మురుగదాస్ ‘మదరాసి’ రివ్యూ
ఫస్ట్ హాఫ్ థ్రిల్, సెకండ్ హాఫ్ ఫెయిల్;
తమిళనాడులో గన్ కల్చర్ ని విస్తరించి కోట్ల రూపాయాలు దోచుకోవాలనే ఓ సిండికేట్ ప్లాన్ చేస్తుంది. దాని కోసం ఇద్దరు డేంజరస్ బ్రదర్స్ లాంటి ఫ్రెండ్స్ – విరాట్ (విద్యుత్ జమ్వాల్), చిరాగ్ (షబీర్ కల్లరక్కల్) – ని రంగంలోకి దింపుతారు. ట్రక్కులకన్నా ఎక్కువ ఆయుధాలు రవాణా అవుతూ ఓ ఫ్యాక్టరీకి చేరుతుంటే, ఆ గేమ్ ఎన్.ఐ.ఏకి పసిగడుతుంది.
ఎన్.ఐ.ఏకి సారథ్యం వహిస్తున్న ప్రేమ్‌నాథ్ (బిజు మోహన్) వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆపలేకపోతాడు. దాంతో అన్ని రకాలుగా ప్రయత్నించగా, చివరి దశలో ఒకే ఒక ఆప్షన్ కనపడుతుంది – గన్స్ నిల్వ ఉన్న ఫ్యాక్టరీని బాంబులతో పేల్చేయడం!
అయితే ఈ ఆపరేషన్ అంత సులభం కాదు. ఎవరో ఒకరి ప్రాణం పణంగా పెట్టాల్సిందే. అదే సమయంలో హార్ట్‌బ్రేక్‌తో సూసైడ్ ట్రై చేసిన రఘురామ్ (శివకార్తికేయన్) హాస్పిటల్‌లో కనపడతాడు. అతన్ని కలిసిన ప్రేమ్‌నాథ్, “లైఫ్‌కి విలువే లేని వాడిని మిషన్‌లోకి తెచ్చేస్తే?” అని ప్లాన్ వేస్తాడు. రఘురామ్ ని ఒప్పిస్తాడు.
ప్రేమ్ సూచనలతో ...రఘురామ్ గన్స్ గోదాములోకి ఎంటర్ అయ్యి, విరాట్‌ని గన్‌తో షూట్ చేస్తాడు. కానీ ఆ ఒక్క బుల్లెట్‌తో అన్నీ తలకిందులవుతాయి. తమ ప్లాన్ కు అడ్డు వచ్చాడని మండిపడ్డ చిరాగ్... రఘురామ్ ని, మాలతిని (రుక్మిణి వసంత్) వేటాడటం మొదలుపెడతాడు. ఇప్పుడు రఘు రామ్ ఏం చేస్తాడు...?
ఒకప్పుడు సూసైడ్ చేసుకుని తన ప్రాణాలే తీసుకోవటానికి సిద్దపడ్డ రఘురామ్, ఇప్పుడు మాలతి కోసం మాఫియా గన్స్‌కి ఎందుకు ఎదురెదురుగా నిలబడి పోరాడతాడు? అసలు రఘు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు? మాలతితో అతని బంధం ఏమిటి? చివరకు ఎన్.ఐ.ఏకి చీఫ్ ప్రేమ్‌నాథ్ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా లేదా? సూసైడ్ ట్రైచేసి చివరిక్షణాలు దాకా వెళ్లినవాడు... యాక్షన్ హీరోగా ఎలా మారాడు?అనేది మిగతా కథ.
విశ్లేషణ
“In the first act, you hook the audience. In the second, you raise the stakes.” – Robert McKee
సాధారణంగా మురుగదాస్ సినిమాలు ఇవే ఫాలో అవుతూంటాయి – ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, ప్యాక్డ్ కమర్షియల్ ఎలిమెంట్స్, ఆఖరికి ఓ సోషల్ మెసేజ్. అదే ఫార్మాట్ మదరాసి లో కూడా కనబడుతుంది. అయితే ఎందుకు ఆకట్టుకోలేకపోయింది?
టైటిల్ లో చెప్పినట్టుగానే, సినిమా మొత్తం మద్రాస్ (చెన్నై) లోనే సెటప్. ప్రిమైస్ లో ఇంట్రిగ్రిటి ఉంది. నిజానికి, ఫస్ట్ హాఫ్ ని మురుగదాస్ కాస్త ఇంట్రస్టింగ్ గా హ్యాండిల్ చేశాడు. శివకార్తికేయన్ – రుక్మిణి వసంత్ రొమాన్స్, NIA ఆపరేషన్ కలయిక ఎంగేజింగ్‌గా అనిపించే కొన్ని స్ట్రెచెస్ తో నడిపాడు. కానీ సెకండాఫ్ కు వెళ్లే సరికి కథ ఎటువంటి మలుపు తిరగదు..యాక్షన్..యాక్షన్ అన్నట్లు జరుగుతూనే ఉంటుంది.
అలాగే విలన్ ట్రాక్ మొదట బలంగా అనిపించినా, తర్వాత పాత బాటలో నడవటం ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ రీ-రైటింగ్ కంటే రీ-యూజ్ ఎక్కువగా కనబడింది. మురుగదాస్ మునుపటి బ్లాక్‌బస్టర్స్ తుపాకి, గజనీల హాంగోవర్ ఎక్కువగా ఈ సినిమాలో కనిపిస్తుంది. కానీ వాటి ఇంపాక్ట్ మాత్రం రాకపోవడం ప్రధాన లోపం. దాంతో కథ రిపిటేటివ్ యాక్షన్, పాత ఫార్ములా బాటలో తిరుగుతూ కంట్రోల్ కోల్పోతుంది.
హీరో సైకాలజీ యాంగిల్
ఇక గజనీ తరహాలో ఈ సారి మురగదాస్ ..తన హీరో క్యారెక్టర్ కి ఫ్రెగోలీ డిల్యూషన్ (భూతకాల ట్రామా వల్ల కలిగిన సైకాలజికల్ డిజార్డర్) ని యాడ్ చేశాడు. ఇది అతన్ని compulsive do-gooder గా మలుస్తుంది. ఈ లేయర్ కొత్తదనాన్ని తెస్తున్నా, స్టోరీ స్ట్రక్చర్ మాత్రం మురుగదాస్ పాత సినిమాల ఫార్ములా లాగ మార్చేసింది.
ఫస్ట్ హాఫ్ vs సెకండ్ హాఫ్
ఫస్ట్ అవర్ వాచ్‌బుల్‌గా ఉంటుంది. కానీ ఇంటర్వెల్ తర్వాతే సమస్యలు మొదలవుతాయి. కథ అక్కడక్కడే తిరుగుతున్నట్టు, సీన్స్ రిపీట్ అవుతున్నట్టు, థ్రిల్ తగ్గిపోతుంది. సెకండ్ హాఫ్ లో చాలా సన్నివేశాలు కట్ చేయాల్సినవే అని అనిపిస్తుంది.
సోషల్ మెసేజ్ vs పాలిటిక్స్
“తమిళనాడు మాత్రమే గన్ కల్చర్ నుంచి ఫ్రీ” అన్న క్లైమ్ కాన్ట్రైవ్డ్, బలవంతంగా పాలిటికల్‌గా అనిపిస్తుంది. ఐరనిక్ ఏమిటంటే – ఇదే మురుగదాస్ తన తుపాకీ లాంటి సినిమాల్లో గన్ కల్చర్‌ని సెలబ్రేట్ చేశాడు.
కాస్ట్ అండ్ పెర్ఫార్మెన్స్ రివ్యూ – ఎవరు షో స్టీల్ చేశారు ?
రఘురామ్ పాత్రలో శివకార్తికేయన్ ఫుల్ డిజార్డర్ వలె యువకుడిగా కనిపిస్తాడు. “ఆత్మహత్య యత్నం చేసిన వ్యక్తి బాధను స్క్రీన్ మీద చూపించడం” అతనికి బాగా వచ్చిందని చెప్పాలి. ఇక మెడికోగా కనిపించిన రుక్మిణి క్యూట్‌కి క్యూబిక్ ఎమోషనల్ షో ఇచ్చింది. విద్యుత్ జమ్వాల్ – విరాట్ గా స్టైలిష్ విలన్‌గా సీన్స్ డామినేట్ చేశాడు. షబీర్ కల్లరక్కల్ ..చిరాగ్ పాత్రలో మెప్పించాడు. బిజు మోహన్ – NIA ఆఫీసర్ గానూ, విక్రాంత్, విమలారామన్, ఇతర సపోర్ట్ క్యారెక్టర్స్ బాగా చేసారు.
టెక్నికల్ గా..
స్మూత్ యాక్షన్ సీక్వెన్స్‌లు , అట్రాక్టివ్ సినిమాటోగ్రఫీతో ఆకట్టుకుంటుంది, కానీ ఎడిటింగ్‌లో కొన్ని చోట్ల మరింత షార్ప్‌గా ఉండాలనిపిస్తుంది.
ఫైనల్ థాట్
మదరాసి చూస్తుంటే మురుగదాస్ తన వింటేజ్ ఫార్మ్ కి దూరంగా ఉన్నట్టే అనిపిస్తుంది. కొన్ని యాక్షన్ బ్లాక్స్, రొమాంటిక్ మూమెంట్స్ పైసా వసూల్ అయినా, మొత్తానికి సినిమా కొత్తదనం కన్నా పాత ఫార్మాట్‌లోనే చిక్కుకుపోయినట్టు అర్దమవుతుంది. ఏదైమైనా మురుగదాస్ ఇటీవల చేసిన ఫ్లాప్స్ కన్నా ఈ సినిమా కొంచెం బెటర్ అనిపిస్తుంది.