సర్వైవల్ థ్రిల్లర్ : నాని 'హిట్ 3' మూవీ రివ్యూ

ఈ క్రమంలో రిలీజైన హిట్ 3 ఎలా ఉంది? హింసనే పూర్తిగా నమ్ముకున్న నాని, సక్సెస్ అందుకున్నాడా రివ్యూలో తెలుసుకుందాం.;

Update: 2025-05-01 07:55 GMT

నాని ప్రారంభమైన రోజు నుంచి ఈ సినిమాపై అంచనాలు పెంచేలా ప్రమోషన్స్ చేసుకుంటూ వచ్చారు. అలాగే రిలీజ్ కు ముందు పిల్లల్ని, సున్నిత మనస్కులని ఈ సినిమాకు రావద్దు అని చెప్పాడు. అయితే ఫ్యామిలీ లో ఎంతో క్రేజ్ ఉన్న నాని.. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా మోస్ట్ వయలెంట్ గా కనిపిస్తూ ఇలా ప్రమోట్ చేయడం చాలా మందిని ఆశ్చర్యంలో పడేసింది. ఈ క్రమంలో రిలీజైన హిట్ 3 ఎలా ఉంది? హింసనే పూర్తిగా నమ్ముకున్న నాని, సక్సెస్ అందుకున్నాడా రివ్యూలో తెలుసుకుందాం. (Hit 3 Movie Review)

కథ:

వైజాగ్ హిట్ టీమ్ లో ఎస్.పి అర్జున్ సర్కార్ (నాని) దేనికీ లొంగడు..ఎవరినీ వదలుడు. చాలా రూత్ లెస్ గా వెళ్తుంటాడు. సమాజంలో క్రిమినల్ అనేవాడు ఉండకూడదు, ఉన్నా వాడు బ్రతకకూడదు అనేది అతని లక్ష్యం. అలా చాలా టఫ్ గా క్రిమినల్స్ కు సవాల్ విసురుతున్న అర్జున్ కి వరస పెట్టి దేశవ్యాప్తంగా జరుగుతున్న హత్యలు గురించి తెలుస్తుంది. అందులో రెండు చోట్ల జరిగిన హత్యలు ఒకేలా ఉండటం ఆశ్చర్యపరుస్తుంది. అనుమానంలో పడేస్తుంది. తనదైన శైలిలో ఇన్విస్టిగేషన్ చేస్తాడు.

ఆ క్రమంలో సి.టీ.కే అనే డార్క్ వెబ్ సైట్ గురించి తెలుస్తోంది. ఆ సైట్ ద్వారా కొన్ని హత్యలు జరుగుతున్నాయని అర్థమవుతుంది. ఆ ఆ సైట్ చాలా డేంజర్ అని, దాని ద్వారా సైకో కిల్లర్స్ వరుసగా హత్యలు చేస్తున్నారని అర్జున్ గుర్తిస్తున్నారు. అలా సైకో కిల్లర్స్ పోలీసులకు సవాల్ విసురుతున్నారని అర్థం చేసుకుంటారు. దేశవ్యాప్తంగా అప్పటికే 13 హత్యలు జరుగుతాయి.

అప్పుడు ఆ కేసులోకి అర్జున్ సర్కార్ ఓ సైకో కిల్లర్ గా వస్తాడు. అప్పుడు ఏమైంది. ఇంతకీ, ఆ డార్క్ వెబ్ సైట్ రన్ చేస్తున్న సైకో కిల్లర్ ఎవరో ఎలా తెలుసుకున్నాడు ?, ఆ సైకో కిల్లర్ మోటో ఏంటి ?, చివరకు ఆ కిల్లర్స్ ను అర్జున్ సర్కార్ ఎలా అంతం చేశాడు ? ఈ మధ్యలో అర్జున్ జీవితంలోకి ప్రేమ పేరుతో వచ్చిన మృదుల (శ్రీనిధి శెట్టి) ఎవరు?, ఆమె ఎందుకు అర్జున్ సర్కార్ లైఫ్ లోకి వస్తుంది ?, అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

అర్జున్ సర్కార్ ఓ పోలీస్ కాదు, క్రిమినల్ అని.. అతనిపై చర్యలు తీసుకోవాలి అంటూ కోర్టు, కేసుల హడావుడితో సినిమా మొదలవుతుంది. జైలులో అడుగుపెట్టిన అర్జున్.. అక్కడ తోటి ఖైదీలతో తాను జైలుకి ఎందుకు వచ్చాడో చెప్పుకోవడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయిన సర్కార్.. సైకో కిల్లర్ తరహాలో హత్యలు ఎందుకు చేస్తున్నాడు అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది.

ఆ తర్వాత అసలు అర్జున్ ఇలా ఎందుకు చేస్తున్నాడో రివీల్ అవుతుంది. అలా స్క్రీన్ ప్లేని కాస్త క్యూరియాసిటీ కలిగేలా డిజైన్ చేశారు. సైకోల మధ్యలోకి సైకో లాంటి పోలీస్ ఎంటరైతే ఎలా ఉంటుంది? అనేలా సెకండాఫ్ నడిపారు. అయితే ఫస్టాఫ్ లో హీరో గురించి చెప్పే సీన్స్ ,ఆ క్రమంలో వచ్చే కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ ఎపిసోడ్ లాగుతున్నట్లు అనిపిస్తాయి. ప్రీ ఇంటర్వెల్ లో సర్దుకుని ముందుకు వెళ్తారు. అలాగే సెకండాఫ్ ఎక్కువ శాతం ఒకటే ప్లేస్ లో జరుగుతుంది.

సాధారణంగా ఇన్విస్టిగేషన్ డ్రామాలు ‘ క్రైమ్ ఎవరు చేశారు?’ అనే పాయింట్ ని బేస్ చేసుకుని ముందుకు వెళ్తాయి. కానీ ఈ కథ మాత్రం ‘ఆ క్రైమ్ ని ఇప్పుడు ఎవరు,ఎలా ఆపుతారు?’ అనే యాంగిల్ లో నడుస్తుంది. నిజానికి ఇది మరింత ఇంటెన్స్ కలిగించే ప్యాట్రన్.

ఈ సినిమాలో స్టైల్ ఉంది, సబ్‌స్టెన్స్ తక్కువైంది. ఇంతవరకు వచ్చిన HIT సిరీస్ లో ‘ఇన్వెస్టిగేషన్’ కి ప్రాముఖ్యత ఎక్కువగా ఉండేది. ఓ నేరం జరుగుతుంది, ఆ తర్వాత దాన్ని ఛేదించడం లో పోలీసుల పాత్ర కీలకం అవుతుంది. కానీ HIT 3 మాత్రం దానికి భిన్నంగా, బోల్డ్‌గా వెళ్లింది. ఇందులో కేసులు ఛేదించడానికంటే, హీరో క్రైమ్ నెట్వర్క్‌లోకి వెళ్లి వారిని మట్టికరిపించడమే ప్రధాన ఎలిమెంట్.

దాంతో ఇన్వెస్టిగేటివ్ డెప్త్ ఈసారి తక్కువైంది. అందుకు బదులుగా మాస్ యాక్షన్, థ్రిల్స్ ఎక్కువ . కథలో ఫ్యామిలీ, రొమాన్స్ లాంటి ట్రాక్‌లు కూడా ఉన్నాయి. కానీ అవి స్క్రీన్ టైమ్ పరంగా చాలా తక్కువ. సముద్రఖని, నానిల మధ్య వచ్చే తండ్రి-కొడుకు సన్నివేశాలు బాగున్నాయి, ఫన్ కూడా ఉంది. కానీ అసలైన హైలైట్ – నాని మాట్లాడే మాస్ డైలాగ్స్. గన్ను నుండి బుల్లెట్లు వచ్చినట్లు వస్తాయి. వాటిలో ఉన్న బోల్డ్‌నెస్, బూతు పదాలు కొంత ఇబ్బంది అనిపించినా, యూత్‌కు రీచ్ అవుతాయనే ఆశ మేకర్స్ లో కనపడుతోంది.

సెకండ్ హాఫ్ లో కథ అసలు డెప్త్ గా వెళ్ళింది. అక్కడ సీన్స్ Squid Game ని గుర్తు చేస్తాయి. క్లైమాక్స్ లో అయితే సర్ప్రైజ్ ఎంట్రీతో మరో ఇద్దరు హీరోలు రావడం – ఫ్రంట్ బెన్ చర్ల పండుగ.

ఇక నెగటివ్ విషయానికొస్తే – కథలో కొత్తదనం లేదు. రన్ టైమ్ కూడా కాస్త లెంగ్తీగా అనిపిస్తుంది. అయితే, Squid Game, Kill Bill, John Wick లాంటి సినిమాల నుంచి క్లియర్ గా ఇన్స్పైర్ అయినట్లు అర్థమవుతోంది.

టెక్నికల్‌గా చూసినప్పుడు

సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ కథ టోన్‌కు తగినట్టే ఉన్నాయి. Squid Game తరహా ఆర్ట్ డిజైన్‌లను బాగా క్యాప్చర్ చేశారు. డైరెక్టర్ శైలేష్ కొలను తన వైద్యవృత్తి నేపథ్యాన్ని ఉపయోగించి, కథలో కొన్ని మెడికల్ ఎలిమెంట్స్ బాగా కలిపారు. చాలా వరకూ వయలెన్స్‌ తో నింపేసినా దాన్ని ‘న్యాయమైన’ది అనిపించేలా చూపించారు.

మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంది కానీ. కానీ మెమరబుల్ అనిపించదు. నిర్మాణంగా చూసుకుంటే స్వంత బ్యానర్ తో కలసొచ్చిన ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు గ్రాండ్ లుక్ ఇచ్చాయి. కానీ మధ్య మధ్యలో కథ పట్టు తప్పినట్టు అనిపిస్తుంది. కొన్ని చోట్ల డ్రాగ్ అయిందన్న ఫీల్ వస్తుంది.

నటీనటుల్లో ..

నాని పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పాత్రలో పూర్తిగా లీనమై, ఆ పాత్రే అయిపోయాడు. సినిమా మొత్తం మీద అదే అసలైన డ్రైవింగ్ ఫోర్స్ నాని నే. శ్రీనిధి శెట్టి పాత్ర తక్కువగానే మిగిలింది. ఆమెకు పెద్దగా చేయడానికి ఏం లేదు.విలన్ బిల్డప్ బాగుంది, కానీ ఆ క్యారెక్టరైజేషన్ మాత్రం పక్కాగా రాలేదు. మిగిలిన సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా అంతగా గుర్తుండిపోయేలా లేరు. మొత్తంగా చూస్తే – ఇది నాని మోసిన సినిమా.

ఫైనల్ థాట్ :

ఫైనల్ గా, HIT: థర్డ్ కేస్ నానిని కొత్తగా , ఫ్యామిలీ ఆడియన్స్ అనే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేసింది. నాని చాలా ఈజ్ తో ఈ సినిమా చేసేసాడు.

ఈ చిత్రం స్క్విడ్ గేమ్ నుండి ఇన్స్పైర్ అయినా, కొత్తగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ సోసోగా వెళ్లిపోయినా సెకండాఫ్ లో అసలు విషయం అంతా ఉంది. కాకపోతే ఇంకాస్త బాగా చేయాల్సిన సినిమా. హింస ఎక్కువగా ఉందని ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఫ్యామిలీలకు కష్టమే.

చూడచ్చా

వయలెన్స్ తో కూడిన క్రైమ్ థ్రిల్లర్ ను ఇష్టపడే వారికి హిట్ 3 నచ్చుతుంది

Tags:    

Similar News