సైకో కిల్లర్ కథ 'దక్షిణ' సినిమా రివ్యూ
ఇంతకీ ఈ సినిమా కథేంటి, థియేటర్ లో పెద్దగా వర్కవుట్ కాని ఈ సినిమా ఓటీటీ జనాలకు నచ్చుతుందా చూద్దాం.;
సాధారణంగా సైకో కిల్లర్ చిత్రాలకు కి ఒక టెంప్లెట్ ఉంటుంది. ఒక సైకో… తన సైకో సాటిస్ఫెక్షన్ కోసం ఒక పద్దతి లో హత్యలు చేస్తుంటాడు. తనని పట్టుకోవాలని చూసే వారికి ఛాలెంజ్ లు విసిరి అందులోనే ఆనందం పొందుతాడు. చివరికి చిన్న పొరపాటు చేసి పట్టుబడతాడు. దాదాపు ఇదే టెంప్లెట్ అన్ని చోట్ల కనబడుతుంది. ఈ సినిమా కూడా సైకో కిల్లర్ కాన్సెప్టుతోనే మన ముందుకు వచ్చింది. థియేటర్ లో అక్టోబర్ లోకి వస్తే ఇంతకాలానికి ఓటీటీలోకి దిగింది. ఇంతకీ ఈ సినిమా కథేంటి, థియేటర్ లో పెద్దగా వర్కవుట్ కాని ఈ సినిమా ఓటీటీ జనాలకు నచ్చుతుందా చూద్దాం.
స్టోరీ లైన్
సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ దక్షిణ(సాయి ధన్సిక) కి తన కెరీర్ లో ఓ ఛాలెంజ్ ఎదురౌతుంది . తను పనిచేస్తున్న సిటీలో వరుసగా అమ్మాయిల హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ సైకో కిల్లర్ ఒకరి తర్వాత ఒకరిని కిడ్నాప్ చేసి ఆ అమ్మాయిలను అతి కిరాతకంగా చంపుతూ ఉంటాడు ఓ సైకో. చంపిన వాళ్ళ తలలను బ్యాగులో పెట్టుకుని తీసుకుపోతుంటాడు. ఇక ఈ కేసుని దర్యాప్తు చేయడానికి సాయి ధన్సిక రంగంలోకి దిగుతుంది. ఈ నేపథ్యంలో ఆమె దర్యాప్తు చేసిన విషయాలు ప్రజలకి తెలిపేందుకు ఓ ప్రెస్ మీట్..ను నిర్వహిస్తుంది. ‘ఆ సైకో అమ్మాయిలను కిరాతకంగా చంపుతున్నాడు కానీ.. వాళ్ళని మానభంగం చేయడం లేదు, బహుశా అతను ఇంపార్టెంట్ అయ్యుండొచ్చు’ అంటూ చెబుతుంది.
ఈ క్రమంలో ఆ సైకో అహం దెబ్బ తిని.. ఒకరోజు దక్షిణ ఇంటికి వచ్చి.. ఆమెకు మత్తు మందు ఇచ్చి.. ఆమెను రేప్ చేస్తూ వీడియో తీసి మీడియాకి లీక్ చేస్తాడు. దీంతో దక్షిణ మానసికంగా కుంగిపోయి.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి సిగరెట్లు, మందు వంటి వాటికి బానిసై పోయింది. అయితే ఆ సైకో ఎవరు? ఎందుకు అమ్మాయిల తలల్ని నరికేసి తనతో పాటు తీసుకు వెళ్తుంటాడు? అతని గతం ఏంటి? ఆ దారుణం చేసిన సైకోపై దక్షిణ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంది? ఈ క్రమంలో దక్షిణ ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అనేది మిగిలిన కథ.
ఎలా ఉంది
ఇదో సైకో కిల్లర్ కథ. రెగ్యులర్ సైకో థ్రిల్లర్ టెంప్లెట్ లోనే ఈ కథని రాసుకున్నారు. కథా ,కథనం వస్తే ఫస్ట్ హాఫ్ లో వుండే స్పీడ్ సెకండ్ హాఫ్ లో లోపిస్తుంది. చాలా సీన్స్ రిపీట్ గా సుదీర్ఘంగా సాగుతున్నట్లు అనిపిస్తాయి. ఊహించని విధంగానే క్లైమాక్స్ ఆ తర్వాత ఈ కథ అయిపోతుంది. దాంతో ఓ రొటీన్ సైకో థ్రిల్లర్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. అయితే థ్రిల్లింగ్ గా ఉండాలంటే రొటీన్ గా సీన్స్ రాకపోతే ఎంజాయ్ చేయగలగుతాము. ప్రారంభంలో ఏదో జరగబోతోందనే టెన్షన్ బిల్డప్ చేశారు. కానీ అసలు కథ, హత్యలు మొదలైన తర్వాత మాత్రం చాలా సాదాసీదాగా అనిపిస్తుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో లో స్పీడ్ ఉండదు.
ఇలాంటి కథల్లో సైకో కిల్లర్ ఎలాంటి ఎత్తులు వేస్తాడు, దానికి పైఎత్తు ఎలా ఉంటుందనేది ప్రేక్షకులని ఎంగేజ్ చేస్తుంది. కేసు మొదలైన తర్వాత పోలీస్ లు నిదానంగా విచారించుకుంటూ వెళ్తుంటాడు తప్ప.. ఎక్కడ సీట్ ఎడ్జ్ థ్రిల్స్ వుండవు. కథలో చాలా పాత్రలపై అనుమానం రేకెత్తించడం ఈ జోనర్ సినిమాల్లో కీలకం. అందులో కొంతవరకూ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇంటర్వెల్ ఎపిసోడ్ గ్రిప్పింగ్ గా ఉంది. ఊహించని మలుపులు సినిమాలో ఉన్నాయి. అయితే సెకండాఫ్ ని ఎమోషనల్ గా నడిపించిన కనెక్ట్ చేయేకపోయారు. ఏదైమైనా స్క్రిప్ట్ పై పూర్తిగా దృష్టి పెట్టని ఇలాంటి చిన్న సినిమాలు పెద్దగా ఎంగేజ్ చేయలేవు అని మరోసారి ప్రూవైంది.
టెక్నికల్ గా
ఈ సినిమాలో కథ మూడ్ కి తగ్గ విజువల్స్ క్రియేట్ చేయడంలో టెక్నికల్ టీమ్ చాలా వరకు మంచి పనితీరు కనబరిచింది. డైరక్షన్ లో పెద్దగా చెప్పుకోదగ్గ మెరుపులు అయితే లేవు. సినిమాటోగ్రఫీ ఒక ప్రత్యేక ఆకర్షణ. చాలా సన్నివేశాల్లో లైటింగ్ ఆకట్టుకుంది. డైరెక్టర్ కథని గ్రిప్పింగా చెప్పే ప్రయత్నం చేయలేకపోయారని పిస్తుంది. నేపధ్య సంగీతం బాగుంది. దర్శకుడు క్రైమ్ థ్రిల్లర్ కు సరిపడా కథనే రాసుకున్నాడు. అయితే దాని ఊహకందని మలుపులతో యంగేజింగా ప్రజంట్ చేయడంలో తడబడ్డారు. నిర్మాణ విలువలు డీసెంట్ గా వున్నాయి. నిడివి 1 గంట 45 నిమిషాల లోపే ఉండటం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా చెప్పాలి.
ఇక రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'కబాలి' మూవీలో నటించిన నటి సాయి ధన్సిక (Sai Dhanshika) ఆ సినిమా తర్వాత పెద్దగా కనిపించలేదు.ఆమె లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'దక్షిణ' (Dhakshina) సినిమాగా ఓకే అనిపించినా ఆమె కెరీర్ బూస్ట్ ఇవ్వలేకపోయిందనే చెప్పాలి..
చూడచ్చా
ఏ మాత్రం అంచనాలతో కాకుండా మామూలుగా ఓ కొత్త సినిమా చూద్దామని వెళ్తే మాత్రం నిరాశ ఉండదు. అయితే రక్తపాతం, హింస వున్న డిస్టర్బ్ సినిమా ఇది. ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి ఇది మంచి ఛాయిస్ గా చెప్పుకోవచ్చు.
ఎక్కడుంది
ఓటీటీ ప్లాట్ ఫాం 'లయన్స్‌గేట్ ప్లే' (Lionsgate Play) లో తెలుగులో ఉంది