రాజమౌళి కొత్త పోస్టర్… సల్మాన్ ఫ్యాన్స్ ఫైర్! పెండెంట్ మిస్టరీ ఏంటి?

మహేష్ బాబు పెండెంట్‌పై నెట్టింట గోల… బజరంగీ భాయిజాన్ కనెక్షన్ నిజమేనా?;

Update: 2025-08-10 00:30 GMT
Click the Play button to listen to article

ఈ డిజిటల్ యుగంలో ఏ పెద్ద సినిమాకైనా ఫస్ట్ లుక్ కానీ, ట్రైలర్ కానీ, టీజర్ కానీ బయటకు వచ్చిందంటే చాలు — వెంటనే “ఇది కాపీ” అని ట్యాగ్ వేసే వాళ్లు రెడీగా ఉంటారు. ఎక్కడో మూలలో రిఫరెన్స్ ఫొటో లేదా సీన్ దొరకగానే స్క్రీన్‌షాట్ పెట్టి కంపారిజన్ మొదలు. ఫిల్మ్ మేకర్స్ ఎంత ఆచితూచి అడుగులు వేసినా, సోషల్ మీడియా కోర్ట్‌లో ‘సాక్ష్యం’ లేకుండా వదిలిపెట్టడం జరగదు. ఇప్పుడు అదే సీన్ రాజమౌళి-మహేష్ బాబు కొత్త సినిమా #SSMB29కి జరుగుతోంది.

‘RRR’తో గ్లోబల్ బ్రాండ్‌గా మారిన రాజమౌళి.. ఈ సారి మహేష్ బాబుతో గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ సెట్ చేస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన మహేశ్ ప్రీలుక్‌ పోస్టర్‌లో rugged లుక్‌లో మహేష్, మెడలో ఒక పెండెంట్..ఇదే సోషల్ మీడియాలో బీభత్సం క్రియేట్ చేసింది.

సల్మాన్ ఫ్యాన్స్ ఆ పెండెంట్‌ను వెంటనే చూసి రచ్చ చేయటం మొదలెట్టారు. ఇంతకీ వీళ్లకి లింకేంటి అంటారా .. “అది మన ‘బజరంగీ భాయిజాన్’ పెండెంట్ కాపీ కాదా?” అని హడావుడి. ఆ సినిమా లో ఆ పెండెంట్‌కు ఉన్న సింబాలిక్ విలువ, ఎమోషనల్ కనెక్ట్ వల్లే ఈ పోలిక తప్పక వస్తుంది. కానీ నిజానికి pendant designs యూనిక్ అనడం కష్టం.. లుక్స్ దగ్గర తేడా లేకపోవచ్చు కానీ అర్థం, కాంటెక్స్ట్ వేరు కావొచ్చు. ఇలాంటివి వేరే సినిమాల్లోనూ, వేరే కల్చర్స్‌లోనూ కనిపిస్తాయి.

రాజమౌళి టీమ్ మాత్రం ఇప్పటివరకూ స్పందించలేదు. బహుశా నవంబర్ 2025లో చెప్పబోయే “never-before-seen reveal” కోసం ఈ సస్పెన్స్ వదిలేస్తారేమో.

డీప్‌గా చూస్తే..ఇది కేవలం ఒక పెండెంట్ స్టోరీ కాదు — ఇది హైప్ బిల్డింగ్‌లో ఒక మాస్టర్ స్ట్రోక్. రాజమౌళి ఎప్పుడూ చిన్న విజువల్ డీటైల్స్‌తోనే పబ్లిక్ డిబేట్ క్రియేట్ చేసి, ఫైనల్ రివీల్‌కి అంచనాలను మాక్సిమమ్ పెంచుతాడు. ‘బాహుబలి’లో శివుడి బాణం, ‘RRR’లో చెట్టు-బైక్ సీన్ లాంటి చిన్న స్నిపెట్లే వరల్డ్‌వైడ్ టాక్ తెచ్చాయి.

అదే స్ట్రాటజీ ఇక్కడా. పెండెంట్ మీద వాదనల మధ్య, అసలు సినిమా గ్లోబల్ స్కేల్, వరల్డ్ బిల్డింగ్, మహేష్ బాబు ఫస్ట్ టైమ్ ఈ తరహా రోల్ — ఇవన్నీ కలిపి #SSMB29ని ఇంటర్నేషనల్ లెవెల్‌లో మళ్లీ “ఇండియా ప్రౌడ్” అనిపించేలా చేస్తాయి. పెండెంట్ ఒక్కటే ఇంత బజ్ క్రియేట్ చేస్తే, అసలు ట్రైలర్ రాగానే సోషల్ మీడియా సునామీ గ్యారెంటీ.

మొత్తం మీద ఈ పెండెంట్ ఎపిసోడ్‌ మనకు రెండు విషయాలు క్లియర్‌గా చెబుతోంది ఒకటి. ఈ డిజిటల్ యుగంలో చిన్న విజువల్ డీటైల్‌ కూడా వైరల్ బుల్లెట్‌లా పని చేస్తుంది. రెండోది, రాజమౌళి లాంటి మాస్టర్ స్టోరీటెల్లర్‌కి, హైప్ క్రియేట్ చేయడం కూడా ఒక ఆర్ట్.

Tags:    

Similar News