యష్ కి తలనొప్పిగా మారిన KGF సక్సెస్ ?
దీనికి మందేది..;
“విజయం తర్వాతి అడుగు చాలాసార్లు గెలుపుకన్నా కష్టమైనది” – ఇండస్ట్రీలో ఇప్పుడు యష్ పరిస్థితి చూస్తే ఈ మాట గుర్తొస్తుంది.
ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే ఆ తర్వాత ఆ హీరో చేసిన సినిమాలపై ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ పడుతుంది. దాంతో అంచనాలు పెరిగిపోయి, వాటిని అందుకోలేక అవి చతికిల పడుతూంటాయి. ఇప్పుడు యష్ కొత్త సినిమా టాక్సిక్ ఇదే సమస్య ఎదురవుతోంది. ఈ సినిమా కు బజ్ క్రియేట్ కావడం లేదు. కేజీఎఫ్ తో పోల్చి చూసి, ఆ స్థాయిలో ఉంటుందా ఉండదా అని ప్రతీదాన్ని బూతద్దంలో అభిమానులు చూస్తున్నారు. రేపు రిలీజ్ అయ్యాక కూడా అదే పరిస్దితి వస్తుందని యష్ భయపడుతున్నారు.
KGF – ఓ సినిమా కాదు, ఓ సంచలనం. కేవలం బాక్సాఫీస్ వసూళ్లే కాదు, యష్ అనే హీరోను దేశవ్యాప్తంగా ఓ మాస్ ఐకాన్‌గా మార్చిన చిత్రం. కానీ అదే విజయం ఇప్పుడు అతనికి ఓ బరువైన తలపాగా అయింది.
"Yash is now not just a star, but a business model."
KGF తర్వాత... యష్ కెరీర్ 'టాక్సిక్' మోడ్‌లో? లోకి వెళ్ళిపోతోందా అని అభిమానులు కంగారు పడుతున్నారు. యష్ కు కేజీఎఫ్ సక్సెస్ అనేది బ్లెస్సింగ్ గా మారుతుందా లేక బర్డెన్ గా మారుతుందా అనే చర్చ ఇప్పుడు ట్రేడ్ లో జరుగుతోంది. వాస్తవానికి KGF యష్‌కు ఓ స్టార్‌డం ఇవ్వలేదు. అది ఒక బ్రాండ్ ని పర్సనాలిటీ ని ఇచ్చింది.
KGF అంతలా హిట్ అవుతుందని ఎవ్వరం ఊహించలేదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ‘అలా’ హిట్ కావాలనుకుంటున్నారు!. KGF 2 హిందీ బెల్ట్ alone లో ₹400 కోట్లు గ్రాస్ చేసింది – సౌత్ హీరోకి అరుదైన ఘనత. OTT, స్ట్రీమింగ్, మ్యూజిక్ రైట్స్ కలిపి ₹200 కోట్లకు పైగా డీల్. బ్రాండ్ వాల్యూ కూడా డబుల్ అయింది – యష్ ఇప్పుడు ₹10 కోట్ల పైగా ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ స్థాయిలో ప్రెస్టీజియస్‌గా మారిన తరువాత, 'టాక్సిక్' ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు తలెత్తడం సహజం. కానీ వాటిని తట్టుకోవడమే అసలైన సవాలు.
ఇప్పుడు ‘యష్’ అంటే: మాస్ + మాడ్ లుక్, యాక్షన్ + ఎమోషన్ కలయిక, స్టైల్ + సబ్‌స్టెన్స్ మిక్స్, ఎలివేటెడ్ డైలాగ్స్, హెవీ బీజీమ్
ఈ డిఫినిషన్‌కు ఏమాత్రం తగ్గినా, అభిమానుల్లో "ఇది యష్ సినిమా ఎలా?" అన్న అనుమానాలు మొదలవుతాయి. అది ఇప్పుడు టాక్సిక్ ఎదుర్కొంటున్న అసలు ఇబ్బంది ఇదే. ఓ సౌత్ ట్రేడ్ ట్రాకర్ ఎనాలిసిస్ట్ చెప్తున్నట్లు .. టాక్సిక్ అనేది ఓ సినిమా కాదు. అదో ప్రెజర్ వాల్వ్. అది వర్కవుట్ కాకపోతే, బ్రాండ్ దెబ్బతింటుంది, ఆ దెబ్బ యష్ కు మాత్రమే కాదు, ప్యాన్ ఇండియా స్టార్డమ్ కు కూడా తగులుతుంది.
KGF మాస్ ఇమేజ్‌తో స్టార్ అయిపోయిన యష్, ఇప్పుడు అదే ఇమేజ్‌ను మెయింటైన్ చేయాలంటే — అయన చేసే సినిమా ఓ స్టేట్‌మెంట్ కావాలి. టాక్సిక్ ఆ పని చేయగలుగుతుందా?
అలాగే బిజినెస్ టెర్మ్స్‌లో KGF బ్రాండ్‌కి భరోసా ఉందని, డిస్ట్రిబ్యూటర్లు, OTT ప్లాట్‌ఫామ్స్ ముందుకు వచ్చారు. కానీ టాక్సిక్ విషయంలో OTT ప్రీ రిలీజ్ రేట్లు తక్కువగా ఫిక్స్ అవుతున్నట్లు సమాచారం. హిందీ బెల్ట్ డీల్‌లు నెమ్మదిగా క్లోజ్ అవుతున్నాయి. థియేట్రికల్ అడ్వాన్స్‌లు ఫైనల్ కావాల్సిన స్టేజ్‌లో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ సమస్యలే.
అలాగే ఈ సినిమా ద్వారా యష్ బ్రాండెడ్ ఫార్ములా కంటే కంటెంట్‌ను ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సినిమాటిక్‌గా చేస్తున్న ఓ సాహసం.
వాస్తవానికి “టాక్సిక్ ఫెయిల్ అయితే... కేవలం ఓ సినిమా ఫెయిలవదు. అది యష్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ మాస్ మాస్క్ మీదే ప్రశ్నలు రేపుతుంది. యష్ కు మార్కెట్ స్లో అవుతుంది. తక్కువ బడ్జెట్‌లో గేమ్ ప్లాన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. బ్రాండ్ వాల్యూ మళ్ళీ కొత్తగా రీకన్ స్ట్రిక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
అదే టాక్సిక్ హిట్ అయితే: యష్‌కు ఫ్రీడమ్ వస్తుంది – విభిన్న జానర్లలో ప్రయోగాలు చేయడానికి. కొత్త డైరెక్టర్లకు డోర్ ఓపెన్ అవుతుంది – పాన్ ఇండియా స్కేల్ మీద. ట్రేడ్ లో ‘KGF తర్వాత కూడా అదే స్దాయిని కొనసాగిస్తూ సక్సెస్ ని డెలివరీ చేయగలడు’ అనే నమ్మకం వస్తుంది
టాక్సిక్ అనే సినిమా కాదు, యష్ కెరీర్‌కి లిట్మస్ టెస్ట్!
KGF విన్నింగ్ స్ట్రీక్‌ని నిలబెట్టుకోవాలంటే, ‘టాక్సిక్’ సాధారణ హిట్ కాకూడదు. అది సిగ్నేచర్ స్టేట్‌మెంట్ అవ్వాలి. అవతల అభిమానుల అంచనాలు, ఇటు బిజినెస్ ఫ్రెషర్స్… మధ్యలో యష్ తాను ఏం నిరూపించబోతున్నాడన్నది చూడాల్సిన అంశం. "When a star becomes a symbol, every move becomes a message." అనేది నిజం
ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, యష్ ఈ సినిమా మీద చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారట. KGF తర్వాత వచ్చిన బజ్‌ను నిలబెట్టుకోవాలంటే కేవలం మాస్‌గా ఉండటం సరిపోదు – ఇంటెలిజెంట్ స్టోరీటెల్లింగ్ + స్కేల్ అవసరమని ఆయనకు బాగా అర్థమైందని టాక్. అందుకే టాక్సిక్ స్క్రిప్ట్ మీద చాలా పర్సనల్‌గా ఇన్వాల్వయ్యారట.
రాకింగ్ స్టార్, కేజీఎఫ్ ఫేమ్ యష్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం తో సహా పలు భారతీయ, అంతర్జాతీయ భాషల్లోకి డబ్ కానుంది. ఈ ప్రాజెక్టుకి అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
జాన్ విక్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీలకు పని చేసిన జేజే పెర్రీ యాక్షన్ సీక్వెన్స్‌లకు గ్లోబల్ ఆడియెన్స్ ఫిదా అవుతరాని మేకర్స్ చెబుతున్నారు. అంతే కాకుండా రీసెంట్‌గా డ్యూన్ పార్ట్ 2 విజువల్ ఎఫెక్ట్స్‌కి గానూ బాఫ్టా ఫిల్మ్ అవార్డుని అందుకున్న డినెగ్ ఈ మూవీకి విజువల్ ఎఫెక్ట్స్‌ను అందిస్తున్నారు.