రాజామౌళికి నచ్చిన 'Tourist Family': ఏముంది ఆ సినిమాలో?

అన్నిటికన్నా ఈ సినిమా మానవత్వం గురించి చెబుతుంది. కానీ ఎక్కడా స్లోగన్స్ ఉండవు.;

Update: 2025-05-21 13:29 GMT

“అద్భుతమైన సినిమా చూశాను. హృదయాన్ని తాకింది. కడుపుబ్బా నవ్వించింది. మొదటి సన్నివేశం నుంచి చివరివరకు ఆసక్తిని పెంచింది. అభిషాన్ గొప్పగా రాశారు, డైరెక్ట్ చేశారు. ఇటీవలి కాలంలో చూసిన బెస్ట్ ఫిల్మ్ ఇదే. తప్పకుండా చూడండి.” అంటూ రాజమౌళి ఓ సినిమా గురించి చాలా కాలం తర్వాత మాట్లాడారు.


రాజమౌళి రికమెండ్ చేసారంటే ఖచ్చితంగా అందులో ఏదో విషయం ఉందన్నమాటే. ఎందుకంటే మహేష్ బాబు తో సినిమా చేస్తూ ఆ బిజీలో ఉన్నారు ఆయన. అలాంటి టైట్ షెడ్యూల్ లోనూ ఖాళీ చేసుకుని ఓ సినిమా అదీ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ అనే ఓ తమిళ సినిమా చూసి దాని గురించి ఖచ్చితంగా చెప్పాలనుకున్నారంటే మామూలు విషయం కాదు.

సాధారణంగా రాజమౌళి ఏదైనా సినిమా గురించి మాట్లాడితే, సోషల్ మీడియా జనంలో ఓ క్లాసిక్ డౌట్ రెడీగా ఉంటుంది . "ఆ డైరక్టర్ రాజమౌళికు పరిచస్దుడా? లేక నిర్మాత ఆయన స్నేహితుడా?" అంటూ.. కానీ ఈసారి అలాంటి బేక్డ్రాప్ ఏమీలేదు. ఇది ఆయన సర్కిల్ లో సినిమానే కాదు. తన స్కూల్ నుంచి వచ్చిన శిష్యుల సినిమా కూడా కాదు. స్కీమ్ లు, ప్రమోషన్ స్క్రీన్ ప్లేలు ఏమీ లేవు. ఇది పూర్తిగా కంటెంట్ మేడ్ డెసిషన్.



సినిమాలో విషయం ఉందనిపించి ఓ చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలనుకున్నారు. ఇంతకీ ఈ సినిమాలో ఏముంది, రాజమౌళి లాంటి ఒక విజువల్ విజన్ కలిగిన డైరక్టర్ కు అంతలా నచ్చటానికి కారణం ఏమై ఉండవచ్చు.

కథగా చూస్తే ...

ధర్మదాస్ (శశి) తన భార్య (సిమ్రాన్), ఇద్దరు కొడుకులతో కలిసి అక్రమంగా శ్రీలంక నుంచి చెన్నైకి వలస వస్తాడు. తన బావమరిది (యోగి బాబు) ప్రోత్సాహంతో చెన్నైలోని ఒక కాలనీలో ఇల్లు అద్దెకి తీసుకుంటాడు. ఈ కాలనీ అయితే చుట్టుపక్కల వారు చాలా హడావిడిగా ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉంటారు . కాబట్టి ప్రక్కవాళ్లు ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోరు కాబట్టి మీకు సేఫ్ అనే ఉద్దేశంతో యోగి బాబు అక్కడ వీరిని సెట్ చేసే పనిలో ఉంటాడు.
ఎందుకైనా మంచిదని చుట్టుపక్కల వారు పలకరించినా పలకరించవద్దు అని తన చెల్లి కుటుంబానికి సూచనలు చేస్తాడు. అయితే అందుకు భిన్నంగా ధర్మదాస్ సహా అతని కుటుంబ సభ్యులందరూ ఇతర ఫ్యామిలీలతో బాగా సన్నిహితం అయిపోతారు.
అయితే ఓరోజు...
చెన్నైని కుదిపేసే బాంబు పేలుడు.
మినిట్స్‌లోనే న్యూస్ చానెల్‌లో ఓ పేరు చెలామణి అవుతుంది —
"బాంబ్ బ్లాస్ట్ వెనక ఓ శ్రీలంక వలస కుటుంబం హస్తం!"
పోలీసులు రంగంలోకి దిగుతారు. కెమెరాలు కాలనీలోకి వచ్చేస్తాయి. అందరూ చూస్తారు... వారి మనసు తాకిన ఆ కుటుంబమే ఇప్పుడు నిందితులజాబితాలో ఉందా?
కుటుంబం ఏమైపోయింది? వారు నిజంగానే దొషులా? లేక ఓ సింపతీని క్రిమినలైజ్ చేసిన నిఘా వ్యవస్థ ఉత్పత్తా ఇది? చివరికి ఎవరు నిజంగా ఉగ్రవాదులు?

ఏమిటి ఈ చిత్రం ప్రత్యేకత?

"ఎంత చెప్పాలో తెలిసిన కథనం. Narrative Minimalism " ఇది మన తెలుగు,తమిళ సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించని కథన శైలి.
అలాగే ధర్మదాస్ పాత్ర, Character Arc సినిమాకి హైలెట్ . అతని తలపై అక్రమ వలసదారు అనే కత్తి వేళ్లాడుతోంది. అయినా అతను ఎవరిని నిందించడు. కోప్పడడు. తనకు చేతనైన మేరకు జనాలకు నిశ్శబ్దంగా సాయం చేస్తూంటాడు.
ఇక యోగిబాబు పాత్ర ఉందంటే అది సినిమాల్లో కామెడీగా ఉంటుంది. కానీ ఇక్కడ రిలీఫ్ కోసం కాదు. సోషల్ బ్రిడ్జ్ గా ఆ పాత్ర కనపడుతుంది.
అన్నిటికన్నా ఈ సినిమా మానవత్వం గురించి చెబుతుంది. కానీ ఎక్కడా స్లోగన్స్ ఉండవు.
Visual Storytelling ఈ సినిమాకు ప్రత్యేకత. ఒక్కో చిన్న కోణంలో చూపించే గదులు, దుస్తులు, ఫ్లాష్‌బ్యాక్‌లు… ఇవే సినిమాలో అజ్ఞాత స్వరాన్ని ప్రతిబింబిస్తాయి.
రాజమౌళి వంటి మాస్ మాస్ మేకర్ ఈ సినిమా గురించి పొగడటం అంటే… ఆయనకు ఒకటే విషయం స్పష్టంగా కనిపించి ఉంటుంది. అది కథ చెప్పే రీతిలో కొత్తగా ప్రెజెంట్ చేసిన సినిమా అవ్వటమే..

16 కోట్ల బడ్జెట్ తో రూపొందిన టూరిస్ట్ ఫ్యామిలీ ఖర్చుకు మించి లాభాలు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 75 కోట్లు వసూలు చేసింది. శశికుమార్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.
ఈ సినిమా దర్శకుడు ఒక యూట్యూబర్. అతను చేసిన ఒక ప్రయోగంలాంటి సినిమా.హ్యూమర్ విత్ హ్యూమానిటీ అనే ఒక సరికొత్త జానర్‌తో ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు.

ఓటీటీ రిలీజ్

థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన టూరిస్ట్ ఫ్యామిలీ త్వరలో ఓటీటీలోకి రాబోతోంది. జియో హాట్ స్టార్ ఓటీటీ హక్కులు కొనుగోలు చేసింది. మే 31న ఓటీటీలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News