'ప్రేమలు' సక్సెస్ సీక్రెట్ ఏమిటో తెలుసా?

ఈ వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు ఐదు సినిమాలు వచ్చాయి. వాటిలో ఏది ఏలా ఉందంటే..

Update: 2024-03-19 11:40 GMT
Source: Twitter


ఎప్పటిలాగే ఈ వారం తెలుగులో 5 సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. అనన్య నాగళ్ల నటించిన తంత్ర (Tantra), చైతన్య రావు, భూమిశెట్టి నటించిన షరతులు వర్తిస్తాయి (Sharatulu Varthistayi), రజాకార్ (Razakar), వేయ్ దురువేయ్ (Vey Daruvey), స్వామి నాగులకొండ (Swamy Nagulakonda) చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే వీటిలో ఏదీ సాలిడ్‌గా కలెక్షన్స్ రాబట్టడం లేదు. కేవలం అంతకు ముందు వారం రిలీజైన ప్రేమలు అనే మలయాళ డబ్బింగ్ సినిమాకే జనం జై కొడుతున్నారు. నిజానికి ‘ప్రేమలు’ను మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు కానీ ఈ సినిమా మెల్లిమెల్లిగా పికప్ అవ్వడం మొదలైంది.

తంత్ర

క్షుద్ర శక్తులు. మంత్రాలు, తంత్రాలతో నడిచే ఈ సినిమా 150 పైగా స్కీన్లలో రిలీజ్ అయ్యింది. ఓ వర్గానికి బాగానే నచ్చుతున్న ఈ హారర్ ఫిల్మ్... సొంతంగా రిలీజ్ చేయడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రూ.2 కోట్లుగా వాల్యూ కట్టారు. అయితే అనుకున్న స్దాయిలో పర్ఫార్మ్ చేయకపోయినా నైజాంలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో బాగానే నడుస్తోంది. ఓటీటీ రైట్స్‌తో రికవరీ ఉంటుంది కానీ బ్రేక్ ఈవెన్ కొంచెం కష్టమే అంటున్నారు.

షరతులు వర్తిస్తాయి

మధ్యతరగతి కుటుంబాల కథతో సాగే ఈ సినిమా అంతా తెలంగాణ నేపథ్యంలో సాగుతుంది. చైన్ సిస్టమ్ వంటి బిజినెస్‌తో మిడిల్ క్లాస్ కుటుంబాలు ఎలా మోసపోతాయో చూపించే మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. ఈ సినిమాకు జనం నుంచి వచ్చిన స్పందన అంతంత మాత్రంగానే ఉంది . సోషల్ మీడియాలో కొంత హంగామా కనిపించినా అది టిక్కెట్ల రూపంలో మారడంలేదని తెలుస్తోంది.

రజాకార్

నిజాం 7వ రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో సైన్యాధ్యక్షుడు ఖాసీం రజ్వీ సేనలు దుర్మార్గాలు, హిందువులను ముస్లిం మతంలోకి బలవంతంగా మార్చడం, అలాగే రజ్వీ సేనలు రజాకార్లు సాగించిన దమనకాండను ఆపేందుకు అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సైనిక చర్య నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా టాక్ బాగానే ఉన్నా నైజాంలోనే వర్కవుట్ అవుతోంది. మిగతా ప్రాంతాల్లో కలెక్షన్స్ లేవు.

వేయ్..దరువేయ్ (Vey Daruvey), స్వామి నాగులకొండ (Swamy Nagulakonda) సినిమాలను పట్టించుకున్న వాళ్లే లేరు. ఈ నేపథ్యంలో చిత్రంగా ‘ప్రేమలు’ సినిమా పుంజుకుంది. రిలీజైన తెలుగు సినిమాలు స్లో డౌన్ అయిన చోట ఈ సినిమా యూత్‌ను భారీ లెవల్‌లో థియేటర్స్‌కి రప్పిస్తూ ఇప్పుడు బ్లాక్ బస్టర్ నుండి డబుల్ బ్లాక్ బస్టర్ హిట్‌గా దూసుకు పోతూండటం విశేషం. మొత్తం మీద 10వ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను మించి పోయింది.

10 రోజుల కలెక్షన్స్ చూస్తే...

తెలంగాణా - 2.24cr

ఆంద్రా - 1.81cr

రెండు తెలుగు రాష్ట్రాలు 10 రోజులు

మొత్తం థియేటర్ గ్రాస్ - 07.11cr

రెండు తెలుగు రాష్ట్రాలు 10 రోజులు

మొత్తం థియేటర్ షేర్ - 04.05cr

తెలుగు థియేట్రికల్ షేర్ బ్రేక్ ఈవెన్ - 01.50cr

కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా + ఓవర్ సీస్ - 01.10cr

వరల్డ్ వైడ్ 10 రోజులు

మొత్తం థియేటర్ గ్రాస్ - 09.30cr

వరల్డ్ వైడ్ 10 రోజులు

మొత్తం థియేటర్ షేర్ - 05.15cr

ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ షేర్ బ్రేక్ ఈవెన్ - 02.00cr

టోటల్‌గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ స్టేటస్ అందుకుంది. అందుకు కారణం రాజమౌళి వచ్చి ప్రమోట్ చేయటమే అంటున్నారు. గిరీష్ ఏడీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నస్లెన్ గఫూర్, మమితా బైజు లీడ్ రోల్స్‌లో నటించారు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ సరదా లవ్ స్టోరీ మలయాళ ప్రేక్షకులనే కాదు తెలుగు యువతను కూడా బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాపై మహేష్ బాబు, నాగ చైతన్య, రాజమౌళి లాంటి ప్రముఖులు ప్రశంసలు కురిపించడం కూడా ప్రేమలు బాక్సాఫీస్ సక్సెస్‌కు కారణమైంది.

కొసమెరుపు : ఈ ఊపులో ఇప్పుడు మరో మలయాళ డబ్బింగ్ సినిమా 'మంజుమ్మెల్ బాయ్స్' రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ మూవీ రైట్స్‌ని మైత్రీతో పాటు మెట్రో సురేష్ నిరంజన రెడ్డిల భాగస్వామ్యంలో మలయాళ నిర్మాతలు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మార్చి 29 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో భారీ ఎత్తున విడుద‌ల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు మేక‌ర్స్ అధికారికంగా ఇప్పటికే వెల్లడించారు.



Tags:    

Similar News