ప్రముఖ నటి బి సరోజా దేవీ మృతి
పలు భారతీయ భాషల్లో ఆమె 200 చిత్రాలలో నటించారు. ఆమె తెలుగు చిత్రాలు శ్రీకృష్ణార్జున యుద్ధం, పాండురంగ మహాత్మ్యం, ఆత్మబలం, , దాగుడుమూతలు, భాగ్య చక్రం మర్చిపోలేనవి;
అశేష ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ప్రముఖ నటి బి. సరోజా దేవి(87) ఇక లేరు. ఆమె ఈ రోజు బెంగుళూరులోని మల్లేశ్వరంలో తన సొంత ఇంటిలో మృతి చెందారు.
తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో ఒకప్పుడు వెండితెరను ఏలిక హీరోయిన్ బి. సరోజా దేవి. తమిళ, కన్నడ భాషలతో పోల్చితే తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఇక్కడ కూడా బాగా పాపులర్ ఆమె. తెలుగులో ఈమె నటించిన సినిమాలు.. శ్రీకృష్ణార్జున యుద్ధం, పాండురంగ మహాత్మ్యం, ఆత్మబలం, మంచిచెడు, దాగుడు మూతలు, భాగ్య చక్రం వంటి సినిమాల్లో ఆమె నటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోతుంది.తన 50 సంవత్సరాల నటజీవితంలో చిత్రసీమ దిగ్గజాలు శివాజీ గణశన్, ఎన్టీఆర్, ఎఎన్నార్, ఎంజీఆర్,డాక్టర జేంద్ర కుమార్ వంటి వారితో ఆమె నటించారు.
ఆమెకు అభినయ సరస్వతి అనే పేరుంది. నిజానికి ఒక దశలో ఆమె సినిమాల్లో నటించడం మానేయాలనుకున్నారు.మా ఆనిర్ణయం మార్చకోవడం వెనక దిలీప్ కుమార్ ఉన్నారని ఆమె ఒక దశలో చెప్పేవారు. అదెలా జరిగిందంటే... కుటుంబం బాగా ఆర్థిక సమస్యల్లోఉన్నపుడు 1967లో ఆమెకు భారత్ ఎలెక్ట్రానిక్స్ లో పనిచేస్తున్న శ్రీ హర్ష అనే ఇంజనీర్ తో వివాహయింది. ఇక ఆమె సినిమాలు మానేస్తారని భావించారు. ఆమె తల్లి కూడా సరోజాదేవి సినిమాల్లో నటించేందుకు అంగీకరించడం లేదు. ఈదశంలో రాజేష్ కన్నా ఆమె భర్తకు దిలీప్ కుమార్ సైరాబాను చేసిన సలహా ని గుర్తు చేశారు. వివాహయ్యాక సినిమాలు మానేయ నవసరం లేదని దిలీప్ కుమార్ భార్య సైరా బానుకుచెప్పారు. ఇదెలా జరిగిందో రాజేష్ ఖన్నా శ్రీహర్షకు చెప్పారు. అంతే, ఆయన సరోజాదేవిని ప్రోత్సహించి మళ్లీ సినిమాల్లోకి తీసుకువచ్చారు. ఇలా అండగా ఉన్న శ్రీహర్ష 1986లో చనిపోయారు. ఇది సరోజాదేవిని బాగా క్రుంగ దీసింది. దాదాపు ఒక ఏడాది ఆమె సినిమాలు మానేయడమే కాదు, ఎవరినికలుసుకోలేదు.
వికిపీడియాప్రకారం బి. సరోజా దేవి జీవితం: ఆమె 1938 జనవరి 7న మైసూర్ రాష్ట్రంలోని బెంగళూరులో ( ఇప్పుడు బెంగళూరు , కర్ణాటక ) ఒక వోక్కలిగ కుటుంబంలో జన్మించారు . ఆమె తండ్రి భైరప్ప మైసూర్‌లో పోలీసు అధికారి, ఆమె తల్లి రుద్రమ్మ గృహిణి. ఆమె వారి నాల్గవ కుమార్తె, భైరప్ప ఆమెను నృత్యం నేర్చుకోవాలని కోరింది, నటనను వృత్తిగా చేపట్టమని ప్రోత్సహించింది. ఒక యువ సరోజా దేవి తన తండ్రితో తరచుగా స్టూడియోలకు వెళ్లేది. ఆమె నృత్యం చేసిన తర్వాత ఆమె వాచిన పాదాలకు సాలంగైలు కట్టి, ఆమె ఉబ్బిన పాదాలకు మసాజ్ చేసేవాడు. ఆమె తల్లి ఆమెకు కఠినమైన డ్రెస్ కోడ్ ఇచ్చింది: స్విమ్‌సూట్‌లు వద్దు, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లు వద్దు, ఆమె తన కెరీర్‌లో మిగిలిన కాలంలో దానిని అనుసరించింది. ఆమె 13 సంవత్సరాల వయస్సులో ఒక కార్యక్రమంలో పాడుతుండగా బిఆర్ కృష్ణమూర్తి ఆమెను మొదటిసారి గుర్తించారు, కానీ ఆమె ఆ సినిమా ఆఫర్‌ను తిరస్కరించింది.
ఆమె కన్నడ సినిమా చరిత్రలో తొలి మహిళా సూపర్ స్టార్ గా కూడా ప్రసిద్ధి చెందింది. 17 సంవత్సరాల వయసులో, సరోజా దేవి తన కన్నడ సినిమా మహాకవి కాళిదాస (1955) తో పెద్ద విజయాన్ని సాధించింది. తెలుగు సినిమా రంగంలో, ఆమె పాండురంగ మహత్యం (1957) తో అరంగేట్రం చేసింది. 1970ల చివరి వరకు అనేక విజయవంతమైన చిత్రాలలో నటించింది. తమిళ సినిమా నాడోడి మన్నన్ (1958) ఆమెను తమిళ సినిమాలలో అగ్ర నటీమణులలో ఒకరిగా చేసింది. 1967లో ఆమె వివాహం తర్వాత, ఆమె 1974 వరకు తమిళ చిత్రాలలో రెండవ డిమాండ్ ఉన్న నటిగా కొనసాగింది, కానీ ఆమె 1958 నుండి 1980ల వరకు తెలుగు, కన్నడ సినిమాల్లో అగ్ర నటీమణులలో ఒకరిగా కొనసాగింది, ఆమె 1960ల మధ్యకాలం వరకు, పైఘం (1959) తో ప్రారంభించి హిందీ చిత్రాలలో కూడా నటించింది.
1955, 1984 మధ్య 29 సంవత్సరాలలో వరుసగా 161 చిత్రాలలో ప్రధాన కథానాయికగా నటించిన ఏకైక భారతీయ నటి ఆమె. సరోజా దేవి 1969లో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మశ్రీ, 1992లో భారత ప్రభుత్వం నుండి మూడవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్‌ను , బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ను, తమిళనాడు నుండి కలైమామణి అవార్డును అందుకున్నారు.