‘భైరవకోన’...బాక్సాఫీస్ దగ్గరమేయిందంటే...

‘మా ఊరు భైరవకోన’ మొదట్లో ఒక సంచలనం సృష్టించింది అన్నింటా. అయితే, ఈ ప్రభావం ఎంతో కాలం నిలవలేదు. ఎందుకు?

Update: 2024-02-22 10:28 GMT

క్రితం శుక్రవారం భాక్సాఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ రిలీజ్ కాలేదు. ఉన్నంతలో కాస్త బజ్ తెచ్చుకన్న చిత్రం సందీప్ కిషన్ హీరోగా, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్..లు హీరోయిన్లుగా వచ్చిన ‘ఊరు పేరు భైరవకోన’.

సోషియో పాంటసీ కావటం, విభిన్నమైన సబ్జెక్టులు డీల్ చేసే వి.ఐ.ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు కావటంతో క్రేజ్ క్రియేట్ అయ్యింది. అలాగే రిలీజ్ కు ముందు ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ మంచి రెస్పాన్స్ లభించింది. ‘నిజమే నే చెబుతున్నా’ అనే పాట చార్ట్ బస్టర్ అవ్వడమే కాకుండా ఈ సినిమా పై ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి కూడా కారణమైంది. అయితే ఎన్ని ఎలా ఉన్నా సినిమాలో సరైన కంటెంట్ ఉండటమే హిట్ ఫ్యాక్టర్ గా మారుతోంది. అలాగే వీకెండ్ లోవేరే సినిమా పోటీ లేకపోవటం కూడా ఈ మూవీకి కలిసొచ్చింది.


రిలీజ్ కి ముందు రోజు వరకు అడ్వాన్స్ బుకింగ్స్ తో దాదాపు కోటి రేంజ్ లో కలెక్షన్స గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంది. ఓపినింగ్స్ చాలా మాస్ సెంటర్లలో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేయగా కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడ్డాయి. ఆ రోజు కొన్ని చోట్ల 70% రేంజ్ లో ఆక్యుపెన్సీ సినిమా కి సొంతం అయ్యింది మంచి ఓపెనింగ్స్ రాబట్టినట్లు అయ్యింది. వీకెండ్ లో పర్వాలేదు అనిపించినా తర్వాత వర్కింగ్ డేస్ లో కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి.

ట్రేడ్ నుంచి అందుతున్న లెక్కలు ప్రకారం టోటల్ గా సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
నైజాం : 2.90 కోట్లు గ్రాస్ 
సీడెడ్ : 67 లక్షలు
 మొత్తం ఆంధ్రా: 3.
మొత్తం ఆంధ్రా- తెలంగాణా కలెక్షన్స్:- 6.58 కోట్లు~(12.౩౦ కోట్లు గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా+ఓవర్ సీస్: 2.04 కోట్లు

మొత్తం ప్రపంచ వ్యాప్త కలెక్షన్స్- 8.62 కోట్లు (16.80 కోట్లు గ్రాస్)
ఫైనల్ గా సినిమా 11 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటివరకూ సాధించిన కలెక్షన్స్ చూస్తే.. ఇంకా 2.38 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.  మరో ప్రక్క సినిమాలకు ఆఫ్ సీజన్ ఎఫెక్ట్ కూడా ఇంపాక్ట్ చూపిస్తూ ఉండటంతో బ్రేక్ ఈవెన్ అవకాశాలు దాదాపు మాయమయ్యినట్లే.  చిత్ర నిర్మాణానికి దాదారు రు. 20 కోట్లు ఖర్చయిందని చెబుతున్నారు. అంటే  బాక్సాఫీస్ దగ్గిర ఫెయిల్ అనే టాక్ నుంచి బయటపడేందుకు ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఈ సినిమా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.

నిఖిల్ తో చేసి 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' తర్వాత వీఐ ఆనంద్ అదే ఫాంటసీ థ్రిల్లర్ జానర్లో రూపొందించిన ఈ సినిమా.. మేకింగ్ కు చాలా కాలం తీసుకోవటం. విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యం.. గరుడపురాణంతో ముడిపడ్డ కథ అంటూ ఊదరకొట్టడంతో బజ్ క్రియేట్ అయ్యింది. దాన్ని కొనసాగిస్తూ రిలీజ్ కు రెండు రోజుల ముందే ప్రీమియర్స్ వేయడంలో మేకర్స్ చూపించిన కాన్ఫిడెన్స్.. సినిమా మీద ఎక్సపెక్టేషషన్స్ భారీగా పెంచాయి. ఆ అంచనాలతో ఎంతో ఊహించుకుని థియేటర్లలో అడుగు పెట్టిన ప్రేక్షకులకు అక్కడ అంతసీన్ లేదని అనిపించింది. అదే మౌత్ టాక్ స్ప్రెడ్ అవటంతో కలెక్షన్స్ పై ఆ ప్రభావం పడింది.
ఆఫ్ సీజన్ ఎఫెక్ట్ 
మరో ప్రక్క క్రితం వారం రిలీజైన మాస్ మహారాజ్ రవితేజ(Raviteja)తాజా చిత్రం ఈగల్(Eagle Movie) రెండు వారాలు పూర్తి చేసుకుంది. వర్కింగ్ డేస్ లో సినిమా భారీగా డౌన్ అయింది. మరో ప్రక్క సినిమాలకు అన్ సీజన్ ఎఫెక్ట్ కూడా ఇంపాక్ట్ చూపిస్తూ ఉండటంతో బ్రేక్ ఈవెన్ అవకాశాలు దాదాపు మాయమయ్యినట్లే. ఈ సినిమాకు నెగిటివ్ టాక్ మార్నింగ్ షోకే స్ప్రెడ్ అవ్వటం, రివ్యూలు అంతంత మాత్రంగా రావటంతో వీకెండ్ వరకూ ఓకే అనుకున్నా తర్వాత డ్రాప్ మొదలంది.

వాస్తవానికి రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ కూడా సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. జనవరి 15న విడుదల ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే అప్పటికే పోటీలో ఉన్న గుంటూరు కారం ,సైంధవ్, హనుమాన్, నాసామి రంగా వంటి సంక్రాంతి సినిమాలను దృష్టిలో పెట్టుకొని సినిమాకు సోలో రిలీజ్ కల్పిస్తామని మాటిచ్చి ‘ఈగల్’ను ఫిబ్రవరి 9కు పోస్ట్‌పోన్ చేయించింది ఫిల్మ్ ఛాంబర్. ఓవైపు ఫిల్మ్ ఛాంబర్.. ‘ఈగల్’కు సోలో రిలీజ్ కల్పిస్తామని మాటిచ్చినా కూడా ‘ఊరు పేరు భైరవకోన’ కూడా అదే రోజు విడుదలను ప్రకటించింది. దీంతో మరోసారి ఫిల్మ్ ఛాంబర్‌లో డిస్కషన్ చేసి ఫిబ్రవరీ 16కు తమ రిలీజ్‌కు పోస్ట్‌పోన్ చేయడానికి ‘ఊరు పేరు భైరవకోన’ రిలీజ్ చేసారు. అయితే ఈ రెండు సినిమాలు అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదనే చెప్పాలి.


Tags:    

Similar News