పుష్పా-2 మరో ఆస్కార్ తెచ్చేనా..?
క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ రెట్టించిన ఉత్సాహంతో 600 కోట్లకు పైగా ఖర్చుతో పుష్ప-2 సిద్ధమవుతోంది. 15 ఆగస్టు 2024న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.
యంగ్ స్టార్ అల్లు అర్జున్, బ్యూటీ క్వీన్ రష్మిక మందన్న, సమంత (స్పెషల్ సాంగ్), ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ కాంబినేషన్‌లో విడులైన పుష్ఫ సినిమా సూపర్ హిట్ మూవీ. అలాగే రెండు జాతీయ అవార్డులను కూడా సాధించింది. ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఇంకేముంది క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ రెట్టించిన ఉత్సాహంతో 600 కోట్లకు పైగా ఖర్చుతో పుష్ప-2 సిద్ధమవుతోంది. 15 ఆగస్టు 2024న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ అవార్డును సాధించిన నేపథ్యంలో పుష్ప-2 చిత్రాన్ని ఆరేంజ్‌లో చిత్రీకరించాలన్న ఛాలెంజింగ్ వర్క్స్‌తో సుకుమార్ బిజీబిజీగా ఉ న్నారు.
పుష్ప సినిమాలో హీరో పుష్పరాజ్... ఎర్రచందనం స్లగ్లర్. అంచెలంచెలుగా ఎదిగి కోట్లకు పడగెత్తుతాడు. పుస్పరాజ్‌కు రాజకీయ ప్రముఖుల అండదండలు దండీగా ఉండటంతో తన వ్యాపార సామ్రాజ్యానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది.
పుష్ప రాజ్ సమాజంలో ఎన్నో అవమానాలను బాధలను ఎదుర్కొని కసితో పెరుగుతాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే ముఠాలో కూలీవాడిగా జీవితాన్ని ప్రారంభించిన పుష్పరాజ్ తన ధైర్యసాహసాలతో ఆ ముఠా నాయకుడు కొండారెడ్డి (అజయ్ ఘోష్)కి పార్టనర్ గా మారతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఎర్రచందనం సిండికేట్ హెడ్ మంగళం శ్రీను (సునీల్)ను ఎదిరించి.. పుష్పరాజ్ తానే సిండికేట్ హెడ్ గా ఎలా మారాడన్నది ఈ చిత్రంలోని కథ. ఈలోగా శ్రీవల్లీని (రష్మిక మందన్న)తో ప్రేమలో పడిన పుష్పరాజ్ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? ఆమెతో పెళ్లి జరిగింది ? ప్రేమ పెళ్లితో పాటే ఎర్రచందనం సిండికేట్‌ను గుప్పిట్లో పెట్టుకున్న పుష్పరాజ్ ని టార్గెట్ చేసే వ్యక్తి ఎవరు? అసలు భన్వర్ సింగ్ షెఖావత్ (ఫహాద్ ఫాజిల్)తో పుష్ప రాజ్ కి వచ్చిన సమస్య ఏమిటి? అన్నదే కథాంశం.
పుష్ప-2లో పుష్సరాజ్ ఓ ప్రముఖ రాజకీయనాయకుడిగా తెరమీదికి వస్తున్నారనేది టాక్.
పుష్ప-1లో కథానాయకుడి పాత్ర, కథా నేపథ్యం, పాత్రల చిత్రీకరణ, నటీనటుల తీరు బాగుందని ప్రశంసలు అందుకున్నా.. కథనం విషయంలో కొద్దిపాటి విమర్శలు మాత్రం తప్పలేదన్నవిమర్శలకు ధీటుగా ఇప్పుడు పుష్ప-2 రూపుదిద్దుకుంటోంది. కధాంశంలో మరింత వేగాన్ని పెంచడంతోపాటు పాత్రమల మధ్య నడిచే సన్నివేశాల ఎమోషన్స్ ఇప్పుడు మరింత మెరుగ్గా తీస్తున్నారు. ఎంచుకున్న కథకు.. పాత్రలను సరిచూసుకోవడం, నేపథ్యాన్ని నేరుగా ప్రజెంట్ చేయడం పుష్ప-2లో కీలకం కానుంది.
ఎర్రచందనం స్మగ్లింగ్ సన్నివేశాలపై పలు విమర్శలు ఎదురైన విషయం తెలిసిందే. అదే స్మగ్లింగ్‌తో పుష్పరాజ్ ఇప్పుడు ఓ గొప్ప రాజకీయ నాయకుడు కాబోతున్నాడు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేసే వ్యక్తిని ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దడంలో క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ ఎలా స్ర్కిప్ట్ సిద్ధం చేస్తున్నారో అన్న సస్పెన్స్ ఇప్పుడుంది.
*ఊ అంటావా మావా.. ఊఊ అంటావా..* పాటతో సిల్వర్ స్క్రీన్ ప్రేక్షకులను కేరింతలు కొట్టించిన పాటలాంటిదే మరొకటి కోసం డైరెక్టర్ సుకుమార్ కసరత్తు చేస్తూ, ఈ సారి ఆపాటలో నటించే హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ పాటలో నటించేందుకు ఇద్దరు హిందీ స్టార్ హీరోయిన్స్ కోసం ప్రయత్నించినా ఫలితం లేదు. ఇక్కడ ఫేమస్ కంటే రెమ్యూనరేషన్ విషయంలోనే తేడాలొచ్చినట్లు గుసగుసలాడుతున్నారు.
పుష్ప-2 లోనూ అదే రొమాంటిక్ సాంగ్ కోసం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు కూరుస్తున్నారు. క్రియేటీవ్ డైరెక్టర్‌గా పిలిచే సుకుమార్ చిత్రాలలో ప్రత్యేకమైన పాటలు ఉంటాయి. అవి క్రేజీ హిట్‌లుగా సినీ ప్రేక్షకులకు కిక్ ఇస్తాయి. పుష్ప తర్వాత అదే సీక్వెల్‌లో ఈ ప్రత్యేక పాట కోసం డైరెక్టర్‌పై ఒత్తిడి చాలా ఎక్కువైంది. మరి ఈ పాటలో అల్లు అర్జున్‌తో ఏ స్టార్ రొమాన్స్ చేస్తారో వేచి చూడాలి. ఇప్పటికే పూర్తైన కొన్ని సన్నివేశాలను రీమేక్ చేస్తున్నట్లు తెలిసింది. పుష్ప-2 కథ లీక్ కావడంతో కథలో పలు ట్విస్టులతో పాటు కథను కూడా మార్చినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ఈసారి కథాంశం చిత్రం రిలీజ్ వరకూ తెలియకూడదని భావిస్తున్నారు డైరెక్టర్ సుకుమార్.
పుష్ప-2 చిత్రం నిర్మాణం 2022 అక్టోబర్‌లో ప్రారంభమైంది. బాక్సాఫీస్ పై భారీ ఆశలతో సిద్ధమవుతోంది. ఒకేసారి దక్షిణాధి భాషలైన తెలుగు, హిందీ, తమిళం, కన్నడతో పాటు మలయాళ భాషల్లో 15 ఆగస్టు 2024న థియేటర్లలో విడుదల చేయనున్నారు.