతా సంబ్రమాశ్చర్యాలకు గురయ్యేలా చేశాడు.

వర్క్ మీద అతనికి ఉన్న డెడికేషన్, కమిట్మెంట్ గురించి స్పెషల్ గా మాట్లాడుకునే స్దితి వచ్చింది. ఓ రకంగా రిషబ్ శెట్టి కాంతారా రోల్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. కాంట్రాస్ట్‌గా ‘OG’కి ఇలాంటి వర్డ్ ఆఫ్ మౌత్ అంత స్ట్రాంగ్‌గా రాలేదు.

4. క్లైమాక్స్ కాపాడేసింది

కాంతారా లో క్లైమాక్స్ లో ఎలా అయితే పూనకాలతో ఊగిపోయేలా చేశాడో కాంతారా చాప్టర్ 1 లో కూడా అంతకు మించి అనిపించేలా చేశాడు. కాంతారా చాప్టర్ 1లో రిషబ్ శెట్టి నట విశ్వరూపం సినీ లవర్స్ అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఓజీ ఆ విషయంలో వెనకబడిందనే చెప్పాలి, సినిమా మొత్తం ఎలివేషన్స్ ఉన్నా వాటిలో ఎక్కువ శాతం పవన్ అభిమానులకు నచ్చేవే కావటం విశేషం.

5. OG ఎఫెక్ట్‌ ఎందుకు తగ్గింది?

‘OG’కి పవన్ కళ్యాణ్ మాస్ క్రేజ్, ఫస్ట్ వీకెండ్ బ్లాస్ట్ ఇచ్చింది. కానీ – వర్కింగ్ డేస్‌లో నెంబర్స్ తగ్గడం, దసరా రోజున కాంపిటీషన్ సినిమాలు రావడం, హాలీడేలో ఫ్యామిలీ ఆడియెన్స్ కాంతార వైపు వెళ్లడం, ఈ మూడు కారణాలు OGకి బూస్ట్ ఇవ్వలేదు.

ఫైనల్ గా..

దసరా హాలీడేలో తెలుగు బాక్సాఫీస్‌పై స్పష్టంగా కనిపించిన విషయం ఒక్కటే – ‘కాంతార: చాప్టర్ 1’ ఈ సీజన్ లో ఊహించని విన్నర్. మాస్ + ఫ్యామిలీ పుల్‌తో కలెక్షన్లు గట్టిగా లాగేస్తోంది. OG బలమైన వీకెండ్‌ తర్వాత స్టెడీగా ఉన్నా, హాలీడేలో ఎక్స్ట్రా జంప్ మిస్సయ్యింది. మొత్తానికి, కంటెంట్ + కల్చరల్ కనెక్ట్ ఉంటే ఫెస్టివల్ సీజన్‌లో ఆడియెన్స్ ఏ సినిమా వైపు వెళ్తారో ఈ పోటీ స్పష్టంగా చూపించింది.

Tags:    

Similar News