మోహన్ లాల్ 'ఎల్ 2: ఎంపురాన్' రివ్యూ
దీనిని తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉంది, కథేంటి, చూడదగ్గ సినిమానేనా?;
ఆరేళ్ళ క్రితం మోహన్ లాల్ (MohanLal) హీరోగా పృథ్వీరాజ్ (Prithviraj Sukumaran) సుకుమారన్ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న 'లూసిఫర్' మంచి హిట్టైంది. చిరంజీవి ఆ సినిమాను తెలుగులో 'గాడ్ ఫాదర్' పేరుతో రీమేక్ చేశారు. మాతృక స్థాయిలో 'గాడ్ ఫాదర్' లేకపోవడంతో వర్కవుట్ కాలేదు.ఇక ఐదేళ్ల తర్వాత ఇప్పుడు 'లూసిఫర్' సీక్వెల్ గా వచ్చిన 'ఎల్ 2: ఎంపురాన్' గురువారం జనం ముందుకు వచ్చింది. దీనిని తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉంది, కథేంటి, చూడదగ్గ సినిమానేనా?
స్టోరీ లైన్
లూసిఫర్ ఫస్ట్ పార్ట్ మొదలైన చోటు నుంచి ఈ సెకండ్ పార్ట్ మొదలవుతుంది. ఫస్ట్ పార్ట్ లో జతిన్ రాందాస్ (టోవినో థామస్)ను ముఖ్యమంత్రి చేసిన తర్వాత కేరళ వదిలి విదేశాలకు వెళ్లిపోతాడు స్టీఫెన్ నడుంపల్లి అలియాస్ ఖురేషి అబ్రామ్ (మోహన్ లాల్). అయితే ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఐదేళ్లు పూర్తి కాకముందు తండ్రి వారసత్వాన్ని, ఆయన పార్టీని వదిలి కొత్త పార్టీ స్థాపిస్తాడు జతిన్. హిందుత్వ వాది బాబా బజరంగీ (అభిమన్యు సింగ్)తో చేతులు కలుపుతాడు. జతిన్ నిర్ణయాన్ని అక్క ప్రియదర్శిని (మంజు వారియర్) వ్యతిరేకిస్తుంది.
మరో ప్రక్క కేరళ రాష్ట్రాన్ని కాపాడడానికి స్టీఫెన్ నడుంపల్లి మళ్లీ రావాలని చాలా మంది అభిమానులు కోరుకుంటారు. అయితే... ఇరాక్‌లో డ్రగ్ కార్టెల్ మీద జరిగిన దాడిలో స్టీఫెన్ చనిపోయాడని వార్తలు వస్తాయి. అయితే నిజంగా స్టీఫెన్ నడుంపల్లి చనిపోయాడా? మళ్ళీ ఎలా తిరిగి వచ్చాడు. ఆయన కోసం వివిధ దేశాల గూఢచారి సంస్దలు ఎందుకు వెతుకుతున్నాయి. కేరళ తిరిగి వచ్చిన స్టీఫెన్ ఏం చేశాడు. సినిమాలో జాయేద్ మసూద్ (పృథ్వీరాజ్ సుకుమారన్)పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
కేవలం విజువల్స్ ని , ఫాస్ట్ పేసింగ్ ను నమ్ముకుని స్క్రిప్టుని పక్కన పెట్టేసిన సినిమా ఇది. నాన్‌లీనియర్ ఫార్మాట్‌లో వరసపెట్టి ట్రైలర్‌లను కలిపి కుట్టేసిన అనుభూతిని ఇస్తుంది. లూసిఫర్ కు కలిసి వచ్చింది ఎమోషనల్ డెప్త్. ఈ సినిమాలో మిస్సైంది అదే. ఎమోషనల్ మూమెంట్ లేవని చెప్పలేం కానీ అవేమీ అనుకున్న స్థాయిలో పండలేదు. డ్రామా నిలబడనప్పుడు మిగతావన్నీ తేలిపోతాయి. అదే జరిగింది. మురళీ గోపీ స్క్రిప్ట్ లో వచ్చే ఊహించని సంఘటనలు జరగటానికి సరపడ నేపథ్యం సెట్ చేయలేదు.
స్క్రీన్‌ప్లే చాలా సాదా సీదాగా , కొన్ని సంఘటనల కలయికగా తయారు చేసారు. ఏది ఏమైనప్పటికీ, ఇది స్పీడ్ గా సాగే యాక్షన్ చిత్రం కావడంతో క్యారెక్టర్ గ్రోత్ ఆశించలేం కానీ, కథ గ్రోత్ అయినా చూసుకోవాల్సింది. మంజు వారియర్ పోషించిన ప్రియదర్శిని రాందాస్ మినహా, అర్ధవంతమైన ఆర్క్ ఉన్న పాత్ర ఏదీ కనపడదు. L2: ఎంపురాన్ డెప్త్ కంటే విజువల్స్ వైపు మొగ్గు చూపుతుంది. ఎగ్జిక్యూషన్ పరంగా ఇది హైప్‌కు అనుగుణంగా ఉన్నప్పటికీ, చాలా సీన్స్ బలహీనంగా ఉన్నాయి. మరియు కొన్ని మూవ్ మెంట్స్ చాలా డల్ గా , నిస్తేజంగా అనిపించవచ్చు.
టెక్నికల్ గా
L2: ఎంపురాన్ అనేది మలయాళ పరిశ్రమ నుంచి వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్. ప్యాన్ ఇండియా కాదు. ప్యాన్ వరల్డ్ లో కూడా ఈ విజువల్స్ కి వంక పెట్టేలేరు. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ. దీపక్ దేవ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫస్టాఫ్ లో సోసోగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత మాత్రం ది బెస్ట్ ఇచ్చారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ స్పెషల్ మెన్షన్. సినిమా మొదలైన గంట తర్వాత మోహన్ లాల్ ఎంట్రీ అదరగొట్టారు. ఆ సీన్స్ కంపోజ్ చేసిన విధానం బాగుంది. లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ పిక్చర్స్, శ్రీ గోకులం మూవీస్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల్లో..
మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ ఓ రేంజిలో ఉంది. అభిమన్యు సింగ్, మంజు వారియర్, టోవినో థామస్, ఫాజిల్, సూరజ్, కిశోర్ తదితరులంతా తమ అనుభవం రంగరించి పాత్రలను బాగానే పోషించారు.
ఏమి బాగుంది:
వరల్డ్ క్లాస్ విజువల్స్
యాక్షన్ కొరియోగ్రాఫర్
CGI
ఏమి బాగోలేదు:
బోర్ కొట్టించే కథనంలోని లాగ్ లు
హెవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మూడు గంటల నిడివి
చూడచ్చా
మీరు మోహన్ లాల్ వీరాభిమాని అయినా లేదా స్పీడ్ గా సాగే ఫాస్ట్ పేసెడ్ యాక్షన్ మూవీస్ కు అభిమాని అయిన ఈ సినిమా కిక్కు ఇస్తుంది.