పవన్ కళ్యాణ్ 'ఓజీ' మూవీ రివ్యూ
మాస్ ఫీస్ట్‌నా? లేక స్టైల్ మాయా?
1990ల ముంబై. సత్యా దాదా (ప్రకాశ్ రాజ్) ఆధీనంలో ఉన్న షిప్ యార్డుకు ఓ భారీ షిప్ చేరుతుంది. ఆ షిప్‌లోని కంటైనర్‌లో విస్ఫోటన శక్తితో నిండిన ఆర్‌డీఎక్స్ ఉంది. దాన్ని పంపింది క్రూరమైన గ్యాంగ్‌స్టర్ ఓమి (ఇమ్రాన్ హష్మీ). ఆ బాంబులు టెర్రరిస్ట్ ల చేతిలో పడితే ముంబై భస్మమైపోతుందని సత్యా దాదాకు తెలుసు. అందుకే అతడు ఆ కంటైనర్‌ని దాచేసాడు. కానీ ఓమీ ఊరుకుంటాడా?
ఆ ఆర్‌డీఎక్స్ కోసం ఓమి స్వయంగా ముంబైలో అడుగుపెడతాడు. సత్యా దాదా గ్యాంగ్‌ని ఒక్కొక్కరిగా వేటాడటం మొదలెట్టాడు. ఈ దాడిని ఆపగలిగేది ఒక్కరే — పదిహేనేళ్ల క్రితం ముంబై వదిలి వెళ్లిపోయిన ఓజెస్ గంభీర అలియాస్ ఓజీ (పవన్ కళ్యాణ్).
అసలు ఓజీ ఎవరు?
సత్యా దాదాకు శిష్యుడిలా, కొడుకులా పెరిగిన వ్యక్తి. కాని ఓ విషాద సంఘటన తర్వాత అతను ముంబై వదిలి వెళ్లిపోయాడు. ఆ తర్వాత సత్యా దాదా తన ఇద్దరు కొడుకులను కోల్పోయాడు. ఇప్పుడు మిగిలింది మనవడు అర్జున్ (అర్జున్ దాస్) మాత్రమే. కానీ అతడు మాత్రం తండ్రి మరణానికి కారణం ఓజీయేనని నమ్ముతూ ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నాడు.
ఇదే సమయంలో ఓమి, ఓజీ రాక కోసం ఎదురుచూస్తున్నాడు. అతడి కోరిక ఒకటే — ఓజీ కళ్ల ముందే ముంబైని రణరంగం చేయడం! ఓజీ తిరిగి వస్తాడా? వస్తే ఏం చేస్తాడు? అసలు సత్యదాదాకి ఓజీకి ఉన్న అనుబంధం ఏమిటి... దాదాని,ముంబై ని ఓజి వదిలి వెళ్లిపోవటానికి కారణం ఏమిటి ఈసారి “ఓజీ” రాక ముంబైని రక్షిస్తుందా? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
పవన్ కళ్యాణ్ వంటి స్టార్ ని ఎలా చూపెడితే అభిమానులకు నచ్చుతుంది అనే పాయింట్ దగ్గరే సినిమా క్లిక్ అవుతుంది. అలాగే సినిమా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే కేవలం ఫ్యాన్స్ మాత్రమే సినిమాలు ఆడవు. అలాగని ఫ్యాన్స్ ని మెప్పించకపోతే అసలు బజ్ కూడా క్రియేట్ కాదు. ఇది నిజంగా కత్తిమీద సాము. అలాగే పవన్ కళ్యాణ్ సినిమా అంటే కథ కోసం ఎవరూ పనిగట్టుకుని రారు. దాంతో కథ కన్నా కథనం, అందులో పవన్ కళ్యాణ్ ని ఎలా ఎలివేట్ చేస్తామన్నదే అతి ముఖ్యమైన అంశం. ఇవే దృష్టిలో పెట్టుకున్నాడు సుజీత్ అనిపిస్తుంది.
ఓజూ సినిమాలో కాన్ఫ్లిక్ట్ చాలా సింపుల్ గా పెట్టుకున్నారు. అలాగే అందుకోసం క్రియేట్ చేసిన ప్రపంచం, ఎస్టాబ్లిష్ చేసిన సెటప్ కొంత కొత్తదనాన్ని ఇచ్చాయనటంలో సందేహం లేదు. కానీ అదే సమయంలో అసలు కథ మాత్రం రొటీన్‌గానే ఉండటమే సమస్యగా మారింది. కథ కోసం జనాలు రారు కానీ కథ ద్వారానే సినిమాని నేరేట్ చేయాలి కదా.
ఫస్టాఫ్ ఇంట్రస్టింగ్ గా మొదలైన కొంత సేపటికే సబ్‌ప్లాట్స్ రావడంతో పేస్ స్లో అయ్యిపోతుంది. లవ్ ట్రాక్, అర్జున్ దాస్ ప్రతీకారం ట్రాక్ రెండూ కూడా కథను గట్టిగా పట్టుకోలేవు. హీరో ఎలివేషన్ సీన్స్ బాగున్నా, వాటి తర్వాత వచ్చే డ్రామా, ఎమోషనల్ సీన్స్ చాలా డల్ గా ఉన్నాయి. ఇతర పాత్రలు హీరోను ఎలివేట్ చేసే సీన్స్ కూడా కొద్దిసేపటికి రిపిటేటివ్‌గా అనిపిస్తాయి. అయినా కూడా ఇంటర్వల్ వరకు మాత్రం హీరోకున్న క్రేజ్, అభిమానుల కనెక్ట్ వలన బాగుందనిపిస్తుంది.
ఇక సెకండాఫ్ లో ఇంటర్వల్ తరువాత వచ్చే ఫస్ట్ సీక్వెన్స్‌కి మంచి హై ఉంది. గంభీరా ముంబైకి తిరిగి వచ్చేదాన్ని చూపిన విధానం, దానికి వెంటనే వచ్చే పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయి. కానీ ఆ హై అక్కడికే పరిమితమైపోతుంది. తర్వాత వచ్చే ఫ్లాష్‌బ్యాక్, బిడ్డ ఎమోషనల్ ట్రాక్ మెల్లిగా సినిమాపై ఇంట్రస్టన్ తగ్గించటంలో సక్సెస్ అయ్యాయి. చాలా సేపు కథ సాగదీసినట్టే అనిపిస్తుంది. అయితే ఈ రెండూ ప్రీ-క్లైమాక్స్‌లో చిన్న ట్విస్ట్‌తో కలిపిన తీరు మాత్రం బాగానే ఉందే అనిపిస్తుంది.
ఇవి చాలదన్నట్లు సుజీత్ సాహో యూనివర్స్ కనెక్షన్, కోబ్రా, డేవిడ్, యాకుజా హెడ్ల పరిచయం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మొదటి నుండి ఫాలో అవని వారికి ఇది కన్ఫ్యూజింగ్‌గా ఉంటుంది. ఫాలో అయ్యేవారికీ కూడా చివర్లో ఇన్ని ఎలిమెంట్స్ పెడటం వల్ల గందరగోళంగా అనిపిస్తుంది.
ఏదైమైనా KGF తర్వాత వస్తున్న మాస్ యాక్షన్ డ్రామాల్లో కనిపించే ప్రభావం OGలో కూడా ఉంది. పోర్ట్ బిజినెస్‌లు, మాఫియా రైవల్రీస్, గ్యాంగ్ వార్స్, రెట్రో లుక్— అన్ని కనిపిస్తాయి. కథ 1940ల జపాన్‌లో మొదలైనా, ఎక్కువ యాక్షన్ 1990ల చివరలోని ముంబైలోనే సెట్ చేసింది అందుకేనేమో అనిపిస్తుంది. కేజీఎఫ్ లాంటి హిట్ కొట్టాలంటే కేజీఎఫ్ ని అనుకరించాలి.
డైరక్టర్ ,మిగతా విభాగాలు
సుజీత్ ఫ్యాన్ సర్వీస్ మోమెంట్స్ క్రాఫ్ట్ చేయడంలో ఎక్సపర్ట్ అనిపించారు. కానీ సినిమాకు కావాల్సిన రైటింగ్ లో కావాల్సిన భావోద్వేగం లోతు లేకపోవడంతో అవి పెద్దగా మన మనస్సుని తాకవు. ఒక్కో సీక్వెన్స్ ఒక్కోటిగా బాగానే అనిపిస్తాయి. కానీ మొత్తం కథలో అవన్నీ కలిసిపడి బలమైన న్యారేటివ్ లేకుండా పోయింది. అయితే సుజీత్... సాహోలో చూపించిన టెక్నికల్ గా తనదైన బలాన్ని మళ్లీ ఇక్కడ ప్రదర్శించాడు. పెద్ద స్కేల్, టెక్నికల్ క్రాఫ్ట్ హ్యాండిల్ చేయడంలో ఆయన నైపుణ్యం స్పష్టంగా కనిపించింది.
సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ మూడీ నోయర్ టోన్స్, స్టైలిష్ విజువల్స్‌తో ఫ్రేమ్స్‌ని గ్యాంగ్‌స్టర్ జానర్‌కి తగ్గట్టుగా తీర్చిదిద్దాడు.
నిజమైన స్టాండౌట్ సంగీత దర్శకుడు థమన్. ఈ సినిమాలో ఆయన తనను తాను కొత్తగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లటమే కాదు, కొన్ని కీలక క్షణాల్లో సినిమాకి ఆక్సిజన్‌లా మారింది, దానికి ఉత్సాహం, జీవం ఇచ్చింది.
నటీనటుల్లో...
గ్యాంగ్‌స్టర్ ఓజస్ గంభీరా పాత్రలో పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో. ఆయన నటన కేవలం ఫ్యాన్స్ కోసమే కాకుండా సాధారణ ప్రేక్షకుడి దృష్టినీ ఆకర్షించేంత రా పవర్, మాగ్నటిక్ ప్రెజెన్స్ చూపించారు.
ఎమ్రాన్ హష్మీ, తన తొలి తెలుగు చిత్రంలో విలన్ గా ఓమి పాత్రలో కనిపించాడు. స్టైలిష్‌గానూ, భయపెట్టేలా కూడా ఉన్న ఆయన విలన్ ప్రెజెన్స్ కథనానికి బలం, అందం రెండూ ఇచ్చింది. కానీ ఇంకాస్త భయపెట్టాలనిపించాలి. అందుకు తగ్గ సీన్స్ లేవు.
ప్రియాంకా మోహన్‌కి ఎక్కువ స్క్రీన్ టైమ్ లేకపోయినా, పవన్ కళ్యాణ్ భార్యగా ఎమోషన్స్ రైజ్ చేసింది. ప్రకాశ్ రాజ్ ఎప్పటిలాగా బాగా చేసారు. అయితే అర్జున్ దాస్ సీన్స్ మాత్రం కలిసి రాలేదు. అక్కడే సినిమా డ్రాప్ అయ్యింది, శ్రీయా రెడ్డి స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అభిమన్యు సింగ్, తేజ్ సప్రూ, సుభలేఖ సుధాకర్ లాంటి నటులు తమ తమ పాత్రల్లో ఇంపాక్ట్ చూపించారు.
అయితే నిజమైన స్టాండౌట్ సంగీత దర్శకుడు థమన్. ఈ సినిమాలో ఆయన తనను తాను కొత్తగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను పెంచడమే కాదు; చాలా చోట్ల అది స్వతంత్ర అనుభూతిలా నిలిచింది. కొన్ని కీలక క్షణాల్లో ఆయన మ్యూజిక్ సినిమా ఆక్సిజన్‌లా మారింది, దానికి ఉత్సాహం, జీవం ఇచ్చింది.
ఎడిటర్ నూలి షార్ప్ కట్స్‌తో కథనం ఎనర్జీని నిలబెట్టాడు. అయితే,సెకండాఫ్ పేస్‌పై మరింత జాగ్రత్తగా చూసి ఉంటే సినిమా ఫ్లో బాగుండేది.
ఫైనల్ థాట్
“OG” ఒక ఫ్యాన్‌బాయ్ సినిమా – ‘by a fan, for the fans’. కానీ గ్యాంగ్‌స్టర్ డ్రామా జానర్‌కి కావాల్సిన ఎమోషనల్ డెప్త్, స్ట్రాంగ్ క్యారక్టర్ ఆర్క్స్ లేకపోవడం వల్ల, ఇది ఒక స్టైలిష్ యాక్షన్ డ్రామాగా కనిపిస్తుంది, కానీ పూర్తి స్థాయి gangster epic కాదు. అయితే థమన్ ఇచ్చిన career-best స్కోర్, సుజీత్ స్టైలిష్ ప్రెజెంటేషన్ సినిమా స్థాయిని ఎలివేట్ చేశాయి.