“ఓజీ” తో పవన్ బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తాడో లేదో

ఇది అభిమానుల సెలబ్రేషన్!!

Update: 2025-09-22 13:32 GMT

బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని హైప్ క్రియేట్ చేస్తూ రిలీజ్ కి సిద్ధం అవుతున్న టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ఓజీ(The Call Him OG) సినిమా అఫీషియల్ ట్రైలర్ ను ఊరించి ఊరించి ఎట్టకేలకు రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఇప్పటిదాకా సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసే పనిలో పడింది. పవన్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో పవర్ స్టార్ ని చూడాలి అనుకుంటున్న వింటేజ్ లుక్ అండ్ స్వాగ్ తో సుజిత్ చూపించగా ప్రతీ షాట్ కూడా టెక్నికల్ గా చాలా రిచ్ గా ఉండగా టేకింగ్ అండ్ సౌండింగ్ మరో లెవల్ లో మెప్పించాయి. ఈ నేఫధ్యంలో కొత్త డిస్కషన్, కొత్త ఆలోచనలు అభిమానుల మధ్య మొదలయ్యాయి.

పవన్ కళ్యాణ్ సినిమాలకంటే ఆయన వ్యక్తిత్వం చుట్టూ తిరిగే మాస్ మానియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాస్తవానికి, గత కొన్ని ఏళ్లలో ఆయన నటించిన సినిమాలు చాలా వరకు రీమేక్‌లు లేదా పొలిటికల్ అజెండాతో మిళితమైపోయాయి. ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకున్న “అసలు పవన్ స్టైల్” యాక్షన్ సినిమా మాత్రం రావటం లేదు. అయితే అది “ఓజీ”తోనే నెరవేరబోతోందని అనిపిస్తోంది. ముఖ్యంగా ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంచనాలు ఆకాశాన్ని అంటాయి అనేదానికి ఫెరఫెక్ట్ ఎగ్జాంపుల్ గా మారాయి.

 ప్రమోషన్లలోనే పవన్ కొత్త షేడ్

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాని ప్రత్యేకంగా తీసుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ప్రోమో, టీజర్, పోస్టర్ పవన్ మాస్ ఆరాని రీక్రియేట్ చేసింది. అంతేకాదు ఎక్కువగా ప్రమోషన్లలో కనిపించని పవన్, ఈసారి మాత్రం ఓజీ కాస్ట్యూమ్ వేసుకుని స్టేజ్‌పైకి రావడం గేమ్ ఛేంజర్. ఇది ఫ్యాన్స్‌కి కేవలం షాక్ కాదు—“మన హీరో సీరియస్‌గా ఈ సినిమా మీద కట్టుబడి ఉన్నాడు” అనే సిగ్నల్.

ఇంకో లేయర్ ఏమిటంటే… ఆయన జపనీస్ కవిత చదివిన క్షణం. పవన్ ఎప్పుడూ సైలెన్స్‌తో, ఫిలాసఫీతో ఫ్యాన్స్‌కి మెసేజ్ ఇస్తారు. ఆ చిన్నపాటి చర్య కూడా ఆయన ఎంత లోతుగా ఈ సినిమా మీద ఇన్వాల్వ్ అయ్యారో చూపించింది.

సుజీత్ డైరెక్షన్ – పవన్ ఆరా పైనే ఫోకస్

“సాహో” తరువాత భారీ అంచనాలు, విమర్శలు ఎదుర్కొన్న సుజీత్‌కి “ఓజీ” ఒక రీసెట్ లాంటిది. ఈసారి ఆయన గ్యాంబిల్ చేసినది పవన్ మీదే. టీజర్, ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది – కెమెరా ఒక్క క్షణం కూడా పవన్ ఎనర్జీని వదలకుండా పట్టుకునేలా డిజైన్ అయింది. ఇది సాధారణ కథా సినిమా కాదని, పవన్ “స్టైలైజ్డ్ యాక్షన్ పర్సోనా”ని మ్యూజియంలో ఉంచినట్లుగా క్యాప్చర్ చేయడమే ఈ సినిమా ఉద్దేశమని అనిపిస్తోంది.

 రాజకీయాల మధ్య ఒక “మైల్‌స్టోన్ మూవీ”

ఇప్పటికే పవన్ ఎక్కువగా రాజకీయాలకే సమయాన్ని కేటాయిస్తున్నారు. ఆయన భవిష్యత్ ఫిల్మ్ లైన్-అప్ కూడా క్లియర్ కాదు. అంటే “ఓజీ” లాంటి పూర్తి స్థాయి కమర్షియల్ యాక్షన్ డ్రామా ఆయన నుంచి ఇంకోసారి రావడం చాలా అసాధ్యం.

దీంతో “ఓజీ” కేవలం ఒక సినిమా కాదు—ఫ్యాన్స్‌కి ఒక చారిత్రాత్మక మైల్స్‌స్టోన్. ఇది కేవలం బాక్సాఫీస్ నంబర్స్‌కి సంబంధించిన విషయం కాదు; ఇది ఒక తరం అభిమానులు తమ హీరోని చివరిసారిగా అలాంటి ఫుల్ ఫార్మ్‌లో చూసే క్షణం.

 ఫ్యాన్స్ ఎమోషన్ – చివరి పెద్ద వేడుక

పవన్ మానియా ఎప్పుడూ వ్యక్తిగత ఆరాధనతో పాటు, ఒక సాంఘిక కల్చర్ కూడా. “ఓజీ” చుట్టూ ఏర్పడిన క్రేజ్ చూస్తే… ఇది కేవలం ఫిల్మ్ రిలీజ్ కాదు; ఒక తరానికి చెందిన కలెక్టివ్ సెలబ్రేషన్ గా కనిపిస్తోంది. అభిమానులు బహుశా దీన్ని ఆయన చివరి స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా భావిస్తున్నారు. అందుకే “ఏ రిజల్ట్ వచ్చినా… మేము ‘ఓజీ’ని చరిత్రలో లైఫ్‌లైన్‌గా గుర్తుంచుకుంటాం” అని చెబుతున్నారు.

 ట్రేడ్ రిస్క్ వైపు నుంచి చూస్తే బిగ్ బడ్జెట్ గాంబిల్

బడ్జెట్: ₹180-200 కోట్ల మధ్య. డిస్ట్రిబ్యూటర్లు రికార్డ్ రేట్లకు తీసుకున్నారు. ఫలితం బాగోలేకపోతే భారీ నష్టం.

కానీ మార్కెట్ వైపు నుంచి చూస్తే నైజాం, సీడెడ్ ఏరియాల్లో రికార్డ్ బిజినెస్. ఓవర్సీస్‌లో $2 మిలియన్ ప్రీ-సేల్స్ దాటేసింది.

ఇండస్ట్రీ ఎక్స్‌పెక్టేషన్: ఫస్ట్ డే గ్రాస్ ₹95-100 కోట్లు.

కంటెంట్ వర్సెస్ స్టార్ పవర్

డైరెక్టర్ సుజీత్‌పై మిక్స్‌డ్ సెంటిమెంట్ (“సాహో” ఫలితం కారణంగా). కానీ “ఓజీ”లో మొత్తం ఫోకస్ పవన్ ఇమేజ్ మీదే. ట్రేడ్ లెక్కల ప్రకారం, కంటెంట్ మామూలుగానే ఉన్నా ఫ్యాన్ పవర్ బాక్సాఫీస్‌ను మోస్తుంది. ఏదైమైనా ట్రేడ్ దృష్టిలో: ఇది భారీ రిస్క్, కానీ ఫ్యాన్ పవర్ & ఓపెనింగ్స్ వల్ల → సేఫ్ బెట్ అయ్యే అవకాశం.

ఏదైమైనా...

‘ఓజీ’ పవన్ మానియాకు మైల్ స్టోన్ అవుతుందా? లేక ట్రేడ్ ఎక్స్పెక్టేషన్స్‌కి టఫ్ టెస్ట్ అవుతుందా? అన్నది రాబోయే రోజులు నిర్ణయిస్తాయి. కానీ ఒక్క విషయం ఖాయం – ఈ సినిమాతో పవన్ తన అభిమానులకు ఇచ్చిన జ్ఞాపకం ఎప్పటికీ లైఫ్‌లైన్‌గానే నిలిచిపోతుంది.

Tags:    

Similar News