రజనీకాంత్, రవితేజలకే షాకింగ్... ఈ వారం ట్రేడ్ టాక్

Update: 2024-02-11 11:17 GMT
రజినీకాంత్, రవితేజ (కుడి)

సంక్రాంతి తర్వాత మళ్లీ ఈ వారం భాక్సాఫీస్ బాగా వేడిక్కెంది. రవితేజ ‘ఈగల్‌’సినిమా ఒకటే సోలోగా వస్తుందనుకుంటే నాలుగైదు సినిమాలు క్యూ కట్టాయి. అందులో రజనీకాంత్ నటించిన ‘లాల్‌ సలామ్‌’కూడా ఉండటం విశేషం. వాస్తవానికి ఫిల్మ్ ఛాంబర్ వారు ఈగల్ కు సోలో రిలీజ్ ఇవ్వాలని చాలా ప్రయత్నం చేసారు. కానీ రకరకాల కారణాలతో అది జరగలేదు. అలాగే ఈగల్ సినిమా ట్రైలర్స్, పోస్టర్స్ చూసి దుమ్ము దులుపుతుంది అనుకుంటే అదీ అంతంత మాత్రమైపోయింది. ఈ క్రమంలో అసలు ఈ వారం ఏయే సినిమాలు రిలీజ్ అయ్యాయి..ట్రేడ్ లో వాటి పరిస్దితి ఏమిటో చూద్దాం.

'యాత్ర 2'
'యాత్ర' చిత్రానికి సీక్వెల్‌ 'యాత్ర 2'. ఆ చిత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కథతో వస్తే.. ఇది మాత్రం ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర స్టోరీతో రూపొందింది.



 తమిళ స్టార్ జీవా ప్రధాన పాత్రలో రూపొందిన పొలిటికల్ మూవీనే 'యాత్ర 2'. క్రియేటివ్ డైరెక్టర్ మహీ వీ రాఘవ్ తెరకెక్కించిన ఈ సినిమాకి ఆరంభంలోనే జస్ట్ ఓకే టాక్ వచ్చింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే ఓపినింగ్స్ గొప్పగా లేవు. మెల్లిమెల్లిగా ఆ తర్వాత కూడా ఇది క్రమంగా డౌన్ అవుతూనే వస్తోంది. ఫలితంగా ఈ సినిమాకు మూడో రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 35 లక్షలు షేర్ మాత్రమే వసూలైందని ట్రేడ్ టాక్. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.05 కోట్లు షేర్, రూ. 4.00 కోట్లు గ్రాస్‌ను మాత్రమే రాబట్టింది.


“ఈగల్”

మాస్ మహారాజ రవితేజ హీరోగా కావ్య థాఫర్ హీరోయిన్ గా యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రలో వచ్చిన సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “ఈగల్”. 



 టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా మార్నింగ్ షోకే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూడు రోజుల్లో అక్కడ బిలో యావరేజ్ గానే పెర్ఫామ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. బుకింగ్స్ కూడా తక్కువే కనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని ఏరియాల్లో మాత్రం బుకింగ్స్ యావరేజ్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. 


‘లాల్‌సలామ్‌’

లాల్ సలామ్ చిత్రం ...రజనీవంటి స్టార్ ఉన్నా యావరేజ్ స్దాయిలో కూడా బజ్ తెచ్చుకోలేక పోవటంతో చెప్పుకోదగ్గ ఓపినింగ్స్ రప్పించుకోలేదు.



 తెలుగులో అయితే కలెక్షన్స్ వైజ్ కూడా చాలా పూర్ గా ఉంది. మొత్తం మీద రెండు రోజుల్లో ఇండియా మొత్తం మీద 9  కోట్ల గ్రాస్ వచ్చింది. ట్రేడ్ పరంగా ఇవి చాలా డిజప్పాయింటింగ్ నెంబర్స్. శుక్రవారం నాడు 4.75 కోట్ల నుంచి 5 కోట్ల దాకావసూలయినట్లు చెబుతున్నా ఆందులో 3.50 కోట్ల నుంచి 3.75 కోట్ల దాకా తమిళనాడు వాట. తమిళ నాడు ఈ సినిమా వాష్ అవుట్. రజినీ కాంత్ కు ఉన్న సూపర్ స్టార్ ఇమేజ్ తో పోలిస్తే ఈ కలెక్షన్ చాలా చాలా పూర్.


ట్రూ లవర్

ఇదో డబ్బింగ్ సినిమా. బేబీలా ఆడేస్తుందేమో అని నమ్మకం కలిగించిన చిత్రం శనివారం రిలీజైంది.



 నిర్మాత ఎస్ కేఎన్ తన స్నేహితుడు, స్టార్ డైరెక్టర్ మారుతితో కలిసి మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటించిన తమిళ మూవీ లవర్ ను “ట్రూ లవర్” పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం చెప్పుకోదగ్గ కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోతోంది.


Tags:    

Similar News