నవ్వించే ఫ్యామిలీ కామెడీ: 'కుడుంబాస్థాన్' ఓటీటీ రివ్యూ

ఇంతకీ ఈ సినిమాలో ఏముంది, అసలు కథేంటి, మన వాళ్లు చూడదగినదేనా వంటి విషయాలు చూద్దాం.;

Update: 2025-03-10 11:00 GMT

ఈ మధ్యకాలంలో తమిళంలో మంచి సక్సెస్ అయిన సినిమా 'కుడుంబాస్థాన్'. ఎనిమిది కోట్ల బడ్జెట్ తో తీస్తే 24 కోట్లు తెచ్చి పెట్టింది. ఈ ఏడాది జనవరి 24వ తేదీన విడుదలైంది. వినోత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి రాజేశ్వర్ కలిసామి దర్శకత్వం వహించాడు. మణికందన్ - శాన్వి మేఘన ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా తెలుగులోనూ ఓటిటీ లోకి వచ్చింది. ఇంతకీ ఈ సినిమాలో ఏముంది, అసలు కథేంటి, మన వాళ్లు చూడదగినదేనా వంటి విషయాలు చూద్దాం.

స్టోరీ లైన్

మిడిల్ క్లాస్ కుర్రాడు నవీన్‌ (మణికందన్), నీలా (సాన్వే మేఘన)నుని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కులాంతర వివాహం కావడంతో అటూ, ఇటూ రెండు కుటుంబాలు వ్యతిరేకిస్తాయి. వాళ్లని పట్టించుకోకుండా తాము జీవితంలో ఎదిగి విజయం సాధిస్తామని నవీన్‌, నీలా ప్రతిజ్ఞ చేసి ముందుకు వెళ్తారు. అయితే ఈ కొత్త జంటలో ఇద్దరి కి ఆర్దిక వెసులుబాటు లేదు. ఉద్యోగాలు లేవు. ముందు కుటుంబం నడపాలి. అలాగే ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్న తన భార్యకి ల్యాప్ టాప్ కొనివ్వాలి. అయితే అలాంటి పరిస్థితుల్లోనే నవీన్ జాబ్ పోతుంది.

దాంతో ఉద్యోగం ఎలాగో సెట్ కావటం లేదని బిజినెస్‌ కోసం దొరికినచోట అప్పులు చేస్తాడు నవీన్‌. అటు ఆన్ లైన్ లోనూ, ఇటు తెలిసిఉన్నవాళ్లు దగ్గర అప్పులు అవసరాలు కోసం చేస్తాడు. అయితే అది కలిసి రాదు. అప్పుల వాళ్లు ఒక్కసారిగా వచ్చి మీద పడతారు. అదే సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఇవ్వరు సరికదా రకరకాల సమస్యలతో ఇబ్బంది పెడుతుంటారు. వాటిన్నటినీ నవీన్‌ ఎలా దాటాడు? కులాంతర వివాహం చేసుకున్న నవీన్‌, నీలా చివరివరకూ కలిసే ఉన్నారా? అన్నది కథ.

ఎనాలసిస్

తమ దగ్గర ఉన్న కథని సహజంగా చెప్పాలా లేక సినిమాటిక్ గా చెప్పాలా అనేది ప్రతీ దర్శకుడు,రచయితకీ ప్రతీసారి వచ్చే సందేహమే. అయితే సహజంగా చెప్పడానికి చాలా కథలు కుదరవు. అదే విధంగా కొన్ని కథలు సినిమాటిక్ నేరేషన్ కు లొంగవు. అలాంటి కథే కుటుంబస్థాన్‌. కుటుంబం అనే సంస్థానంలో అనేక కుట్రలు, కుతంత్రాలు,సమస్యలు, రాజీలు, అప్పులు, అవహేళనలు అన్ని ఉంటాయి. వాటిని టచ్ చేస్తూ దర్శకుడు చాలా సింపుల్ వే లో ఈ కథని నేరేట్ చేసారు. ఈ సినిమా ప్రత్యేకత అతి సాధరణమైన పాత్రలు, అత్యంత సహజమైన పరిస్థితులు వీటి మధ్య నడపటమే. కుటుంబంలో శాంతి అనేది నెలకొల్పాలంటే సభ్యుల అందరి సహకారం అవసరం. ఈ కథ చూడటానికి సాదా సీదాగా అనిపించినా , బాగుంది అనిపించటానికి కారణం ఆ నేరేషన్. అలాగే ఫన్ ప్యాక్టర్ సినిమాలో వర్కవుట్ చేయడం. ఎమోషనల్, ఫన్ కలపడంతో ఈ సినిమా చూడదగదినిగా మారింది.

ప్రేమించుకున్న ఇద్దరు జీవితంలో సెటిలైన వారైతే ఏ ఇబ్బందులూ ఉండవు. అదేవారికి ఆర్థికంగా ఏ వెసులుబాటు లేక, ఏ ఉద్యోగం లేకపోతే, మరోలా వారి పరిస్థితులు ఉంటాయి. (kudumbasthan movie review). ఈ సినిమా హీరో ఆత్మాభిమానం కోసం ఉద్యోగం పోగొట్టుకొని, ఇంట్లో అటు తల్లి, ఇటు భార్య మధ్య నలిగిపోతూంటాడు. ఆ కష్టాన్ని ఎంటర్టైన్మెంట్ మిక్స్ చూసి చూపించాడు దర్శకుడు రాజేశ్వర్‌ కలిసామి.

టెక్నికల్ గా

ఇది కలర్ ఫుల్ కమర్షియల్ సినిమా కాదు. అందుకు తగ్గట్లు సుజిత్ సుబ్రహ్మణ్యం ఫొటోగ్రఫీ .. వైశాఖ్ నేపథ్య సంగీతం నడిచాయి. అలాగే కన్నన్ బాలు ఎడిటింగ్ బోర్ కొట్టకుండా స్పీడుగా వెళ్లేలా చేసింది. అయితే మరికాస్త కామెడీ కలిపి ఉంటే బాగుండేది. నటీనటుల్లో అందరూ సహజంగా చేశారు. ‘జై భీమ్’, ‘గుడ్‌నైట్‌’ చిత్రాలతో తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు పరిచయమైన మణికందన్ ఈ సినిమాతో గుర్తుండిపోతాడు.

చూడచ్చా

సినిమా కుటుంబంతో కలిసి చూడదగ్గది. అక్కడక్కడా కాస్త తమిళ అతి కనిపించిన,ఫన్ చివరిదాకా లాక్కెళ్లి పోతుంది. అలాగే సినిమా చివర్లో ఓ ఎమోషనల్ బ్లాక్ ఆకట్టుకుంటుంది. కాబట్టి ఓ సాయింత్రం అందరూ కూర్చుని చూడచ్చు..

ఎక్కడ చూడాలి

ఈ డబ్బింగ్ సినిమా జీ5 ఓటీటీలో తెలుగు ఆడియోలోనూ అందుబాటులో ఉంది.

Tags:    

Similar News